సంచికలో తాజాగా

Related Articles

52 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి
    ఇతర సాంకేతిక నిపుణుల కు
    హృదయపూర్వక ధన్యవాదాలు.

  2. 2

    sagar

    మంచి అనుభవం సర్ . ఉద్యోగానికి వెళ్ళిన మొదటీరోజే మిమ్మల్ని విధి హెచ్చరించింది జాగ్రత్తగా మసలమని. అది కూడ మీకు ఒకందుకు మంచిదే అని నా అభిప్రాయం. మీ మొదటి అడుగే మీకు మార్గదర్శిని అయ్యింది అన్నమాట. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నీ స్పందన కు ధన్యవాదాలు
      సాగర్.

  3. 3

    బాపూజీ కానూరు

    మీ మొదట అడుగు మీ జీవితానికి మంచి పునాది వేసింది. జాగ్రత్త నేర్పింది. ఆ పునాది మీ జీవన సౌధం వెలుగు లీనింది. ప్రయాణం లో పదనిసలు జీవితంలో మధురానుభూతులు.
    మీజ్ఞాపకాల చిరుజల్లుల్లో మమ్మల్ని తడుపుతూ మార్గదర్శకత్వం వహిస్తున్నందుకు ధన్యవాదాలు..

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాపూజీ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  4. 4

    రమాదేవి బాల బోయిన/మృదువిరి

    మంచి అనుభవం సార్

  5. 5

    రాపాక అశోక్ కుమార్

    మామయ్య, మీ టెన్సన్ మాట ఏమో గాని, చదువుతున్న నేను మాత్రం చాలా టెన్సన్ కు గురి అయ్యాను. ఏది ఏమైనా ఉద్యోగంలో చేరిన తొలి రోజులు మరచచిపోలేము. అప్పుడు కంగారు పడినా ఇప్పుడు ఆ విషయాలు సంతోషాన్ని కలిగిస్తాయి.

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం సార్..
    జాగ్రత్తను గుర్తు చేసుకునే *అడుగు* జ్ఞాపకం ఓ హెచ్చరికనే.కొత్త మనసును కొంత ఆరాటంలోకి నెట్టివేయడం వల్ల వచ్చిన మరుపే.ఐతే ఆనాటి కాలం మంచిది.
    మీ పదాలు గబగబ చదివించేస్తాయి..అయ్యో!అప్పుడే ఐ పోయిందా అనేలోగా మరోవారం వచ్చేస్తుంది.
    —–డా.మల్లి కార్జున్
    హనంకొండ.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీస్పందనకు
      ధన్యవాదాలు.

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ మొదటి అడుగును భగవంతుడే అద్భుతంగా వేయించాడు. అందుకే మీరు ఇంత సున్నితంగా ఆలోచిస్తూ సేవ చేశారు. చేస్తున్నారు…సాహిత్య రంగంలో కూడా. మొదటి అడుగు తడబడినా ( సూట్ కేస్ తప్పిపోయి దొరకడం) నిలదొక్కుకున్నారు. ఇది భగవంతుడు మీకు తెలీకుండా చెప్పిన జాగ్రత్త. కారణం లేకుండా మన జీవితంలో ఏదీ జరగదు ఆన్న కర్మ సిద్ధాంతాన్ని నేను మనస్పూర్తిగా నమ్ముతాను. మీ అనుభవం బాగుంది….

    ——మారుతీ కిరణ్
    హైదరాబాద్.

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీస్పందనకు ధన్యవాదాలండీ.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇది నా జీవితంలో మూడు సార్లు జరిగింది. కానీ మీలా సూట్ కేస్ దొరకలేదు. ఒకసారి బాబు సూట్ కేస్ ఆటోలో మర్చిపోయాం. ఆటో మళ్ళీ కనబడలేదు. రెండుసార్లు పాప సూట్కేసు ట్రైన్లో మర్చిపోయాం. ట్రైన్ వెళ్ళిపోయింది.

    —-ప్రొఫెసర్. సుశీల
    హైదరాబాద్ (గుంటూరు )

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీస్పందనకు ధన్యవాదాలండీ

  9. 9

    Sarasi

    ఇటువంటి అనభవాలు ఎప్పుడు గుర్తకు వచ్చినా వొళ్లు కంపిస్తుంది. పెట్టె దొరికింది అదృష్టవశాత్తు.

  10. 10

    Bhujanga rao

    కఠోరశ్రమ,దృఢమైన సంకల్పం,తదుపరి వరించే విజయం చాలా సంతృప్తినిస్తుంది.మీరు ఎంచుకున్న వైద్య రంగంలో తొలి ప్రయత్నంలోనే డాక్టర్ గా తగిన ప్రాధాన్యతను సంపాందించారు.ఏ విషయాన్నైనా స్పష్టంగా చూడగలుగే మీరు,ఉద్యోగంలో చేరిన రోజు యాదృచ్చికంగా జరిగిన సంఘటన,మీరు పడిన టెన్షన్,అంతకు మించిన ఆనందం ఈ ఎపిసోడ్ లో తెలియ పరిచిన విధానం బాగుంది సర్.

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజం గ రావు గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  11. 11

    Sambasivarao Thota

    Prasad Garu!
    Mee modati roju udyoga anubhavam Baagundandi..
    Suit case thirigi dorakadam Adrushtam .. Shubhasoochakam..
    Dhanyavaadaalandi 🙏

  12. 12

    Ch S N Murthy

    ఆరోజు ఆ సూటేకేస్ దొరక్క పొతే ఏంచెయ్యాలి, ఎక్కడ ఎక్కడ తిరగాలి. వచ్చిన ఉద్యోగం పొతే మళ్ళీ ఉద్యోగం సంపాదించడం ఎలా? అసలు సర్టిఫికెట్స్ పొతే ఏం చెయ్యాలి. ఇలా మీ ఆలోచనలు ఆ అరగంట సమయంలో పరిపరి విధాలా పరుగేట్టి ఉంటాయి. ఆ ఆటో కనపడగానే కొంత ధైర్యం. ఆటో వాడితో ఎలా సంభాషించాలి అనే రిహార్శలు కూడ మీ మనసులో ద్విపాత్రభినయం చేసే ఉంటుంది. మీ అనుభవం మీకే కాదు అందరికి ఒక హేచ్చరిక. ఈ రోజుల్లో సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ సందేశాలు చదువుకుంటూ పరిసరాలను కూడా మరచిపోతున్నారు. ప్రమాదలకు కారకులౌతున్నారు.
    తస్మాత్ జాగర్త

    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా చెప్పారు మూర్తి గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    53వ సంచిక చదివిన సర్.
    నాకు బాగా నచ్చిన విెషయం మీరు ముందు చెప్పే ప్రొలాగ్ .పాఠకుడిని మీ సబ్జెక్ట్ లొకి తీసుకొని పొయ్యే పద్ధతి .ఒక మూడ్ కల్పించటం. దానివలన పాఠకునికి ఒక ఉత్సుకత కలుగుతుంది .ఒకవాతావరణం ముందేంకానుందొ అని తయారు గా ఉండే వాతావరణంఏర్పాటు ఔతుంది .కొంతమందికైనా మీకు ఎదురైన అనుభవం లొకి వచ్చి ఉంటది.అత్యుత్సాహంలొ పరిసరాలని మరచి పొవటం .అప్పుడప్పుడూ జరిగేదే. బాగుంది అభినందనలు

    ——రామ శాస్త్రి
    హనంకొండ.

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  14. 14

    Shyam

    ఈ కాలంలో అలా ఉద్యోగాలు వస్తున్నాయి చ ఇలా ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి మొదటి ఉద్యోగానికి అంత ప్రాముఖ్యత లేదు. కానీ మన రోజుల్లో ఒక ఉద్యోగం వచ్చింది అంటే జీవితాంతం అదే ఉండేది. ఒక ఉద్యోగం వచ్చింది అంటే మనకు మన జీవితంలో ఒక గొప్ప మార్పు మరియు మలుపు వచ్చినట్టే. ఒక కథ కు క్లైమాక్స్ ఉన్నట్టుగా మీ ఉద్యోగం వచ్చింది ఒక ఒక ఎత్తు అయితే మీ సూట్కేసు దొరకడం ఇంకా పెద్ద సంతోషమైన విషయం. మొట్టమొదటి పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్ రోజు, మొట్ట మొదటి ఉద్యోగం అలాగే మొదటి జీతం, పెళ్లయిన మొదటి రోజు ఎప్పుడు తలచుకున్నా అపరిమితమైన ఆనందాన్నిచ్చే సంఘటనలే. వాటిలో కాస్త అడ్వెంచర్ మిక్స్ అయితే ఇంకా బాగుంటుంది .అది మీకు జరిగింది ప్రసాద్. మీరు జీవితంలో పడిన కష్టాలకి చేసిన కృషికి తగిన ప్రతిఫలం అన్నది మీ ఉద్యోగమే. ఆ మొదటి దినాన్ని ఎన్నిరోజులు ,ఎన్నిసార్లు తలచుకున్నా సరే అది చాలా సంతోషమైనదే.

    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యామ్
      నీ విశ్లేషణకు
      ధన్యవాదాలు.

  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అద్భుతం!

    —–విష్ణు మూర్తి. చదలవాడ
    హైదరాబాద్

  16. 16

    Jhansi koppisetty

    హహహ….బావుంది…. ఈ అలవాటు అనాదిగా వస్తున్నదేనా😃😃😃
    మా ఇంటికి వచ్చినప్పుడు ఆటోలో పుస్తకాలు మరిచిపోయి ఎంత కంగారు పడ్డారో గుర్తొచ్చింది. అవి పుస్తకాలే…మరి సర్టిఫికేట్స్ పోతే మీ అప్పటి పరిస్థితి ఊహించటానికే భయంగా వుంది. దొరకటం నిజంగా మీ అదృష్టమే

    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీస్పందనకు ధన్యవాదాలండీ

  17. 17

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మొదటి అడుగు అనుభవం చదువుతుంటే అక్కడే మీ పక్కనే ఉండి ఆ సన్నివేశాన్ని చూస్తున్నంత ఉత్కంఠ కలిగింది.అప్రమత్తత ఎంత అవసరమో కళ్ళకి కట్టినట్లు చూపారు.దేవుని దయ వల్ల సూట్కేస్ దొరకడం జీవితం తిరిగి దొరకడం అంత ఆనందాన్ని ఇచ్చింది.లేకపోతే ఉద్యోగం మొదటిరోజు చేదు అనుభవం మిగిలిపోదును.అప్రమత్తత ఆవశ్యకత తెలిపిన మీ ఈ అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు సర్🙏💐

    —–నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ.

    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు

  18. 18

    బి.జానిభాష

    మీరన్నట్టుగా మీ జీవితంలోని సంఘటనలు యువతకు మార్గదర్శకంగా ఉంటాయి అనడం లో ఏమాత్రం అతిశయోక్తికాదు సర్.
    మీ ఉద్యోగ జీవితంలోని మొదటి అడుగు లో సూట్ కేస్ ఆటోలో మరిచిపోయినప్పుడు మీరు పడ్డ టెన్షన్ ఎలాంటిదో అర్థం అయ్యింది సర్….దీని ద్వారా ముఖ్యమైన సందర్భలలో మనం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అర్థం అయ్యింది సర్.
    అప్రమత్తంగా లేకపోతే ఒక్క సంఘటన వల్ల జీవితాలు తలక్రిందులు అయ్యే అవకాశం ఉంది సర్.
    మీ జీవితంలోని జ్ఞాపకాలను మాతో పంచుకున్నందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు సర్.

    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      జానీబాషా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  19. 19

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన మాకు మార్గదర్శకత్వం తో కూడిన ఓ హెచ్చరిక సార్ 🙏జీవితంలో స్థిరపడటానికి మీరు వేసిన మొదటి అడుగు చాలా ఉత్కంఠ భరితమైనది ఆనాటి మీ పరిస్థితిని తలుచుకుంటే చాలా భయమేసింది సార్. ఇది ప్రతి ఒక్కరికి జాగరూకతతో కూడిన మేలుకొలుపుల వ్యాసం
    మీ చక్కని రచనా శైలి ఉపోద్ఘాతము అభినందనీయమైనది సార్ 👏🙏👏🙏👏🙏👏 హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐💐💐💐💐💐💐💐🙏💐

    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      నీ స్పందన కు ధన్యవాదాలు.

  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఉద్యోగ రీత్యా మొదటి అడుగులోనే గొప్ప పునాది పడింది. జీవన ప్రయాణం మనకు ఎన్నో అనుభవాలు నేర్పుతుంది అనడం లో మీ ఉదాహరణ చాలు. శుభోదయం 🙏

    ——ప్రొఫెసర్. రవి కుమార్
    నిట్-వరంగల్లు.

    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Elders say that Sometimes things happen for a reason.
    This makes us to Assuage things better.
    Everyone will have such experience atleast once in their life time. The specialty lies in when we adress it and implement it further.
    Thank you sir for sharing and making us not repeat/ alert not to repeat such things.

    —–Dr.Harika
    Kareem nagar.

  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ మరపు తో తొలి ఉద్యోగం బ్రహ్మం డంగా ఉంది కథ. మంచి ఉత్కంఠ ఉంది మీ కథ లో.
    నిజం గా ఇలాంటి అనుభవం ఎవరికి రాకూడదు. మీరు చాలా అదృష్టవంతులు మీకు మీ సూట్ కేస్ దొరికింది.

    ——డాక్టర్. డి.సత్యనారాయణ.
    హైదరాబాద్.

    1. 22.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  23. 23

    డి.వి.శేషాచార్య

    డాక్టర్ గారూ

    ఈమధ్యే ఇలాంటి సంఘటన కరీంనగర్ లో నాకూ ఎదురైంది. కాకపోతే నాది మొబైల్. మీ ఆటోవాలా లాగే మా ఆటోవాలా కూడా మొబైల్ ను చూడలేదు. ఇంట్లోకి అడుగు పెడుతూనే నా జేబులో మొబైల్ లేదని గుర్తించి రింగ్ ఇచ్చా. అప్పుడు గాని ఆటోవాలా గుర్తించాడు. సర్ బస్టాండ్ వద్దనే ఉన్నా.వచ్చి తీసుకోండి అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఆటోవాల లేడు. ఆశ వదులుకున్నా. కానీ నన్ను చూసి మరో ఆటోవాల నా దగ్గరకు వచ్చి సార్ అతనికి వేరే గిరాకి దొరికింది. వెళ్లాడు. మీరు వస్తే పది నిమిషాలు వెయిట్ చేయమని చెప్పమన్నాడన్నాడు. ఆశ్చర్యం వేసింది. ఎంత నిజాయితీ. అతను వచ్చి నా మొబైల్ నాకిచ్చేసాడు. కృతజ్ఞతలు తెలిపి ఓ రెండు వందలు బలవంతంగా చేతిలో పెట్టి ఇంటికి చేరాను.
    సరిగ్గా రెండు రోజుల తర్వాత నా కొలీగ్ ఇలాగే మొబైల్ పోగొట్టుకుంది. కానీ దొరకలేదు.

    మీ జ్ఞాపకాల పందిరి ఇదిగో ఇలా మా జ్ఞాపకాల ను తట్టిలేపుతోంది. అభినందనలు.

    1. 23.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  24. 24

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్కారం🙏
    మీ మొట్టమొదటి చేదు అనుభవాన్ని చాలా మధురంగా వివరించారు .కానీ మనస్సు చంచలమైనది అంటారు కదా పెద్దలు. అందుచేత నేమో అప్పుడప్పుడు ఇటువంటి అనుభవాలు ఎదురైనా జీవితంలో జాగ్రత్తగా మెలగాలి అనుకుంటేనే ఒక్కోసారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాము.మీ శీర్షిక చదివిన కొందరు పాఠకులు అయినా జాగ్రత్తగా మసలుకుం టారని ఆశిద్దాం.
    ఈ సంఘటన చదివిన తర్వాత నాకు నా జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకం ఒకటి గుర్తుకు వచ్చి మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది .అది 2002 వ సంవత్సరము .నేను నా శ్రీమతి ,హైదరాబాద్ నుండి మా తమ్ముడు ,మరదలు ఇద్దరు ఆడపిల్లలు అందరము కడపకు మా కజిన్ బ్రదర్ అమ్మాయి వివాహ సందర్భంగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో కాచిగూడ నుండి 8: 30 నిమిషాలకు బయలుదేరాం. సరైన టైంకి అంటే నాలుగు 4:30 నిమిషాలకు కడప రైల్వే స్టేషన్లో దిగిపోయి ఆటో స్టాండ్ కెళ్ళి రెండు ఆటోలు మాట్లాడుకొని పెళ్లి వారి ఇంటికి 5 5:30 మధ్యలో చేరుకున్నాం. కుశలప్రశ్నలు అయిన తర్వాత మాకు కేటాయించిన గదుల్లో మా సూట్ కేసులు సర్దుకున్నాము.కాఫీలు, టిఫిన్లు అయిన తర్వాత పది గంటలకు అమ్మాయిని పెళ్లికూతురు చేస్తారు రెడీ కండి అని చెప్పటంతో స్నానాదులు ముగించుకొని మగవాళ్ళ ముందుగానే తయారై పెళ్లిపందిరి లో కూర్చున్నాము. ఒక అర్ధ గంట తర్వాత మా తమ్ముడి పెద్దమ్మాయి మా దగ్గరికి వచ్చి ఒక సూట్కేసు కనిపించుటలేదు అది మాకు కేటాయించిన గది లో ఏమైనా ఉందా అని అడిగింది .సరే చూద్దామని మేము లోపలికి వెళ్లి అన్ని రూముల్లో వెతికినా ఆ అమ్మాయి అడుగుతున్న సూట్ కేస్ కనిపించలేదు. మేమందరము అక్కడ ఇక్కడ వెతికినా ఫలితం లేకపోయింది. నాకు చాలా క్లియర్ గా గుర్తుంది ట్రైన్ లో నుంచి అన్ని బ్యాగ్ లో తీయటం ,తర్వాత ఆటోలలో సర్దటం. రకరకాల ఆలోచనలతో బుర్రలు వేడెక్కి పోయాయి .అసలు విషయము….. ఆ సూట్ కేసు లో ఆడపిల్లల పట్టు బట్టలు ,మరియు దగ్గర దగ్గర ఆరోజుల్లోనే మూడు లక్షల ఖరీదు చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయట .ఆ విషయం విన్న తర్వాత అందరము నీరసించిపోయాము.సరే చేసేదేమీ లేక నేను ,నా తమ్ముడు లోకల్ గా ఉన్న బంధువు, అందరమూ కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, అలాగే రైల్వే స్టేషన్ లో కూడా తెలిసిన వారికి విషయం చెప్పి తిరిగి ఇంటికి వచ్చేసి రకరకాల ఆలోచనలతో తదుపరి కార్యక్రమాలు చూస్తున్నాం .
    కష్టపడి సంపాదించిన సొమ్ము ఎక్కడికి పోదు అనేదానికి ఉదాహరణ ఏమో కరెక్ట్ గా 12 గంటలకి దేవుడు పంపించినట్లు మమ్మల్ని ఎవరైతే ఇంటి దగ్గర ఆటోలో దిగ
    పెట్టాడో అతను ఒక సూట్కేస్ తో మా దగ్గర వచ్చాడు .ముందుగా అతనిని మేము చీకట్లో చూడటం వల్ల ఎవరో పెళ్ళికి వచ్చిన బంధువు అనుకున్నాం .తర్వాత అతను సార్…… మీరు ఆటో లో రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి వచ్చారు కదా… మీ సూట్ కేసు ఇందులోనే ఉండి పోయింది ,అని మాకు అందించాడు .అసలు విషయం ఏంటంటే ఆ ఆటోవాలా రాత్రి డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళిపోయి ఆటోను ఇంటి ముందు పార్క్ చేసుకున్నాడట. అది ఆదివారం కావటం వల్ల ఆ కాలనీలోఉంటే పిల్లలు ,ఇతని పిల్లలు అందరూ దాగుడు మూతలు ఆడుకుంటూ ఈ ఆటో ఎక్కి దిగుతున్నప్పుడు ఒకడికి ఈ సూట్ కేస్ కనిపించిందని ,ఆ విషయాన్ని ఆటో యజమానికి చెప్పడం వలన అతను గమనించి ఇది మాదే అని నిర్ధారించుకుని ఇక్కడికి తీసుకు వచ్చాడు. మేము ఎంతో సంతోషించి అతనితో పాటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇన్స్పెక్టర్ కి విషయము చెప్పి ,కంప్లైంట్ విత్ డ్రా చేసుకొని ఒక వెయ్యి రూపాయలు నజరానా అతనికి ఇస్తే అది ఇన్స్పెక్టర్ ద్వారా అందుకొని సంతోషంగావెళ్ళిపోయాడు. మరుసటి రోజు అతని నిజాయితీని పొగుడుతూ ఫోటో తో సహా ఈ విషయాన్ని లోకల్ పత్రికలో కూడా ప్రచురించారు.
    ఈ సంఘటనలో మరొక ట్విస్ట్ ఏమిటంటే ఎవరైతే సూట్కేస్ పోగొట్టుకున్న మా తమ్ముడు హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో క్రైమ్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తుండేవాడు. తను పోలీస్ అని చెప్పుకుంటే అక్కడ ఇన్స్పెక్టర్ ఏమి తిడతారో అని ఆ విషయాన్ని అక్కడ ఎవరికీ చెప్పలేదు . ప్రస్తుతం తను 2020 మార్చి లో సబ్ ఇన్స్పెక్టర్ గా రిటైర్మెంట్ అయ్యి హైదరాబాదులో స్థిరపడ్డాడు .

    —-బి.ఎన్. కృష్ణా రెడ్డి
    సఫిల్ గూడ
    సికింద్రాబాద్.

    1. 24.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  25. 25

    Dr.Harika

    Good evening sir,
    Elders say that Sometimes things happen for a reason.
    This makes us to Assuage things better.
    Everyone will have such experience atleast once in their life time. The specialty lies in when we adress it and implement it further.
    Thank you sir for sharing and making us not repeat/ alert not to repeat such things.

  26. 26

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Its really a miracle. God will always protect good people. He only test.
    I can imagine the tension you underwent for about 15-20 minutes.

    —-Surya narayana rao
    Hyderabad.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!