సంచికలో తాజాగా

Related Articles

29 Comments

  1. 1

    Jhansi koppisetty

    విభిన్నమైన అద్భుత కథ. చాలా ఆసక్తికరంగా ఆసాంతం చదివించింది. I couldn’t come out of the impact of the story immediately…. It provoked lot many thoughts in me…. Thank you for the wonderful story Muralikrishna garu😊😊

  2. 2

    కస్తూరి మురళీ కృష్ణ

    మా అహంకారికి ఈ ఔషధం ఇవ్వండి డాక్టర్ గారూ. సారీ. ప్రొఫెసర్ గారు..
    Comment by sri OS Sarma

  3. 3

    మథు చిత్తర్వు

    విరుగుడు తన దగ్గరే వున్నా ఏది విరుగుడో తెలియక , వున్నా ఎలా చెయ్యాలో అర్దం కాక గింజుకునే ఆత్మ…అహం అంతం చేసి ఆత్మని ప్రకోపించే మందులు…
    చాలాసార్లు చదవాలి .చదివితే ఓ మిస్టిక్ ఎక్స్ పీరియన్స్ కలిగించే వినూత్న మైన కథ.

  4. 4

    కస్తూరి మురళీ కృష్ణ

    Comment by sri Gangishetty Lakshmi Narayana
    బ్రహ్మాoడంగా ఉంది… సైన్టిఫిక్ థ్రిల్లర్+ కస్తూరి చాగంటి ప్రసంగం కలబోసినట్టు…. మీ స్టైల్ లో…👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  5. 5

    చెంగల్వ రామలక్ష్మి

    వినూత్నమైన కథ. చాలా బాగుంది సర్.

  6. 6

    పుట్టి. నాగలక్ష్మి

    “నేను అనే అహాన్ని వదిలించుకోవటం” గురించిన ఈ కథ వినూత్నంగా ఉంది. అభినందనలండీ!

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కథను చెప్పడంలో
    కొత్త ప్రయోగం చేసారు. మీ కథల ప్రయోగశాల.వినూత్న మూ
    అత్యంత ఆధునికం గానూ వుంది.
    అహం…పరిశోధనలో…విరుగుడు పనిచేయక పోవడం
    కథకు మలుపు అయినప్పటికీ…విరుగుడు మందుకు లెబిల్ చేయక పోవడానికి కూడా ‘ అహం’ కారణం అనుకుంటాను.
    మంచి కథ అందించిన మీకు శుభాకాంక్షలు.
    ____డా.కె.ఎల్.వి.ప్రసాద్,
    హనంకొండ-506004

  8. 8

    Kovela Santosh Kumar

    Kondaru Journos ku ivvalsina Mandu… Idi.. kaasta ekkuva dose lu tayari cheyandi…

  9. 10

    Sambasivarao Thota

    Mee kathalo Scientific view vundi..Vedaantha dhorani vundi…
    Practicality koodaa vundi…
    Emaithene vishayamaithe ardhamaindi..
    Nizaaniki Chaalaa goppagaa vundandi
    mee katha..
    O noothana prayogam ..
    O adbhutha prakriya …

    Meeku Abhinandanalu..
    👌👏💐
    Abhivandanalu ..
    🙏🙏🙏

  10. 11

    Srinivasa Prasad

    చక్కని మానసిక విశ్లేషణాత్మకమైన కథ..నిజం చెప్పాలంటే చాలామందిలో ఈ కథలోని పాత్రలలో ఏర్పడే మానసిక సంఘర్షణ జీవితంలో ఏదో ఒక స్థితిలో బలంగా కలుగుతూంటుంది. మంచి రచనను, విభిన్నమైన కథనంతో అందజేసినందుకు ధన్యవాదాలు.

  11. 12

    Muralikrishna

    Comment by vihari
    నమస్తే సార్…. అద్భుతంగా ఉంది… సైన్స్ ప్లస్ థ్రిల్!!!
    సర్రియలిజంనీ దట్టించారు కథనంలో!
    హృదయపూర్వక అభినందనలు….

  12. 13

    అరుణ్ కుమార్

    చక్కని కథ.

  13. 14

    Bhuvanachandra

    ఫెంటాస్టిక్

  14. 15

    Muralikrishna

    Comment by smt ch Suseela
    కథకు “విరుగుడు”, ప్రొఫెసర్ గారికి “పరబ్రహ్మం” పేరు పెట్టడంలోనే రచయితను అభినందించాలి. తీసుకున్న అంశమేమో ” అహం”. అహం అనే సమస్యని ఎలా చేయించాలి మానవుడు? ఇది సాధ్యమేనా అని ప్రొఫెసర్ గారు ప్రయోగం చేస్తున్నారు “ప్రయోగశాలలో” అని అన్యాపదేశంగా చెప్పారు రచయిత. కానీ ఆ ప్రయోగశాల మన “మనసే”.ఆ అహాన్ని నియంత్రించే క్రమంలో రసాయనాల సమ్మేళనాల ఉధృతికి అర్భకుడు తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతాడు. అంటే- అందరూ అహాన్ని అంత తేలిక చేయించ లేరు అన్నమాట. క్రమంగా ఏమిటి, ఎందుకు అనే ప్రశ్న ఉద్భవించాయి అతను మేల్కొన్నాక. ప్రశ్నలేగా ఉన్నతికి సోపానాలు! కథానాయకుడికి పేరు పెట్టలేదు “నేను” అనటం లోనే ” అహం” కి ప్రతినిధి అని తెలుస్తోంది. అన్ని సమస్యల కి “విరుగుడు” “మందు” ఎదురుగానే ఉంది. కానీ మనిషే దాన్ని కనుక్కోవడం లో విఫలమవుతున్నాడు. నిస్సహాయుడవుతున్నాడు. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే కథ “విరుగుడు”.

  15. 16

    Sridhar

    భయమేసింది‌.

  16. 17

    కస్తూరి మురళీ కృష్ణ

    Comment by sri Lakshmanachakravarthy
    కథను గొప్పగా నిర్మించారు. అహానికి ఆత్మ స్వేచ్ఛ విరుగుడు. బాగుంది.

  17. 18

    Vyankatesh

    Katha chala bagundi sir.

  18. 19

    కంచనపల్లి వేంకట కృష్ణారావు

    కొత్త రకంగా మలచిన కథ, కొస మెరపు కూడా ఆసక్తికరంగా ఉంది
    ……కృష్ణారావు

  19. 20

    b.v.n.swamy

    అహం,పరబ్రహ్మం,మాయానగరం,నేను,ఇదొక వాతావరణం. శక్తి,దానిఫలితం,భౌతికత,భావం ఇదొక ఆవరణ. ప్రయోగశాల,పుస్తకాలు పై రెంటి మద్య వాహకాలు. భావానికి,పదార్థానికి మధ్య సంవాదం.ప్రోఫెసర్ శాస్రవేత్తగా పనిచేస్తూ,వేదాంతిగా ఆలోచించడం. విరుగుడు పక్కకే ఉన్నా తెలియకపోవడం. ఇదంతా కథ పై పొర. దీన్ని తొలగించడమే కథ లోని అంతరార్థం.నేరుగా తెలిపితే అనేక ప్రశ్నలు పుట్టుకొస్తయి.ఎవరికి వారు తెలుసుకోవడమే అనివార్యం.కథా సంవిధాన విజయం.అహం ను కథావస్తువు గా తీసుకోవడమే కొత్తదనం. నడపడం లో వైరాగ్యం తోడ్పడడం కొత్తదనం. కస్తూరి పరిమళం వ్యాపించింది
    b.v.n.swamy

  20. 21

    నరసింహమూర్తి

    సర్ కేవలం ఒక కథగా మాత్రమే అభిప్రాయం చెప్పాలంటే కొత్తగా ఉంది మంచి ప్రయత్నం అనేయవచ్చు. కాని నన్ను దాదాపు ఒకరోజు ఆలోచింపజేసిన రచనగా నా ఆలోచనలు కూడా పంచుకోవాలని ఉంది. నన్ను నమ్మినా మానినా నాపై పూర్వనిర్ధారిత అబిప్రాయాల ప్రభావం ఉండదు. కనీసం నేను కాన్షస్ గా ఆ ప్రయత్నం చేస్తాను. ఉపోద్ఘాతం వదిలితే నా ఆలోచనలు ఇవి1. అహం అనే మన భావనకీ ఈగో అనే ప్రాశ్చాత్య భావనకీ తోడా ఉంది. మనం ఈగో ని అలా అనువాదం చేసుకుంటాం. 2. మన అహం అనే పదం వ్యక్తం చేసేభావం కోహం అనే ప్రశ్న నుంచి వచ్చింది. ప్రకృతిలోంచి విడివడని మానవుడు చుట్టూ చూస్తూ తనని తాను గుర్తుపట్టటానికి చేసే ప్రయత్నం నుంచి ఇది పుట్టి ఉండాలి. దానికి జవాబుగా సోహం అనేది అద్వైత భావనగా వచ్చింది. నేను సర్వాన్నీ అనే కృష్ణుడి ఉవాచగా చెప్పే విభూతియోగం లోని మాటకు సమాధానంగా నువ్వూ నేనూ కలగలిసిపోయినవారం, ఒకటే అనే మానవుని సమాధానం సోహం. 3. ఇలా ఆలోచించినపుడు తనను తాను వేరొకరిగా చూసుకునే లేదా చూసేట్టు చేసే రసాయనిక చర్య మీ కథలో చక్కని సైంటిఫిక్ ఫిక్షన్ ఊహ. 4. ఇది విడగొట్టటం. (వియోగం) అనే ఆలోచన. మన పూర్వ భావన లేదా అద్వైత భావన సంయోగం(తనను పరమాత్మతో కలపటం) . 5. ఈ రసాయనిక చర్య అనే ఊహ తనను సమస్తంతో సంయోగం చేసుకునే చర్యగా ఉంటే ఎలా ఉంటుంది అనిపించింది. అది మన భావనకి దగ్గరగా ఉండొచ్చనిపించింది. 6. నేను ఫలానా అనే భావనకి మానవజాతి ప్రస్థానంలో చాలా ప్రాధాన్యత ఉంది. నేను అన్నింటిలోనూ ఒకరిని అనే భావన నాకు చాలా ఇష్టమైనది. ఇది ఫలానా అనే భావన నుంచి ఊర్ధ్వముఖ ప్రయాణంలో మానవుడు కనుగొన్న సత్యం. అది అద్వైత భావనలో నాకు కనిపిస్తుంది. పరమాత్మ అనే భావన పట్ల నాకు నమ్మకం లేదు సమస్తం సకలం సర్వస్వం అనే భావనని మన పూర్వులు అలా వ్యక్తం చేసారని పిస్తుంది నాకు. 7. రచయిత కథ వెనక అతని భావజాలం ప్రేరణా ఏమైనా అది పాఠకుడికి భిన్నమైన ఆలోచనలు ఇస్తుంది. అది కథ వైఫల్యం కాదు. సాఫల్యం అనే నేననుకుంటాను. 8. ఆలోచనల ఉద్వేగంలో రాసాను. ఇబ్బంది పెట్టి ఉంటే మన్నించి అర్ధంచేసుకోగలరు.
    (psకోహం అనేది శబ్దాలకి నిర్దిష్టమైన సంకేతాలు(భాష) ఏర్పడుతున్న దశలోనిది. అహం అనేది(ఆ పదం కాదు) భాషకి ముందుది అని నా ఊహ.)

  21. 22

    C S N MURTHY

    Sir…అద్భుతమైన Science fiction కధ రాసారు…thought provoking గా వుంది….ప్రొఫెసర్ గారికి ఒక భార్య కానీ లేక ఒక cook పాత్రని గానీ, ఆయన దగ్గర పనిచేసె ఒక Assistant పాత్రని, నేను అని చెప్పుకుంటున్న హీరో గారికి ఒక love interest పాత్ర ఆ అడవిలో బ్రతుకుతున్న ఓ అందమైన అమ్మాయి ( హీరొయిన్) పాత్రల్ని
    add చేసి (create) చేసి కధని కొంచం elaborate గా తయారుచేసి డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారి లాంటి వాళ్లకి మీరు ఇవ్వగలిగితే ఒక మంచి సైన్స్ fiction సినిమా తయారయే అవకాశం వుంది…ఆలోచించండి….నేను fiction చదవడం మానైసీ చాలా రొజు లయింది…ఎందుకో మీ పేరు చూసి చదవడం మొదలెట్టా..you have not disappointed me..ఒక మంచి కధ చదివిన అనుభూతిని మిగిల్చారు… gripping narrative… అర్ధరాత్రి దాటి రెండు గంటలయింది….మిమ్మల్ని అభినందింంచే
    వరకూ నిద్ర పోకూడదని అనుకుని ఈ నాలుగు మాటలు!!…

  22. 23

    కస్తూరి మురళీ కృష్ణ

    Comment by CSN Murthy
    Sir…అద్భుతమైన Science fiction కధ రాసారు…thought provoking గా వుంది….ప్రొఫెసర్ గారికి ఒక భార్య కానీ లేక ఒక cook పాత్రని గానీ, ఆయన దగ్గర పనిచేసె ఒక Assistant పాత్రని, నేను అని చెప్పుకుంటున్న హీరో గారికి ఒక love interest పాత్ర ఆ అడవిలో బ్రతుకుతున్న ఓ అందమైన అమ్మాయి ( హీరొయిన్) పాత్రల్ని
    add చేసి (create) చేసి కధని కొంచం elaborate గా తయారుచేసి డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారి లాంటి వాళ్లకి మీరు ఇవ్వగలిగితే ఒక మంచి సైన్స్ fiction సినిమా తయారయే అవకాశం వుంది…ఆలోచించండి….నేను fiction చదవడం మానైసీ చాలా రొజు లయింది…ఎందుకో మీ పేరు చూసి చదవడం మొదలెట్టా..you have not disappointed me..ఒక మంచి కధ చదివిన అనుభూతిని మిగిల్చారు… gripping narrative… అర్ధరాత్రి దాటి రెండు గంటలయింది….మిమ్మల్ని అభినందింంచే
    వరకూ నిద్ర పోకూడదని అనుకుని ఈ నాలుగు మాటలు!!…

  23. 24

    వసుంధర

    ఉపనిషత్తుల సారాన్ని సైంటిఫిక్ థ్రిల్లర్‍గా మలచడంలో రచయిత చూపిన ప్రజ్ఞ అపూర్వం. ముగింపు కథ విలువని పెంచింది. చెప్పదల్చుకున్న అంశాలపై చెప్పుకోతగ్గ జ్ఞానం, పరిజ్ఞానం, పరిణతి ఉన్నవారికే ఇలా వ్రాయడం సాధ్యం. ఆలోచింపజేసే ప్రయోజనాత్మక మనో విశ్లేషణకు అభినందనలు.

  24. 25

    m.k.kumar

    1 కథ బాగుంది
    2 సస్పెన్సు వల్ల కథ చదవాలనే కుతూహలం ఏర్పడింది
    3 సర్రియలియజం సరిగా పండలేదని అనిపించింది
    4 కథలో ముగింపు సరిగా లేదు
    5 ఈ తరహా కథలు గతంలో వచ్చాయి
    6 సైంటిఫిక్ ఫిక్షన్ కథలు విదేశీ రచయితలే ఎక్కువ రాస్తున్నారు
    7 సైన్సును, సంప్రదాయాన్ని కథలో చూపించే క్రమంలో కొంత గందరగోళం నెలకొంది. ఇది కథను బలహీనం చేసింది. సీరియస్ గా తీసుకోవలసిన కథ కేవలం వినోదంగా మిగిలిపోయింది

  25. 26

    G.S.lakshmi

    అద్భుతమైన కథ..

  26. 27

    జియో లక్ష్మణ్

    అహం తో ఉండటం, ఉండకపోవడం రెండింటికి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం వలన కలిగే మార్పు మందుల వలన కూడా శరీరంలో కలుగుతుంది. పతంజలి యోగ సూత్రాల్లో ఆ ప్రస్తావన ఉంది. కథ లో దీన్ని పెట్టి, నాటకీయత అద్దడం బావుంది. అహం విడుదల చేసే రసాయనాలు శరీరంలో ఎక్కువైనా, తక్కువైనా అసమతుల్యత ఏర్పడుతుంది. అది ఒక స్థితి. దానిని అనుభవించాల్సిందే! అభినందనలు.

  27. 28

    ఎమ్మెస్వీ గంగరాజు

    గ్లాసు క్రింద పడిపోవడం, దానిని అతడు తీసి ఇవ్వడం – కథకి సంబంధం లేని విషయం. ఆ సంఘటన ‘ఎందుకు కథలో చొప్పింఖచారా?’ అనుకుంటూనే కథని చదవడం కొనసాగించాను. కానీ, ఇలా ఊహించలేదు. మంచి కవులు తమ కవితల్లో వ్యర్థ పదాలనెలా ఉపయోగించరో, మంచి కథకులు తమ కథల్లో వ్యర్థ సంఘటనలు చొప్పించరు. మంచి కథ చదివేను అనే మిగిలింది కథ చదివేక. అభినందనలండీ.

  28. 29

    శ్రీధర్ చౌడారపు

    ఈ కథ నేను గతంలో చదివినట్టున్నాను. ఏదైనా వారపత్రికలో వచ్చిందా లేక విపులలో వచ్చిందా…? ఆసాంతం ఆసక్తికరంగా ఉంది. క్లైమాక్స్ అదిరింది. అభినందనలు మురళీకృష్ణ గారూ…!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!