సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    venkatbhattu

    నమస్తే Sir!
    నా పేరు భట్టు వెంకటరావు. కందుకూరు TRR Govt Arts & Science College పూర్వ విద్యార్ధిని (1972-77). ఇంటర్మీడియట్, BSc కలిపి ఐదేళ్ళు ఆ కాలేజి లోనే నా విద్య అంతా జరిగింది. తెలుగు సాహిత్యం అభిమాన అంశం అయినప్పటికీ చదువుకునే అవకాశం కలగలేదు. రిటైరైన తరువాత ప్రస్తుతం తెలుగు సాహిత్యానికి సంబంధించిన అంశాలపై చిన్న చిన్న వ్యాసాలు రాస్తూ కాలం గడుపుతున్నాను. కందుకూరు విషయాలు మీరు వ్యాసంలో ప్రస్తావించిన చాలా విషయాలను నేను ఇప్పటికీ నిన్న మొన్న జరిగినవిగా మననం చేసుకోగలను. జనార్దనస్వామివారి ఆలయానికి రెండు మూడు ఇళ్ళ అవతల ఒక చిన్న గదిలో మరొక స్నేహితునితో కలిసి అద్దెకు ఉండేవాడిని. 1979 లో వచ్చిన తుఫానులో పాత కాలేజీ బాగా దెబ్బతింది. 1981-82 ప్రాంతాలలో ఒకసారి visit చేసినపుడు నేను తీసిపెట్టుకున్న ఫోటోలు చూసుకున్నపుడు చాలా విషయాలు జ్ఞాపకం వస్తాయి. Botany lab గోడను ఆనుకుని ఉండిన చిన్న పూలతోటలో అంబ విగ్రహం, ఇవతలి వైపు గేటు దగ్గర పెద్ద వేపచెట్టు, బారుగా మూడు వరసలలో రేకుల కప్పుతో క్లాసు రూములు, ఆ చివర chemistry lab, ఆ lab ముందు dias, dias ముందు పెద్ధ ఖాళీ ప్రదేశం…ఇదంతా ఇంకా నాకు కళ్ళముందే ఉంది. ఫోటోలు ఇక్కడ post చేసే సదుపాయం లేదు. లేకుంటే కొన్ని పోటోలు post చేసేవాడినే. మీ పాఠం వినే అవకాశం ఆ రోజులలో నాకు కలగలేదు కాని మీరు తెలుసు. కందుకూరు రోజులను మరోసారి గుర్తుచేసుకునే సందర్భం మీ వ్యాసం కలిగించింది. ధన్యవాదములు!

    నిన్న (సోమవారం) ‘నవతెలంగాణ – దర్వాజ’ సాహిత్యం పేజిలో ‘హరిభట్టు-వేమనపద్యపాఠం’ పేరుతో నాది ఒక చిన్న ఆర్టికిల్ ఉంది. మీకు వీలైనప్పుడు చూడగలరు.

    నమస్కారములతో…
    భట్టు వెంకటరావు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!