సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    జ్యోతి గారు సంచికకు ఇచ్చిన ఇంటర్వ్యూ అద్భుతంగా వుంది .వారి ఆలోచనా విధానం, భావాలు , వారి ఖచ్చితత్వం, రాజీపడని మనస్తత్వం, నిర్దిష్టాభిప్రాయాలు నాకు చాలా చాలా నచ్చి చదువుతుంటే నన్ను రోమాంచితం చేసాయి.. ఇన్నాళ్లు ఇంత గొప్పవ్యక్తి నా దృష్టిలో పడలేదేంటా అని బాధపడ్డాను.. వారి ఈ ఇంటర్వ్యూ, కథలు పాఠకులకన్నా ఎక్కువగా రచనలు చేసేవాళ్ళు చదవవలసినవి అని నాకు అనిపించింది. Traditional dressing, ప్రయోజనాత్మకమైన ఆలోచనాధోరణి, స్త్రీవాదానికి అసలు అర్థం వంటి విషయాలలో జ్యోతి గారిలో నాకు నేను కనిపించాను. వారి చాలా అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. వారితో నాకు కనిపించిన మరో సామ్యం ఉన్నవిషయాన్ని ఉన్నదివున్నట్టు అది నెగటివ్ అయినా చెప్పగలగడం..! నన్ను చూసిన వాళ్ళు కూడా ఈమెకు ఏమీరాదు అనే అనుకుంటారు 😊అలా అనుకోవటాన్ని నేను పట్టించుకోను.. నేనేంటో నాకు తెలుసు..అది చాలు (ఈ కాలం మోడరన్ పిల్లలకయితే మాలాంటివాళ్ళు అసలు ఆనరు)
    సంచిక టీమ్ చేసిన ఇంటర్వ్యూ విధానం వల్ల జ్యోతిగారు ఈ రోజు అద్భుతంగా మాముందు సాక్షాత్కరించారు. ఉలిపికట్టెలు పుస్తకం ఎప్పుడు చదువుతానా అన్న ఆరాటం నాలో మొదలయింది (on line order పెడుతున్నాను)
    చదవకముందే అది అద్భుతమైన పుస్తకమని ఊహించాను.లోగడ Online పత్రికలతో పెద్దగా పరిచయాలు లేక జ్యోతిగారి రచనలను చదవలేకపోయాను. ఇక నుంచి వారి కథ ఎక్కడ కనిపించినా వదిలిపెట్టను.చాలావిషయాలు మన మనసులో మెదిలేవి అయినా ఎవరన్నా చెపుతుంటే అవి మనల్ని ఎడ్యుకేట్ చేసి, మన దృక్పథాన్ని మారుస్తున్న ఫీల్ కలుగుతుంది. ఇంకా చెప్పాల్సింది చాలా మిగిలిపోయింది జ్యోతిగారి గురించి..వారి ఆలోచనలు రచనలు గురించి.. ఎన్నో కోట్ చేయాల్సినవి అలాగే ఉండిపోయాయి.. కామెంట్ మరీ పెద్దదై పోతుండటంతో ముగించాల్సి వస్తోంది.. ఇంటర్వ్యూ చేసినవారికి, ఇచ్చినవారికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ…..🙏🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!