సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    అద్భుతమైన ఇంటర్వ్యూ.
    జ్యోతి గారి గుండెల్లోంచి పెల్లుబికిన భావ ధారలను నా మనసులో ఇంకించుకోవడానికి ఇప్పటికే మూడు సార్లు చదివాను. ఇంకెన్ని సార్లు చదువుతానో, ఎన్నిరోజులు ఈ వాక్యాలు నన్ను వెంటాడుతాయో!
    దిలీప్ కుమార్ పట్ల “గౌరవం”, గురుదత్ అంటే “ఇష్టం”, సాహిర్ పట్ల “అభిమానం” – అత్యున్నత స్థాయి లో ఉండడం వల్లే మూడు ఆణిముత్యాలు అందించగలుగుతున్నారు. తన పట్ల, తన భావాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండడం, నమ్మిన విషయాలను నిజాయితీగా చెప్పడం వల్లనే పాఠకులను మౌనంగా తన దారిలోకి తెచ్చుకున్నారు జ్యోతి. ఆమె ఎంత గాఢంగా చెప్పారంటే “అంతకంటే ఇంకేం లేదు” అన్నంత. ఆమే అన్నట్లు తర్వాతి తరం వారికి ఇది తిరుగులేని రిఫరెన్స్.
    ఈరోజు నాకు మరో ఆలోచన లేనంతగా గురుదత్ పిచ్చి పట్టించినందుకు కోపంతో జ్యోతి కి ధన్యవాదాలు.
    ఈమధ్య కాలంలో ఇంత లోతైన ప్రశ్నలు వేసి, అనితరసాధ్యమైన జవాబులు ఆమె ద్వారా బహిర్గతం చేయించిన సంచిక టీం కి అభినందనలు.

  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    అద్భుతమైన ఇంటర్వ్యూ.
    ఇప్పటికే మూడు సార్లు చదివాను పొద్దున నుండి. ఇంకా ఎన్నిసార్లు చదువుతానో, ఎన్నిరోజులు ఈ వాక్యాలు నన్ను వెంటాడుతాయో చెప్పలేను. జ్యోతి గారికి గురుదత్ పై ఎంత అభిమానం ఉంటే ఇంత గొప్పగా రాస్తారు. అదే సమయంలో అతని బలహీనతలను, ముఖ్యంగా గీతా బాలి పట్ల ఉదాసీనత ను ఎత్తి చూపారు. అతని పాటల చిత్రీకరణ ను స్పష్టం గా గమనించడానికి పాటను మ్యూట్ చేసి చూసాను అని చెప్పడం లో జ్యోతిగారికి తను చేసే పని పట్ల ఉన్న అంకితభావం తెలుస్తోంది. గురుదత్ పై వచ్చిన ప్రతి పేపర్ కటింగ్స్, ఆడియోలు, వీడియోలు మాత్రమే కాక ఆయన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారట. గురుదత్ తర్వాతి తరం “గతంలోని విషాదం” తలుచుకోవడానికే ఇష్టపడడం లేదు అంటే ఆ కుటుంబానికి అయిన గాయం ఎంత లోతైనదో! గురుదత్, గీతాబాలి కూడా ప్రేమ తోనూ, ప్రేమ రాహిత్యం తోనూ వెంటాడబడ్డారు. పాటలను చూసి ఆనందపడే మాలాంటి సాధారణ ప్రేక్షకులకు పాటల్లోని లోతైన భావాల్ని, నటనలోని పరిపక్వతను, చిత్రీకరణ లోని నైపుణ్యాన్ని విశదీకరించారు జ్యోతి.
    ఆ బాధనీ, ఆవేదననీ, ఏదో తెలియని విషాదాన్ని అన్నీ కలిసిన ఆ emotion నీ, pain నీ తాను అనుభవించి, మాకూ కలిగించినందుకు “కోపంతో” జ్యోతి కి ధన్యవాదాలు.
    ఈమధ్య కాలంలో ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూ ని చేసి, కూలంకషంగా గురుదత్ గురించిన విశేషాలను, రాసేటప్పుడు రచయిత్రి అనుభూతులను, అనుభవాలను రాబట్టిన సంచిక టీం కి అభినందనలు.

  3. 3

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    తనివితీరా ఇంకా ఇంకా చెప్పాలని ఉన్నా… ఒక్కోసారి మౌనంగా అనుభూతించడమే ఆనందమేదో! బాధే సౌఖ్యమనే భావన కు తార్కాణం గురుదత్త చిత్రాలు, జ్యోతి భావ పరంపరలు.

  4. 4

    శారద పువ్వాడ

    జ్యోతి గారు, మీ రివ్యూస్ చదివి మీకు అభిమానిని అయ్యాను. ఇప్పుడు గురుదత్ పై మీరు పుస్తకం వ్రాయడం చాలా ఆనందంగా ఉంది. ఒక మహానటి కథ లాగా గురుదత్ కథ కూడా సినిమాగా రావాలి. వెన్నెల ఎడారి – ఆయన జీవితానికి తగిన పోలిక.

  5. 5

    alluri gouri lakshmi

    THIS IS REFRESHINGLY A CANDID INTERVIEW. సంచిక టీమ్ అడిగిన ప్రశ్నలకు జ్యోతి గారు ఏ విధమైన భేషజాలు, హిపోక్రసీ లేకుండా జవాబులు చెప్పారు. సంచిక టీమ్ కూడా విలువైన ప్రశ్నలడిగి జ్యోతిగారి నుంచి గురుదత్ పుస్తకావిర్భావానికి సంబంధించిన ఎంతో సమాచారాన్ని రాబట్టింది. పుస్తకం చదివిన వారంతా ఈ ఇంటర్వ్యూ చదవాలి.అలాగే ముందుగా ఇంటర్వ్యూ చదివినవారు తర్వాత తప్పకుండా పుస్తకంచదవాలి.
    నేను ప్రముఖుల (డ్రామాలు లేని) సహజ ఇంటర్వ్యూలు, జీవిత చరిత్రలు జాగ్రత్తగా ఫాలో అవుతాను, అక్కడ నిజజీవిత గతి, రీతి క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుందని. హైదరాబాదులో జాబ్ చేయాలనీ, హిందీ నేర్చుకోవాలనీ ఉండే నా కోరిక నెరవేరింది. మల్లెపువ్వు చూసి హైదరాబాదు వచ్చిన నేను, ప్యాసా చూసి షాక్ తిన్నాను. జీవానికీ, నిర్జీవానికీ ఉన్న తేడా అర్థమైంది. అప్పటినుండి నేను గురుదత్ గారి అభిమానిగా మారాను. ఒకచోట ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అని చదివాక నాకెందుకో భలే బాధ కలిగింది. అంత గొప్ప నా అభిమాన నటుడికి ఏ కష్టం వచ్చిందో కదా అని దుఃఖ పడ్డాను. ఆపై మరింత ఆసక్తి కలిగి ఆయన సినిమాలన్నీ చూశాను. వరసగా ఆయన WORKS (like Direction,Production & Action) చూసినప్పుడు ఆయనలోని గొప్పతనం నాకు ఇంకా బాగా అర్థమైంది.
    మనుషులు నిరంతరం నిజాల్ని దాస్తూ, అబద్ధాలు నటించడంలో Ph.D. చేస్తూ ఉంటారని ఈ సమాజం మీద నాకున్న ఫిర్యాదు నన్ను రచయితను చేసింది. ఇటీవల గురుదత్ గారి గురించి వచ్చిన ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఒక టాక్ షోను 9 ఎపిసోడ్లు, దాదాపుగా 7 గంటలకు పైగా అతి జాగ్రత్తగా ఒళ్ళంతా చెవులు చేసుకుని విన్నాను. అంతా విన్నాక ఎంతో సవివరంగా, హృద్యంగా రాసినట్టు వినబడిన ఆ నేరేషన్ Superficialగా, ప్రొఫెషనల్ గా ఉందనీ, అందులోఆత్మ లోపించిందనీ అసంతృప్తి పడిపోయాను. ఈ సంగతి ఒక రచయిత మిత్రుడితో పంచుకున్నప్పుడు, ఆయన పి.జ్యోతి గారు గురుదత్ పై రాసిన పుస్తకం చదవమని సలహా ఇచ్చారు.
    వెంటనే నేను జ్యోతి గారి గురుదత్, ఓ వెన్నెల ఎడారి కొని చదివాను. గురుదత్ గారి జీవన యానం గురించీ, వారి సినిమా ప్రయాణం గురించీ సంపూర్ణమైన వివరాలను 560 పేజీల్లో చక్కగా పొందుపరిచారామె. గురుదత్ జీవితంలోని ప్రతిచిన్న వివరాన్నీ పారదర్శకంగా చెబుతూ, ఒక తపస్సులా ఈ పుస్తకాన్ని రాశారు. ఒక ఋషిలా గురుదత్ జీవితాన్ని నిష్పక్షపాతంగా ANALYSE చేశారు. ఆయన అతి సున్నితమైన మనసు కలిగిన ఒక ప్రత్యేకమైన మానవుడు అని నా మనసు నెమ్మదించింది.
    అందులో నాకు గురుదత్ ఆత్మ దొరికింది. దాంతో ఎన్నో ఏళ్లుగా గురుదత్ పేరు చెప్పగానే నాలో కలిగిన ఒక UNREST తొలగిపోయింది. గురుదత్ గారు ఒక అపూర్వమైన, అపురూపమైన తన ప్రతిభకి,కృషిని జత చేసి కళాఖండాలను మనకి కానుకగా ఇచ్చి మౌనంగా నిష్క్రమించారు. లోక సహజమైన వాస్తవ కఠినత్వాన్ని ఆయన ఎంతమాత్రమూ జీర్ణించుకోలేకపోయారేమో! తనని తాను సముదాయించుకుని ఎడ్జస్ట్ కాలేకపోయారేమో! ఆ నలుగుడులో తనకీ, తన కుటుంబానికీ అన్యాయం చేసుకున్నారేమో! అనే అవగాహనకు రావడం జరిగింది. ఆయన జీవితాన్ని మనసుతో విశ్లేషించి, మేధతో తీర్పు చెప్పిన జ్యోతిగారు ధన్యులు. వారి కృషి ఒక డాక్టరేట్ కు మించినది.
    అలాగే, ఒక స్త్రీగా గీతాదత్ హృదయంలోని ఆవేదన కూడా అంతే స్పష్టంగా కనుక్కోగలిగారు జ్యోతిగారు. అక్కడ ఆవిడ నాకు మరీ నచ్చారు. ఈ పుస్తకాన్ని గీతాదత్ కు అంకితం ఇవ్వడం మరింత ఔచితీమంతంగా ఉంది. గురుదత్ అభిమానిగా మొదలుపెట్టి, మొత్తంగా ఆయన PERSONAL & PROFESSIONAL జీవితాలను నిర్మోహమాటంగా, నిజాయితీగా EVALUATE చేసే స్థాయికి చేరేవరకు జ్యోతి గారి స్టడీ సాగింది.
    ఈ JOURNEY లో గురుదత్ గారి కవితాత్మతో పాటు,సహజ సిద్ధమైన పసిపాప లాంటి గురుదత్ గారి పవిత్రాత్మను పట్టుకోగలిగారామె. ఇది గొప్ప విజయం. ఇది కదా! గురుదత్ గారి జీవితాన్ని గౌరవంతోనూ, అభిమానంతోనూ, ప్రేమతోనూ సహానుభూతించడం!
    ఈ పుస్తకాన్ని చదివే అదృష్టం మాకు కలిగించినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు జ్యోతి గారూ!
    WARMEST CONGRATULATIONS ON YOUR OUTSTANDING REMARKABLE ACHIEVEMENT JYOTHIJEE !

  6. 6

    Sandhya Yellapragada

    నిస్తారంగా ఉంది ఇంటర్యూ. గురుదత్ మీద సమగ్ర సమాచారం. రచయిత్రికి అభినందనలు

  7. 7

    chekkillalaxmaiah@gmail.com

    జ్యోతి గారు ! మీకు హృదపూర్వక అభినందనలు.మీ లాగే నాకు గురుదత్తు అంటే అభిమానం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!