సంచికలో తాజాగా

Related Articles

30 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కథ బాగుంది.వాస్తవానికి దగ్గరగా ఉంది……నిజమే! ఉద్యోగాలలో కూడా రకరకాల పాలిటిక్స్ ఉంటాయి. సమర్ధవంతంగా ఎదుర్కోగలిగితే వారి బారి నుంచీ మనల్ని కాపాడుకోవచ్చు. లేదంటే అమాయకపు జీవులు ఆవేదన పడవలసిందే!…

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జీడిగుంట విజయసారధి గారి వ్యాఖ్య: *చాలా బాగుందండి.. మంచి పాయింట్ చాలా suttle గా చెప్పారు.. very well written. మరి కొంత మంది మీకు విరోధులు అవ్వడం ఖాయం😀 మతం మారితే కులం మారుతుందని తీర్పు వచ్చిందా?*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీవల్లీరాధిక గారి స్పందన: *చదివానండి. బావుంది.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కస్తూరి రాజశేఖర్ గారి వ్యాఖ్య: *చాలా subtle గా సున్నితమైన అంశాన్ని స్పృశించారు. ఇలాంటి వ్యవస్థ ఉన్నంత కాలం ఇది సశేషం కాదు. కు-శేషమైన కథే 💐*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె. సూరిబాబు గారి వ్యాఖ్య: *చక్కని సందేశముతో కధనం వ్రాసిన మీకు అభినందనలు.. మంచి కథాంశం ఎన్నుకున్నారు. నేటి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతోంది.. సరళమైన భాషతో సున్నితమైన కధా వస్తువు తీసుకొని చక్కటి కధనానికి రూపకల్పన చేశారు.. ధన్యవాదములు.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎన్.కె. బాబు గారి వ్యాఖ్య: *మీ కథ చదివాను చదివాను, కథను కోర్టు తీర్పునకు అంకితం బాగుంది. మల్లీపురం జగదీష్ కూడా ఇలా మతమార్పిడుల కథలు చాలా రాశాడు. గిరిజన ప్రాంతాల్లో పేద గిరిజనులను, కొన్ని ప్రలోభాలకు గురిచేసి మతమార్పిడులు చేస్తున్నారు, కానీ ఇలా ఆఫీసుల్లో కూడా మతమార్పిడుల కోసం ఇలా జరుగుతాయని మీ కథ తెలిపింది.
    షోకాజ్ నోటీసులు రెండు వ్రాసి ఉంచుకోవడం బాగుంది, ఎలాంటి రిక్వెస్ట్ లేకుండా హాయిగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు రచయిత.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లాప్రగడ రామారావు గారి వ్యాఖ్య: *కథ బాగుందండి. ఆ మతానికి చెందిన అధికారులంతా ఒకలాగే ప్రవర్తిస్తారన్నది‌ తప్ప. దేవేందర్‍ని కూడా అంతటి అసమర్థునిగా చూపనక్కర్లేదు.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వెంపరాల దుర్గా ప్రసాద్ గారి వ్యాఖ్య: *సమకాలీన వ్యవస్థని కాచి వడబోసినట్లు రాసేరు. అత్యద్భుతంగా ముగించారు. ఆఫీసుల్లో రాజకీయాలు అలాగే ఉన్నాయి. కథనం పట్టుగా ఉండి ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ చదివించింది.👏👏*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చొప్పదండి సుధాకర్ గారి వ్యాఖ్య: *మంచి కథ అద్భుతంగా రాసారు. అంతే కాదు ఎవరూ పట్టుకోని అరుదైన కోణం.. నిజంగా హ్యాట్సాఫ్ కస్తూరి గారూ🌹*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సంధ్య యల్లాప్రగడ గారి వ్యాఖ్య: *కథ చాలా అర్థవంతమైనది. నేటి సమాజపు లోపలి పార్శము విప్పే యత్నం చేశారు.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. వెంకటేశ్వరరావు గారి స్పందన: *కథ చాలా సహజంగా.. ఉంది. నేడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎదుర్కొంటున్న సమస్యని సున్నితంగా సూటిగా చెప్పటం అద్భుతం. మరోసారి మీకు అభినందనలు..💐*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చివుకుల శ్రీలక్ష్మి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది. ధైర్యంగా రాసినందుకు అభినందనలు.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గరిపల్లి అశోక్ గారి వ్యాఖ్య: :మతం. కులం. పరిస్థితులకు అద్దం పడుతుంది.. అభినందనలు.*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విజయ శ్రీముఖి గారి స్పందన: *మీ సశేషమైన కథ చదివాను. ముందు ‘హమ్మయ్య’ అనుకున్నాను ఎందుకంటే.. వచ్చే కథల్లో ఎంతసేపు ఇంట్లో వ్యక్తుల మధ్య అనుబంధాలు, అవరోధాలు, అపార్ధాలు లాంటి రొటీన్ ఇతివృత్తాలు చదువుతూ ఉండడం చేత. బ్రతుకు తెరువులో బయట ఎదుర్కునే సమస్యలను మీరు తీసుకోవడం ఆసక్తిగా అనిపించింది.
    కథలోకి వస్తే.. దేవేందర్ లాంటి వ్యక్తులు అరుదు. ఆ అరుదైన వాళ్లను ఎలా ఆరడిపెట్టి అడ్డం తొలగించుకోవాలో కొందరు మేధావులకు తెలుసు. అవి స్పష్టంగా చెప్పటం కూడా తెలియని స్వచ్ఛమైన మనిషి దేవేందర్.
    మనకి కథచెప్పే వ్యక్తి ద్వారా లోగుట్టు తెలిసింది. అలాగే దేవేందర్ బయటపడ్డాడు. అన్ని చోట్లా ఇలాంటి వ్యక్తులు ఎదురవరు కదా?
    ఫలితం.. దేవేందర్ లు బలవ్వడం, వాళ్ల కుయుక్తులు కొనసాగడం!
    ఆఫీసర్, ప్రసాద్ లాంటివాళ్ళు అన్ని చోట్ల ఉంటూనే ఉంటారండి.
    ఆలోచనాత్మకమైన కథను పంపిన మీకు ధన్యవాదాలు సర్! 🙏*

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గొర్రెపాటి శ్రీను గారి వ్యాఖ్య: *’సశేషమైన కథ’ కథ,కథనం బాగుంది. ప్రస్తుత సమాజతీరుతెన్నుల్ని వివరిస్తూ విశ్లేషనాత్మకంగా వుంది. ఎన్నో వాస్తవాలని ప్రస్పుటించిన ఈ కథ నచ్చింది. ఇంకా ఆలోచింపజేస్తుంది.*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దినకర్ రెడ్డి గారి వ్యాఖ్య: * సమకాలీన అంశంతో వ్రాసిన ఈ కథకు పేరు సరిగ్గా పెట్టారు సార్. భిన్న పార్శ్వాలు ఉన్న కథలు మరిన్ని సంచికలో ఉండాలని ఆశిస్తున్నాను. ఆఫీసు వాతావరణము మరి కాస్త వివరించి ఉంటే ఇంకా బాగుంటుంది.*

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీనివాస్ గారి వ్యాఖ్య: *: రచయిత అనేవారు సమాజంతో పాటు, సమూహంతో పాటు నడుస్తూ, తన పరిధిలో సమాజంలో మంచుమార్పు కోసం ప్రయత్నం చెయ్యాలి. మతం- కులం పాలు నీళ్లలా కలిసిపోయాయి. మతం మారితే కులం వచ్చే సదుపాయాలు పోతే.. ఒక అణగారిన వర్గానికి చెందినా.. మతం వేరు కావడంతో.. దూరం పెట్టడం, మనోవేదనకు గురి చెయ్యడం.. కళ్ళకు కట్టినట్టు చూపించారు. అభినందనలు.*

  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Panyam Dattasarma: *Very relevant to contemporary society. I too faced such things in my career. Hats off to your courage, brother,! I am proud of you.*

  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బృందావనరావు గారి వ్యాఖ్య: *కథ బాగుంది. ఈ ఇస్యూ మీద అలా రాయగల ధైర్యం చూపించినందుకు అభినందనలు.*

  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. చెంగల్వ రామలక్ష్మి గారి వ్యాఖ్య: *కథ చాలా బాగుంది. వాస్తవానికి దగ్గరగా ఉంది. సీరియస్ సమస్యను తీసుకుని కథగా చక్కగా మలిచారు. అభినందనలు.*

  21. 21

    ఆసూరి హనుమత్ సూరి

    సున్నితమైన అంశాన్ని ధైర్యంగా స్పృశించారు. అలాగే ఏ వర్గాన్ని తక్కువ చెయ్యకుండా బ్యాలెన్స్డ్ గా ముగించారు కథని.

  22. 22

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి స్పందన: *కథ లోని కంటెంట్ ఆసక్తికరంగా అనిపించినా.. ఎస్టాబ్లిష్ అవడంలో.. ముఖ్యంగా దేవేందర్ పాత్ర చిత్రణలో కొంత శిధిలత తోచింది.. కనెక్షన్‌లో ఇంకొంత శ్రద్ధ పెట్టాలేమో అనిపించింది.. నా మనసుకి అనిపించిన మాట చెప్పాను..*

  23. 23

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. బివిఎన్. స్వామి గారి వ్యాఖ్య: *కథ బాగుంది. దేవేందర్ అమాయకత్వం మీడియా ప్రభావం ఆకట్టుకున్నాయి. తీసుకున్న వస్తువు బలంగా ఉంది.*

  24. 24

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జిల్లెళ్ల బాలాజీ గారి వ్యాఖ్య: *మీ కథ వాస్తవం, యథార్థం. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న తంతేగా. అభినందనలు.*

  25. 25

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బొందల నాగేశ్వరరావు గారి వ్యాఖ్య: *కథ వాస్తవానికి దగ్గరగా వుంది. అందుకు మీకు అభినందనలు. సమాజంలో ఇలాంటి వ్యక్తులు చాలా మంది వున్నారు. నేను సర్వీసులో వున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటన మా ఆఫీసులోనూ జరిగింది. అప్పుడూ బాధింపబడ్డ వ్యక్తి ఎవ్వరిని అర్థించినా కనీసం అతని గోడు వినలేదు/పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తులు వున్నంతవరకూ తీరు మారటం కష్టమే!*

  26. 26

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సందినేని నరేందర్ గారి స్పందన: *కథ చదివాను. అద్భుతంగా ఉంది. మీరు కథను నడిపించే తీరు, మీ శైలి గొప్ప రచయితల రచనలను చదివినట్లుగా అనుభూతిని పొందాను. మీలో గొప్ప కథకుడు ఉన్నాడు. మీరు కథలే రాస్తే గొప్ప కథకుడుగా చరిత్రలో నిలిచిపోతారు. మీలో అధ్యయనం ఎక్కువగా ఉంది. సమాజాన్ని పరిశీలించే సునిశితమైన శక్తి మీలో ఎక్కువగా ఉంది. అందుకే అంత గొప్పగా కథను రాయగలిగారు. దేవేందర్ పాత్ర ద్వారా కులం, మతం పేరిట జరుగుతున్న ఎన్నో దారుణాలను అందుకు బలి అవుతున్న అమాయకులు ఎందరో మరెందరో?మీరు దేవేందర్ సమస్యకు పరిష్కారం చూపిన తీరు అద్భుతంగా ఉంది. మీరు కథలు ఎక్కువగా రాయండి. మీలోని సృజనాత్మకతకు పదును పెట్టండి. ధన్యవాదాలు సార్.*

  27. 27

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శాంతిశ్రీ గారి స్పందన: *సమాజంలో (ఆఫీసుల్లో) జరుగుతున్న మత రాజకీయాల గురించి అవగాహనతో మీరు రాసిన కథ బాగుంది. కథలో చెప్పినట్లు మతం మారమని ఎవరిమీద వత్తిడి పెట్టకూడదు. ఎవరికి ఇష్టమైన మతాన్ని పాటించే స్వేచ్ఛ అందరికీ ఉండాలి. జై శ్రీరామ్ అనమని అన్య మతస్తుల మీద వత్తిడి పెట్టే వాళ్ళ మీద, అనకపోతే హింసకు పాల్పడే వాళ్ళ మీద కూడా కథ రాయండి. అలాగే పహల్గామ్ సంఘటనలో ఖురాన్ వెల్లడించిన హిందువులను చంపకుండా వదిలెయ్యడం, మిగిలిన వారిని ఘోరంగా చంపడం శోచనీయం.
    తమ జీవనోపాధి కోసం గుర్రాలను నడిపే ముస్లింలు ప్రాణాలను ఒడ్డి హిందువులను రక్షించిన విషయం మర్చిపోకూడదు.
    ఇక కథ కథనాల విషయానికి వస్తే కొన్ని పొరపాట్లు ఉన్నాయని అనిపించింది. ఉదాహరణకు కథను నడిపించిన కథకుడు అదే ఆఫీసులో పనిచేస్తున్నా అక్కడ జరిగే చాలా విషయాలు అతనికి తెలియక ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను కథంతా తనని తాను సమర్ధించుకుంటూ నడిపినట్లు అనిపించింది.
    ప్రసాద్ తో మాటలు జరిగాయి కదా? రోజూ తాగుతూ వచ్చే అతను తాగుబోతని తెలియకపోవడం కూడా నమ్మశక్యంగా లేదు. వాసన బట్టి గ్రహించవచ్చు కదా?
    ఏ మతం లో అయినా ఫండమెంటలిస్టులు, ఉగ్రవాదులు ఉంటారు. వారితోనే అసలు సమస్యలు, ప్రమాదాలు ఉంటాయి.*

  28. 28

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పేకేటి ప్రసాద్ గారి స్పందన: *ఎక్స్‌లెంట్ అండీ, నిజంగా జరుగుతుంది ఈ విధంగా. నా బెస్ట్ ఫ్రెండ్ ఈ సమస్య కు లోనవుతున్నారు.*

  29. 29

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బొందల నాగేశ్వరరావు గారి స్పందన: *కథ వాస్తవానికి దగ్గరగా వుంది.అందుకు మీకు అభినందనలు. సమాజంలో ఇలాంటి వ్యక్తులు చాలా మంది వున్నారు. నేను సర్వీసులో వున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటన మా ఆఫీసులోనూ జరిగింది. అప్పుడూ బాధింపబడ్డ వ్యక్తి ఎవ్వరిని అర్థించినా కనీసం అతని గోడు వినలేదు/పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తులు వున్నంతవరకూ తీరు మారటం కష్టమే!*

  30. 30

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పొన్నాడ సత్యప్రకాశ రావు గారి స్పందన: *నేటి పరిభాషలో చెప్పాలంటే ఇది ఒక బోల్డ్ స్టోరీ. రెండు సున్నితమైన అంశాలు 1) రిజర్వేషన్లు 2)మతం మార్పిడి ను స్పృశించారు రచయిత.ఆఫీసరూ, దేవేందర్ ఇద్దరూ రిజర్వేషన్ల ద్వారా పైకి వచ్చినవారే. దేవేందర్ లక్షల్లో జీతం తీసుకుంటూ కూడా ఏమి పనిచేయకపోయినా ఆఫీసర్ ఏమీ అనడు. దేవేందర్ పనిని పంతులు చేత చేయిస్తాడు. ఆ విధంగా తన కులస్తుడైన దేవేందర్ ని ఆఫీసర్ వెనకేసుకొస్తాడు. అయితే హిందూ మతంలో వెనకబడిన తరగతులకు చెందిన వారికి వారికి కల్పించిన రిజర్వేషన్లు సాయంతో దేవేందర్ పదోన్నతులు పొంది హిందూ మతానికే కట్టుబడి ఉన్నాడు. కానీ అదే మతానికి చెందిన ఆఫీసర్ రిజర్వేషన్లను వాడుకుంటూ మతాన్ని కూడా మారి దేవేందర్ ను కూడా మతం మారమని నిర్బంధిస్తున్నాడు. హిందూ మతానికి తీరని ద్రోహం చేస్తూన్నాడు అసలు మతం మారితే కులం పోవాలి కదా కానీ ఈ ఆఫీసర్ లాంటి వాళ్ళు హిందూమతంలోని వెనుకబడిన కులాలకు ఇచ్చిన రాయితీలను వాడుకుంటూ పైకొచ్చి కూడా వేరే మతం లోకి మారి రికార్డ్స్ లో మాత్రం ఆ మత మార్పుని చూపించకుండా హిందూ మతానికి ద్రోహం చేస్తున్నారు.విబేధించిన పంతులు లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సర్వ సాధారణంగా కనబడే ఇటువంటి సంఘటనల ను చక్కగా చిత్రికరిస్తూ కోర్టుకి సంకేతాలు పంపుతున్నారు రచయిత. 👌*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!