మనసు మౌనం
కాదిది శూన్యం
ఎనలేని కాంతి
అందిన ఆర్తి
నిండిన మానసం
పొందిన సంతసం
కన్నుల వర్షం
అది మది హర్షం
లయ తప్పిన యద
ఇల సదృశమైనదా
ఉప్పొంగిన ఉద్వేగం
అందించెను అంతరంగం
లేదిక దైన్యం
రాదిక దాస్యం
నమ్మలేని నమ్మిక
ఉంటుంది కడదాక
బ్రతుకు పైన ఆశ
నీవిచ్చిన శ్వాస
నిర్వచనమెరుగని ప్రేమా
నను పలకరించినావమ్మా…..
శ్రీ మురళీకృష్ణ గారికి నమస్తే. 1యమునాతటిపై2.రేపల్లియ.ఎద.పాటలరచయితశ్ శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారికి, 3.మనసేఅందాలబృందావనం..రచయితశ్రీఆరుద్ర గారికి...4నీలమోహనారారా.రచయితశ్రీదేవులపల్లి కృష్ణశాస్త్రిగారికి5.మాసససంచరరే..శ్రీసదాశివబ్రహ్మేంద్రులవారికీనమస్కారములుచేస్తు..వారివి.రచనలోచేర్చినవిషయంరాయనందుకుచింతిస్తూ సంపాదకులకు,పాఠకులకునుమన్నించకోరుతున్నాను నారదచనకు.స్ఫూర్తిదాయకమైనవిమర్శకుధన్యవాదాలు
4 Comments
Eswari
Very nice


Eswari
Chala bagundi


M.k.kumar
Kavitha naku ardham kaledu
Subba