[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘పరుపు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
పరుపెప్పుడూ పరుచుకునే ఉంటుంది ఒళ్ళంతా ఓ దుప్పటిని కప్పేసుకుని గలీబు దుస్తుల్లో నిండా మునిగిన దిళ్ళజంటతో దిలాసా కబుర్లేసుకుంటూ
బరువైన బతుకులకే కాదు బతుకే బరువైపోయిన జీవులకైనా బడలిక తీర్చేస్తూ నిద్రపుచ్చుతుంది తలనుంచి కలతలను దూరంచేస్తూ కష్టాలకు మరుపుమందు తినిపిస్తూ దారితప్పిన కలలను వెతికి వెంటాడి మరీ తెచ్చిస్తుంది
అలసట అంగీని మెరిసేలా ఉతికేసి ఉత్సాహంలో ముంచి ఆరేసి ఉదయాన్నే వెచ్చగా తొడుగుతుంది మెలకువ వేళన ఓ కొత్తరోజును మెత్త మెత్తగా బహుమతి చేసిస్తుంది
నలిగిపోయిందనో మరి మాసిపోయిందనో మాటల్లో పెట్టి, తనను ఏమార్చి తను కప్పుకున్న దుప్పటిని మారిస్తేచాలు ఎంత సంతోషమో ఆ పరుపుకు.. రంగులపంట అయి వెలిగిపోతుంది! పువ్వులతోటగా మారి పరిమళిస్తుంది!!
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఇక యుద్ధం జరగదు…
కొరియానం – A Journey Through Korean Cinema-19
అన్నమయ్య పద శృంగారం-15
మరుగునపడ్డ మాణిక్యాలు – 93: స్టిల్ ఆలిస్
‘మేకల బండ’ నవల ఆవిష్కరణ – ప్రెస్ నోట్
The Quintessential Journey
లోకల్ క్లాసిక్స్ – 20: పెళ్ళింటి పట్టు చీర
గిరిపుత్రులు-4
ఆత్మ బంధం
జీవన రమణీయం-102
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®