సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కస్తూరి మురళీ కృష్ణ

    : ప్రకృతి ని ధర్శించాలంటే
    ప్రకృతి ని ఆశ్వాదించాలంటే
    ప్రకృతి లో మమేకమవ్వాలంటే..
    ఈ పాదచారి వెంట నడవాల్సిందే.

    మనిషి లోపలున్న అనేక గుణాలు పాత్రలుగా మారి పాదచారి వెంట సంచరిస్తూ మమ్మల్ని అలా చుట్టూతా చుట్టుకుని నిలతీసి వెళుతున్నాయి.

    ఒకో స్వభావం ఒకో రకమైన పాత్ర పోషించినా.. సమస్తం ప్రకృతై..
    రాలిపడే పూవు ఆఖరి శ్వాస కూడా అతనితో మాట్లాడటం.. తన జన్మ రహస్యం చెప్పడం..
    తన జన్మ రహస్యం కూడా అంతేనని.. తెలుసుకుని
    అతను ఆ పూవును దాచిపెట్టుకుని నిర్వికారంగా సాగుతుంటే.. మరో స్వభావం మఱ్ఱి చెట్టు ఊడలతో అలా ఉండొద్దని.. ఉత్సాహం నింపుకోమని చెప్పడం..

    ఓచోట ప్రతీ వ్యక్తికి ఎదురయ్యే వేదనాలత కూడా చుట్టుకుని నువ్వు నేనూ వేరుకాదన్నట్టు చెప్తుంది.
    నువ్వే నాలో లేకపోతే నేను హాయిగా ఉండేవాడినని చెప్పి దేన్నో దేన్నో అతడు అన్వేషిస్తూ సాగుతూ ఉంటాడు.

    జీవితం మళ్లీ మొదలైతే అన్న ఆలోచన అతనిలో కలగడం..
    అదే సమయంలో నాలో నేను.. నాతో నేను అనుకునే మాటొకటి గుర్తొచ్చింది.

    బాల్యమెంత బంగారం.. మళ్లీ మళ్లీ పుట్టాలనే అనిపిస్తుంది.
    అయితే మరీ ఏమీ తెలీకుండా కాకుండా కాస్త అన్నీ తెలిసిన బాల్యమైతే బావుండునని చాలా సార్లు అనుకున్నాను అప్పుడెప్పుడో..

    ఇది ఇక్కడ రాస్తుంటే.. నాలోని మరో నేనే.. అన్నీ తెలిస్తే ఇంకా బాల్యంలో స్వచ్ఛతను కోల్పోతాం కదా అని సమాధానం చెప్పుకుంటాను.

    విప్లవ మూర్తి, జీవన మూర్తి, మానసి ఒకరేవిటీ..
    పాదచారి వెంట నడవడం మొదలెట్టాక
    మనలో ఉన్న ఈ స్వభావాలు కూడా మరింత స్పష్టంగా గోచరించక మానవు.

    ఆ తర్వాత ప్రయాణంలో ఆ ప్రకృతి లో మమేకమై సాగతూ ఉన్నప్పుడు ఆనందం అనే అమృత స్వభావం చేరువై.. పాదచారిని ఓలలాడించడం
    మమ్మల్ని కూడా అమృతానందలోకం లోకి రమ్మంటూ మా పెదవుల దరహాసమై విరిసింది.
    కోడే యామినీ దేవి గారి అభిప్రాయం…

  2. 2

    K Murali Krishna

    మొదట్లో ప్రకృతి తో మొదలయిన సంభాషణలు రాన్రానూ ఎంత తీవ్రమైన ఫిలసోఫికల్ థాట్స్ గా మారిపోతున్నాయి?
    సరిగ్గా ఇదే ఇదే సంఘర్షణ నిత్యం నాలోనూ నాతో నాకు జరుగుతుంది.
    కాదు కాదు మనసున్న ప్రతి ఒక్క జీవికీ ఇదే సంఘర్షణే ఉంటుందేమో..
    అద్భుతమైన వివరణ ‘జీవితం’ అనే పదానికి పాదచారి మొదటి ఎపిసోడ్ లో..మొదటి మూడు వాక్యాలు..జీవితం అనే పదానికి నిఘంటువు నిర్వచనాలు.
    పాదచారి రెండో ఎపిసోడ్ లో..మనిషి ప్రకృతిని ఎలా విస్మరించి materislistic ఐపోయాడో సుతిమెత్తగానే కానీ చాలా సూటిగా గుచ్చుకునేలా చెప్పారు.దానికి ఆ చీమ కుట్టుడే సాక్షి!
    నిజంగా ఒళ్లు గగుర్పాటు చెందుతోంది. సాయంత్రం దాటి మెల్లిగా చీకటి పడుతోంది అని చెప్పడాన్ని ఇంతకన్నా అద్భుతంగా ఎవరూ రాయలేరేమో..!
    మొదట నక్షత్రం తళుక్కున తిట్టిందా..☺️ తరువాత ఒకదాని వెనుక ఒకటి 5,6 నక్షత్రాలు మెరిసాయా..అబ్బా ఎంత చక్కటి ఆలోచన.
    పాదచారి మూడవ భాగం అసలు సిసలు వ్యక్తిత్వ నిర్మాణ క్రమం.నేటి రోజుల్లో మనిషి ఎందుకు అశాంతి అసంతృప్తి పొందుతున్నాడో మీ మాటలు చదివితే మనసుకు ఎక్కించుకుంటే చాలు.
    విప్లవం పేరిట వెఱ్రి తలలు వేస్తున్న వారికి వేడి వేడి చురకలం టిచారు. విప్లవానికి ప్రశాంతతకు జరిగిన సంఘర్షణ లో
    ఆఖరు వాక్యాలు అద్భుతం పరమాద్భుతం.
    అంతేకాదు మనిషి దగ్గరలేకున్నా మనస్ఫూర్తిగా ఎలా ప్రేమిస్తూ జీవించవ చ్చొ చాలా అందంగా చెప్పారు. అదే అసలైన unconditional లవ్..ప్లేటోనిక్ లవ్👍
    : ఇది Dr. స్రవంతి ఐ త రాజు గారి స్పందన

  3. 3

    Dr. Lakshmi Raghava

    పాదచారితో నడుస్తూ ప్రకృతి తో మమేకమై ఆస్వాదించే పద్ధతి నేర్చుకుంటున్నా. మనిషిలో వున్నా గుణాలను పేరు పెట్టి పిలుచుకుంటుంటే…ఎంత నిజం! అనిపిస్తూవుంది.
    వేదనలత వేదన కలిగించడం అర్థం అవుతూ వుంది…రచన చదువుతూ ఉన్నానా నాలోనేను ప్రయాణంచేస్తూ ఎన్నో తెలుసుకుంటూ …కొనసాగిస్తా

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!