నేనేం చేసినా…తప్పంటావు నువ్వు!!నువ్వు చేసేది సరికాదంటాను నేను!!ఇక మన మధ్య సయోధ్య ఎక్కడ???పరస్పర వైరుధ్య భావాలు,అయినా… తప్పని సాహచర్యం!!నా భావాలకు, ఆదర్శాలకు,భవితకి…నేనో రక్షరేకు గీసుకున్నా…!!నేనది దాటను!!!
రేఖకు ఆ వైపున,తీవ్రభావాలతో…క్రుద్ధంగా,నిద్ర లేని,రాని అలజడిలో,అసంతృప్త మనస్కమై,ఆకలితో కాక కపటంతో,వేటు వేయాలనుకునే….దొంగ పిల్లిలా… నువ్వు!!!!ప్రపంచమంతా చూపుడు వేలై,నిను మందలిస్తున్నా…,నాల్గు కలుగులులున్నాయనే…పొగరుతో…,నాపై విసరడానికి రాళ్ళు దొరకక,వెతికి, వెతికి మరీ దుమ్ము విసిరి,ముఖమంతా పులుముకున్నావు!!!నేను గీత దాటకుండానే…కర్తవ్యం నిర్వహిస్తుంటాను!!గుండెల్లో నెగళ్ళు వేసుకుని,గడ్డ కట్టే చలిలో…., అహర్నిశలు..కంటికి రెప్పలా కావలి కాస్తుంటా!విశ్వ వేదికపై జయపతాకనైమువ్వన్నెలతో ..ఎగురుతుంటాను…!!!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అలనాటి అపురూపాలు-34
ప్రాణం విలువ
విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-23
మావో కమ్యునిస్టు పాలన లోని నియంతృత్వాన్ని గురించి చెప్పిన ఆత్మకథ – వైల్డ్ స్వాన్స్
ప్రాణశక్తి
ధర్మ ప్రవచన దక్షుడు ‘వ్యాఘ్రపాద మహర్షి’
అంటు మొక్క
మహతి-48
డైనమిక్ వెబ్ పత్రికలో ………త్వరలో…
అతడే..!
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®