[మికీ 17 అనే కొరియన్ సినిమాని సమీక్షిస్తున్నారు వేదాల గీతాచార్య.]
Dying isn’t any fun…but at least it’s a living.
ఇదీ ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే! మానవుల తప్పిదాలు, దాని ఫలితంగా అన్ని జీవులు భూమి మీద అంతరించటం, భూమి నివాస యోగ్యం కాకండా పోవటం, వేరే చోట ఇతర గ్రహాలలో మనకు స్థానం దొరుకుతుందా అని అన్వేషించటం.. ఇవన్నీ సరే! దీనిలో బలిపశువులు నిజంగా ఎవరు?
ఐదేళ్ళ క్రితం మూడు ఆస్కార్ అవార్డులతో సంచలనం సృష్టించి కొరియన్ సినిమా విజయ పతాకాన్ని అంతర్జాతీయంగా రెపరెపలాడించిన బాంగ్ జూన్-హో (Bong Joon-ho) ఈసారి డైరక్ట్ హాలీవుడ్ సినిమాతో వచ్చేశాడు.
(అద్నాన్ సమీ కి కీర్తి పతాక అంటే అర్థం కాకపోతే నాకేమీ సంబంధం లేదు. మళ్ళీ నువ్వు భారతీయుడివి అయి ఉండీ కొరియన్ సినిమాని పొగుడుతున్నావు అని తిట్టినా తిడతాడు).
Edward Ashton రాసిన 2022 సైన్స్ ఫిక్షన్ నవల మికీ7 ఆధారంగా వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయంగా సంచలనాలు సృష్టించబోతోంది.
కొరియానంలో ఈ బాంగ్ (అంటే బెంగాలీ కాదు) బ్యూటీ గురించి ఒక subtext లాగా తప్ప పెద్దగా చెప్పలేదేంటి అని ప్రశ్నలు వచ్చాయి. అప్పట్లో చదివిన ముగ్గురు రీడర్లు, పుస్తకంగా వచ్చాక పూర్తిగా చదివిన 24 (హమ్మయ్య 23 దాటేసింది) రీడర్ల నుంచీ. అంటే యునానిమస్ రెస్పాన్స్. సారీ! అదే క్వశ్చనింగ్.
కొరియానం వచ్చేసి ఒక నేరేటివ్. దాని థీమ్ కు తగిన సినిమాలు అందులో చెప్పుకున్నాము. పైగా గొప్పవైనా మన వైపు పెద్దగా తెలియని సినిమాల గురించి.. అనే నియమం కూడా ఉంది. ప్రధానంగా కొరియన్ వేవ్ ప్రారంభం కావటానికి దారి తీసిన పరిస్థితులు, ప్రారంభం కావటం వీటి గురించి ప్రాధాన్యత.
నిజానికి మన బాంగ్ బాబు తీసిన పారాసైట్ చెప్పుకోదగ్గ అంత గొప్ప సినిమా కాదు. దాని బాబు (మన దక్షిణ తెలుగూఫు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాదు) లాంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఆ టైమ్ కు అలా కలిసి వచ్చి ఆ సినిమా ఆస్కార్లు కొల్లగొట్టడం జరిగింది. పాపం కొరియన్ వేవ్ పీక్ కు చేరుతోంది అనుకుంటుండగానే కోవిడ్-19 వేవ్ మొదలైంది. ఏం చేస్తాం? గదా పట్టుని పిస్కతా కూర్చున్రు.
కానీ ఈ సినిమా మికీ 17 సామాన్యమైన సినిమా కాదు. నవల విడుదలకు ముందే దాని గురించి తెలుసుకున్న బాంగ్ దాని రైట్స్ తీసుకున్నాడు. ఛాల్స్ యు (Charles Yu) చేత స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దించాడు. అంటే సినిమాలో ఏదో స్పెషల్ ఉంటుందని అర్థమై దాని గురించి అప్డేట్స్ ఫాలో అవుతున్నాను. దానికి తోడు ఈ తరపు గొప్ప నటుల్లో ఒకడుగా కీర్తింపబడుతున్న Robert Pattinson ప్రధాన పాత్ర కానటంతో ఆసక్తి మరింత పెరిగింది.
నవల విడుదల కాగానే చదివాను.
స్థూలంగా కథ ఇదీ!
కథలో హీరో పేరు మికీ. అతను ఒక Expendable. అంటే దేనికీ వెరవక, ప్రాణహాని ఉందని తెలిసినా విపరీతమైన రిస్క్ తీసుకుని మిషన్లను పూర్తి చేస్తాడు.
ఇద సైన్సు ఫిక్షన్ కథ అని చెప్పుకున్నారు కనుక కథ భవిష్యత్ లో జరుగుతుంది. గొప్ప కథ కావాలి కనుక మన మనుషుల విపరీతమైన వాడకానికి భూమి కాస్తా armpit lick and Chandole gone.
దాంతో అంతరిక్షంలోకి చూస్తారు. అవకాశాల కోసం. అక్కడ క్రిస్ నోలాన్ ఎమ్డీ (Master of Depression) Interstellar లో లాగా వేరే గ్రహం మీదో, గ్రహ శకలం మీదో మానవ సమాజం మనుగడ కొనసాగించి వృద్ధి చెందే అవకాశం ఉంటే అక్కడికి అందరినీ తరలించాలని ప్రయత్నాలు జరుగుతుంటాయి.
అలా వెళ్ళాల్సిన వారిలో మన మికీ (క కు వత్తు ఉండదు) ఉంటాడు. అతను ఆ యా గ్రహాల వేటలో ముందు అక్కడ దిగి ఆ వాతావరణం మానవులకు అనుకూలంగా ఉందా? అక్కడ ఎలాంటి జీవరాశులు నివసిస్తున్నాయి? వాటితో మానవులు సహజీవనం చేయగలరా? అవి మన మానవులను అక్కడ సెటిల్ అవనిస్తాయా? (దొరికిందల్లా అవుఁరుకునే వారిని ఎవరు రానిస్తారు? అందుకే ప్రతిఘటిస్తారు). ఇలాంటి వాటిని చెక్ చేసి చెప్పాలి.
ఆ మిషన్ లో మన మికీ చనిపోతే అతని ఙ్ఞాపకాల డేటాతో క్లోన్ మికీని సృష్టించి పంపుతారు.
ఫిర్? ఆపరేషన్ కంటిన్యూస్. అలా ఆరుగురు మికీలు అయి ‘పోయి’ ఏడోవాడు కూడా చావు బ్రతుకుల మధ్య ఉండగా మన కథ మొదలౌతుంది. బాంగ్ బాబుకు ఏడవటం చేతకాక 17 అని వాడాడు సినిమాకు.
అనుకోకుండా ఇద్దరు ఎనిమిదవ మికీలు తయారవుతారు. మికీ8. (సినిమాలో 18). దానికి తోడు ఇప్పుడు చూడబోతున్న గ్రహంలో ఉన్న జీవులు వారి మీద తిరగబడతాయి.
విశ్వం అంతటా ప్రయత్నాలు జరిగాయి – కొన్ని విజయవంతమయ్యాయి, కొన్ని విజయవంతం కాలేదు – కానీ ఇప్పుడు మికీ రంగంలోకి దిగినది సరైన చోటుగా, మానవులు మళ్ళీ బాగా పుంజుకోవటానికి కావలసిన అన్ని లక్షణాలు ఉంటాయి. దాని పేరు Niflheim. Ice planet.
కానీ అక్కడి మూల వాస జీవులు (క్రీపర్లు అంటారు. పాకే జీవులు) మానవుల మీద ఎదురుదాడి చేస్తాయి.
ఈ కథలో రెండు ప్రధానాంశాలు ఉన్నాయి. ఒకటి మికీ వర్సెస్ మికీ (నవలలో Mickey 8 vs Mickey 8). ఇద్దరు క్లోన్లు ఒకే ఙ్ఞాపకాల డేటాతో ఎదురు పడటం, పోటీ పడటం. రెండోది మూల జీవులు మానవుల మీద దాడి చేయటం.
ఈ మూల జీవుల కథను అమెరికా వలస వచ్చిన యూరోపియన్లుగా, మూల జీవులు నేటివ్ అమెరికన్లు గా మనకు అనిపించే లాగానే డిజైన్ చేశారు.
నవల నాకు చాలా నచ్చింది. సెటైరికల్ టోన్ అంతటా బాగా వాడారు. హారర్ కథంశాన్ని కాస్త త్వరగా జీర్ణమయ్యేందుకు హాస్యపు పైపూత బాగా కుదిరింది. మికీ vs మికీ సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఎన్నో existential questions మనలో ఉత్పన్నమయ్యేలాగా చేస్తాయి.
ఇలాంటి కథను మన బాంగ్ బాబు బాగా హేండిల్ చేయగలడని మనకు పేరాసైట్ తో తెలిసిన విషయమే కదా. కాకపోతే మానవ మనుగడ అనే Science Fiction generic trope ను తనదైన శైలిలో ఎలా డీల్ చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. సినిమాలో బాంగ్ మార్కు బ్లాక్ హ్యూమర్, కొరియన్ సహజాతమైన వైలెన్స్ రెండూ బాగా ఇమిడిపోయాయి.
ఇక ప్రధాన పాత్ర పోషించిన రాబర్ట్ పేటిన్సన్ ఈ సినిమా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. బాంగ్ బాబుతో కలిసి స్టోరీబోర్డ్ సెషన్లు పర్యవేక్షించాడు. నవలలో ఉన్న నాన్-కొరియన్ హ్యూమర్ మన బాంగ్ శైలికి అతికేలాగా కావలసిన జాగ్రత్తలు తీసుకున్నాడు. చాలా చోట్ల తన పాత్రను improvise చేసి బాంగ్ బాబుకు శ్రమను తగ్గించాడు.
అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే సినిమా అంతా బాంగ్ ప్రభావమే కనిపిస్తుంది. స్టూడియో జోక్యం నామమాత్రమే. దానికి కారణం రాబర్ట్ పేటిన్సన్.
Darius Khondji సినిమాటోగ్రఫీ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలుపుతుంది. బాంగ్ శైలి visual flair స్పష్టంగా కనిపిస్తుంది. సంగీతం బాంగ్ మిత్రుడు, Squid Game తో అంతర్జాతీయంగా బాగా తెలిసిన Jung Jae-il అందించాడు. ఇతనే పేరాసైట్ కు, అంతకు ముందు ఓక్జా- ముచ్చటైన పంది సినిమాకు కూడా సంగీత దర్శకుడు. Creepy atmosphere కు తగిన సౌండ్స్ తో సినిమాను మరో మెట్టు ఎక్కించాడు. దర్శకుడు విజన్ తెలిసిన సంగీత దర్శకుడు ఎన్ని అద్భుతాలు చేయగలడు అన్నది ఈ సినిమాను చూస్తే తెలుస్తుంది. ప్రతి చిన్న బీట్ కూడా ఒక background score lesson.
Naomi Ackie, Steven Yeun, Toni Collette, and Mark Ruffalo played other starring roles.
Snowpiercer, Train to Busan, Okja, Parasite సినిమాలకు పని చేసిన ఎడిటర్ Yang Jin-mo ఈ సినిమాతో కూడా తన సత్తా చాటాడు. ప్రత్యేకించి ప్రారంభ సన్నివేశాల్లో అతని పనితనం బాగా తెలుస్తుంది. మరో విశేషమేంటంటే Sleep (2023) తో హారర్ సినిమాకు కొత్త గ్రామర్ నేర్పించిన జాసన్ యు ఈ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా unofficial గా పని చేయటం. ఇతని గురించి చాలా ఆసక్తికరమైన విశేషాలు కొరియానంలో (పుస్తకం) ఉన్నాయి. స్లీప్ రివ్యూ ఇక్కడ చూడవచ్చు (https://sanchika.com/jam-korean-movie-review-vg/). బాంగ్ బాబు favourite gang అంతా ఒకచోట చేరి సృష్టించిన అద్భుతం మికీ 17.
Final Cut privilege కూడా ఇచ్చారు మన బాంగ్ బాబుకు. కనుక ఎగేసుకుని వెళ్ళి మరీ చూడటానికి రెడీగా ఉండండి.
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂 తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు. గీతాచార్య
You must be logged in to post a comment.
ఫ్యామిలీ
కవిత్వమా! ఎక్కడ నీ అస్తిత్వం?
కవిత పూర్తయింది
యువభారతి వారి ‘వికాసలహరి’ – ముందుమాట
తల్లివి నీవే తండ్రివి నీవే!-72
సముద్రపు ఇసుక
శ్రీవర తృతీయ రాజతరంగిణి-15
భారత ప్రజానీకానికి విశిష్ట సేవలందించిన మాడలిన్ వార్రే స్లేడ్ (మీరాబెన్)
వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-39
కల్పిత బేతాళ కథ-9 అపార్థం
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®