సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. ఊహించని మలుపులే జీవితం. ఎవరి ఆయుస్సు ఎంత కాలామో దేన్నీ బట్టి వుంటుందో ఎవరు చెప్పగలరు. కూతురు పోయి తల్లి మిగిలింది. కవితలు అర్ధ వతంగా ప్రశాంతం గా వున్నాయి -ధన్యవాదములు – రోహిణి

  2. 2

    Bhuvanachandra

    రోహిణి గారు హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్ యు సో మచ్

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్కారం భువన చంద్ర గారూ.
    ఏ క్షణాన ఏమి మాయ జరుగుతుందో తెలియదు.
    కుసుమ తల్లి మరణం, అటు వృద్దురాలి స్థితి బాధాకరం. కానీ ఏమీ చేయలేని స్థితి.
    ఆవిడకి దహనసంస్కారాలు చేయటానికి రాలేదు కానీ ఆస్తికోసం మాత్రం నిలబడ్డారు. ఈనాడు ఈ విధంగా శవరాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి.
    మనుష్యులు మనిషిగా బ్రతకటం మరచి పోతున్నారు.
    ఇందిర మహి ఆలోచనా సరళిని బాగా గమనించి అర్థం చేసుకుని మహి
    ముందు జీవితంకి మౌనంగా మార్గదర్శనం వహించి తను కొంతవరకు నిలబడగలిగిన నా ఆశ.
    స్త్రీ మనసు భావాల వయసులో ఉన్నప్పుడు లోతుగా విచారణ జరపదు. కొంత
    వయసు మళ్ళిన తరువాత ఏమి కావాలో ఏమి కోల్పోయారో ఏది కావాలో తెలుస్తుంది.
    కానీ అప్పటికే అనుభవించే జీవితం జారిపోతుంది. ఏమీ చేయలేని స్థితి. నిస్సహాయత. శూన్యంగా అనిపించి ఏదైనా చేయటానికి ప్రయత్నించిన వారవుతారు. మీరనట్టు లక్ష భావాలు చెప్పనిది ఒక స్పర్శ చెబుతుందన్నారు.
    ఇది చాలా నిజం.
    ఇందిరకు ప్రేమ అభిమానం ఓదార్పు కావాలి. అది మహి తండ్రి ద్వారా
    కలిగించింది. దానిలోనే సేద తీరుతూంది. నిలబడగలిగింది.
    అలా ఆ ఊబిలోనుండి బయటపడి సెటిల్ అయింది. ఇందిర మాటలో ఎంతో లోతు
    భావాలు కనిపించేయి.
    తమిళ కవిత, పాదచారి కవిత, మహి వ్రాసిన కవితలు ఎంతో ఔన్నత్యాన్ని సంతరించుకున్నాయి.
    మనసుకి హత్తుకునేలా హాయిగా వ్రాయటం మీలో ఉన్న ప్రత్యేకత.
    జీవితాన్ని కోసమే భావాలు రుచులతో చూపించి జీవితాని కావలసిన ప్రశాంతంగా ఆనందంగా ఉండటానికి కొత్తదనాన్ని ప్రవేశపెట్టి ఆలోచించే శక్తి మానసికంగా అందిస్తారు.
    మీకు నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అండీ నమస్కారము.
    రమాదేవి.*

  4. 4

    BHUVANACHANDRA

    ధన్యవాదాలు రమగారు
    చక్కని స్పందన పంపినందుకు థాంక్ యు సో మచ్

  5. 5

    rama sundari

    ‘ఈ లోకానికి వచ్చినవారంతా ఇక్కడే ఉండిపోతే…’ అనే బావం దువ్వూరి రామిరెడ్డి గారు తన ‘పానశాల’ లో ‘అంతము లేని ఈ భువన మంత పురాతన పాంథశాల. విశ్రాంతి గృహంబు నందు నిరు సంజలు రంగుల వాకిలుల్, ధరా క్రాంతులు పాదుషాలు, బహరామ్ జమీషీదులు, వేనవేలుగా కొంత సుఖించిపోయిరెచటికో, పెరవారికి చోటొసంగుచున్’ గుర్తొచ్చింది. అది ప్రకృతి నియమం. జీవం దాని జీవలక్షణాన్నీ మరణించే వైనాన్నీ కూడా తనతోనే తెచ్చుకుంటుంది. ఈ లోకం అనేది జీవికి Manifestation field. ఎవరు ఏది ఎంచుకుంటే, ఎలా ఉండాలనుకుంటే అలానే ఉండొచ్చు. కానీ వాటి ఫలితాల్ని అనుభవించడానికి కూడా తయారుగా ఉండాల్సి ఉంటుంది. నిజమే కవీ, మరణాన్ని తాకే వరకు మనసు మళ్లీ మళ్లీ కొత్తగా పుడుతూనే ఉంటుంది. …చండి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!