సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Sobharaja

    🙏
    హిందీ తెలుగు తమిళ సినిమా వాళ్ళ నైజం గురించి తెలియని విషయాల గురించి చక్కగా విశదీకరించారు.
    చక్కని కవితలు అద్భుతంగా వ్రాశారు.
    మహి ఇందిర మనసును చక్కగా అర్థం చేసుకుంది. తన తల్లికి నచ్చని,తెలిస్తే బాధ పడుతుందని తెలిసినా ఒక అభాగ్యురాలి బాధను అర్థంచేసుకుని ఆమె మనసుకు ఊరట కలిగించింది. ఇంత చిన్న వయసులో అంత ఉన్నతంగా ఆలోచించకలగడం ఆవిడ సంస్కారాన్ని చాటుతోంది.
    నాకైతే గౌతమ్ ఒడిలో ఇందిర ప్రాణం పోతే ఆమె ఆత్మకు శాంతి గౌతమ్ జీవిత సమస్యకు పరిష్కారం దొరుకుతాయనిపిస్తోంది.
    ధన్యవాదాలండీ🙏🌹🙏

  2. 2

    BhuvanaChandra

    శోభ గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
    చాలా చక్కగా చదివి విశ్లేషించి రాసినందుకు నా కృతజ్ఞతలు స్వీకరించండి
    థాంక్యూ సో మచ్

  3. 3

    యామిని

    గుండె నిండా హిమవర్షం.
    ఈ అనుభూతిని మాటల్లో పొదగడం చాలా కష్టం.
    బాష గురించి అల చెప్పిన మాటలు డాన్స్టీచర్ ఇళ్లలో పనులు చేస్తూ భావంలో భాషని ఒదిగి చక్కగా నేర్చుకున్న విధానం.. అల పట్టుదల ముచ్చటగా అనిపించాయ్.
    మీ కవిత చాలా చాలా బావుంది.
    మహి నిర్ణయం ఇందిరగారికి ఇచ్చిన గౌరవం తండ్రికి ఆమెకు తను కల్పించిన ఏకాంతం ఎందుకో మనసుని కదిలించింది. తదుపరి కంటిరెప్పని చెమ్మ అలింగనం చేస

    1. 3.1

      BhuvanaChandra

      యామీజీ హృదయపూర్వక ధన్యవాదాలు వారం వారం మీరిచ్చే స్పందన నాకు ఎంతో సంతోషాన్ని స్ఫూర్తిని ఇస్తున్నందుకు మీకు మరోసారి మరోసారి ధన్యవాదాలతో భువనచంద్ర

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: * నమస్తే భువన చంద్ర గారూ. ఈ వారం సంచికలో సినిమా ప్రపంచం గురించి వాస్తవాలు, అలవాట్లు విషయం తెలిసింది.
    మన తెలుగు వారికి ఆదరణ, పోషించటం అనే మనస్తత్వాలు ఎక్కువగా ఉన్నాయి. చీకటి వెలుగుల కలయిక అనిపించింది.
    భాష భావం గురించి చాలా బాగుంది వివరణ.
    నృత్యం వ్యాయమమే కాదు మనసు ఇంద్రియాల బుద్ధిని శరీరాన్ని దృష్టిని ఏకాగ్రపరచి సమత్వ స్థితిలో ఉంచగలదు.
    ఇందిర పాత్రలో ఒదిగి ఆలోచిస్తే మనిషికి అహం, తొందరపాటుతో జీవితంలో ఏం చేయాలేని స్థితికి చేరి ఏదో విధంగా ఏదో సాధించాలనే పట్టుదల కనిపిస్తుంది.
    గౌతమ్ మౌనం వెనక ఉన్న అసలు మూలం ఇందిర పట్ల ప్రేమ, సానుభూతి ఉన్నా తను ఉన్న స్దితిలో ఏమీచేయలేని స్థితి
    ఇందిర మాటలని మనసుని చాలా విజ్ఞతతో చాలా పెద్ద మనసుతో విశాలహృదయంతో, సమయస్ఫూర్తిని హుందాగా తెలివిగా చూపించి గొప్ప మనసున్న మనిషిగా ప్రవర్తించింది. కాలం విలువలు తెలిసి అర్థం తెలుసుకుని ముడుచుకుంది.
    వారి స్దితి చూసి స్పందిచిన తీరు, కొనసాగింపు చాలా బాగుంది అభివందనాలు. చాలా అద్భుతమైన చిత్రీకరణ.
    చాలా ఆసక్తిగా ఉంది అండి. బాగుంది. మరో వారం త్వరగా రావాలని ఎదురుచూడటం తప్పదు కదా. ధన్యవాధాలు అండీ.*

    1. 4.1

      BhuvanaChandra

      రమాదేవి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
      వారం వారం చక్కగా చదివి మీ స్పందన తెలియజేస్తున్నందుకు మరోసారి మరోసారి షుక్రియ థాంక్యూ ధన్యవాద్

  5. 5

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. హృదయాన్ని కదిలించే భావాలు సన్నివేశాలు చాలా బాగా వ్రాసారు. భాష ఏదయినా భావంఒక్కటే ” మంచి కొటేషన్ అండీ. ఆర్తి తో కొట్టుకొని పోయే సోల్ ని పరమాత్మ లో కలిపారండీ. మనం పై శరీరాలనే ఆడ మగ భావం తో చూస్తాం. ఆ లోపల వున్న చైతన్యమ్ దాని ఆర్తి చూడం. ఎదో జన్మ బంధం, ఋణం, కార్యం ఉంటేనే ఎవరైనా కలిసేది అనే ఆలోచన బహు తక్కువ. ఎడారి లో దాహం తో కొట్టుకు పోతున్న వారికి గుక్కెడు నీళ్లు దొరికినట్లు ఇందిరకి గౌతమ్ వడి దొరికింది. ఓ జీవుడి ఆరాటానికి అనంతమైన తృప్తి ని ఇచ్చారు. మీరే సృష్టి కర్త కదా. హిందీ,తెలుగు,తమిళ్లో, వాళ్ల విశ్లేషణ సూపర్బ్ అండీ -ధన్యవాదములు -రోహిణి 💐

    1. 5.1

      BhuvanaChandra

      రోహిణి గారు ఎన్నో పనులతో నతమతమావుతూ కూడా సీరియల్స్ చదివి మీ స్పందనని తెలియజేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అందుకోండి
      ఎందుకంటే పాఠకుల స్పందన రచయితకి స్ఫూర్తి.. మరోసారి ధన్యవాదాలతో

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!