సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మహతి కి ఆ సన్యాసి పరిచయం కలగడం కాకతాళీయం అని నేను అనుకోవడం లేదు భువన్ జీ! వారిరువురి మధ్య జరిగిన లోతైన సంభాషణ ఫలితం, పరిణామం తర్వాతి కథలో తెలుస్తుందనుకుంటా. ఒకానొక అయోమయ స్థితిలో, అర్ధం కాని ఆలోచనల్లో ఉన్న మహతికి ఈ ‘అజ్ఞాని’ మాటలు ఏదో దారి చూపిస్తాయి.

    “వాళ్ళు” రెండు భాగాలు చదవడం చేత కొద్దిగా మీ రచనా చమత్కృతి ని ఊహించగలను. అనవసరంగా ఏ పాత్రనీ, ఏ సన్నివేశాన్ని కల్పించరు మీరు.
    చాలా మంచి చర్చను చేసారు ఈ వారం మీరు. ఏది అని చెప్పాలంటే మొత్తం ఈ భాగాన్ని ఎత్తి రాయాల్సి ఉంటుంది.
    మంచి మలుపు తిప్పారు, తర్వాత కథ ఏమౌతుందో అన్న ఆసక్తితో.
    అభినందనలు.

    1. 1.1

      BhuvanaChandra

      సుశీల గారు హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చక్కని స్పందన ఇచ్చి నా ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు..
      చాలా చాలా ఆనందంగా ఉంది
      థాంక్యూ సో మచ్, విత్ ఆల్ మై హార్ట్ అండ్ సోల్

  2. 2

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. వర్షాన్ని పృథ్వి దాహం తీర్చే అమృతం తో పోల్చడం అద్భుతమైన ఆలోచన. సృష్టిలోని కోటాను కోట్ల జీవరసులలో ఒక్క మనిషి మాత్రమే చేతులు చాచి దేబిరుస్తాడు ఎందుకు? అంటూ చాలా ప్రశ్నలు సంధించారు. అవునండీ నాకు అనిపిస్తుంది ఎందువలన?. రాలిపోయే ఆకులను మనిషి ప్రాణం పోకడతో ఎంతో సులువుగా పోల్చారు. అర్ధం పర్ధం లేని ఎదుటి వారిని కించ పరిచటానికో లేక యాదాలాపం గా వేసే ప్రశ్నలు ఎదురు మనకే వస్తాయి వళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని మహతి ద్వారా చక్కగా ఎరుక పరిచారు. సాక్షిగా లోకాన్ని ఎలా పరికించాలో బాగా చెప్పారండి -ధన్యవాదాలు – రోహిణి 🙏

  3. 3

    BHUVANACHANDRA

    రోహిణి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అండీ …నెల నెలా మీ స్పందన నాకు చాలా స్ఫూర్తి నీ ఉత్సాహాన్నీ కలిగిస్తోంది …thank you very much రోహిణి గారూ

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *
    ఈ వారం మీ రచనలో చాలా వైవిధ్యంగా ఉంది. మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ముఖ్యం. మీరు ఇచ్చిన జాగరూకత ఉండటం అనేది చాలా ముఖ్యం. చాలా అవసరమైన సందేశం ఉంది అండి. చాలా లోతైన సందేశం. ధన్యవాధాలు.
    కష్టం సుఖం అనేదానికి అనిర్వచనమైన అర్థం చాలా బాగుంది, అభివందనాలు. బాధే సౌఖ్యమనే భావనకి అర్థం, భావం చాలా నిక్కచ్చయిన అర్థం చెప్పారు. లోతయిన అర్థం తెలుసుకుంటే జీవితం గింజ తీసేసిన దూదెలా చాలా హాయిగా ఉంటుంది.
    ప్రకృతి ఒడిలో పెరిగే మనిషి ప్రకృతి మాతని కుళ్ళబొడిచే స్థితికి ఎదిగి తనని తాను హింసించడం మొదలుపెట్టాడు.
    గాలి వర్షం వీటి ద్వారా జీవి జననం మరణాల గురించి వాస్తవాలు విషయాల విశ్లేపణ చాలా బాగా చేసారు.
    ఇప్పటివరకు మీరు వ్రాసిన తీరు తెన్నులు ఆలోచనలు ఎంత సహజంగా ఉన్నాయో
    ఈ వారం మీ రచనలో అంతే సహజమైన జీవిత, ఆధ్యాత్మికతని దాని లోతుల్ని చూపించి
    ఆలోచించేలా చేసారు.
    ధన్యవాదాలు అండీ, సంతోషం వేసింది. మీ రచనలకు నా ఆత్మానందం అనుభూతిని
    తృప్తిగా పొందటం జరుగుతున్నది. చాలా భావగర్భితమైన రచనా శైలికి నా శిరసులంచి పాదాబివందన చేస్తున్నాను.*

  5. 5

    Sobharaja

    🙏 మీరన్నట్లు ఒకే మతం ఒకే భాష ఉండుంటే ఈ పోట్లాటలు, మారణహోమాలు ఉండేవి కావేమో?!?!అసలు సృష్ట్యాదిలో దేవుడు ఆడ మగ అని వాళ్ళు పరస్పరం పలకరించుకోవడానికి ఒక భాష ఉద్భవించి ఉంటుంది. ఇన్ని భాషలు ఇన్ని జాతులు ఎలా ఉద్భవించాయంటారు?
    ఇంకపోతే ఈ మండుటెండలో వర్షాన్ని అతి సహజంగా అద్భుతంగా వర్ణించి మీ నవల చదువుతున్నంతసేపు తొలకరి చినుకులు దగ్గర్నుంచి భారీ వర్షం వరకు ప్రకృతి స్పందనను వర్ణిస్తూ మమ్మల్ని వర్షంలో ఓలలాడించారు. ప్రకృతిని కళ్ళకు కట్టినట్లు వర్ణించగలగడం మీకు మాత్రమే సాధ్యమేమో!!
    ధన్యవాదాలు🌹🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!