సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Bharadwaj V

    Very well written.
    “ప్రియా! ఇవాళ నరకానికి స్పెషల్ గెస్టు వస్తున్నాడు” గదిలోకి వస్తూనే ఎనౌన్స్ చేసింది భజన

    “అలాగా! ఎవరో?” అడిగా నేను

    “ఇంకెవరు? ప్రపంచంలో నెంబర్ వన్ మెంటల్ కేసు” అంది భజన

    “ఎవరబ్బా? కొంపదీసి .. ప్ర .. ప్ర .. కాదు నా .. నా .. కాదు కాదు .. మా .. మా” నోరు పెగల్లేదు నాకు

    “భయపడకు అతను కాదులే. వాడు అతిపెద్ద మెంటల్ కేసు. పాకిస్తాన్లో ఈ మధ్యే అమేరికన్ నేవీ సీల్స్ లేపేసారు వాడిని” అంది భజన.
    “ఓహ్హ్ ఘోషామా లాడెనా! వాడు పిచ్చి వాడేంటి? టెర్రరిస్టయితేనూ?” అనుమానంగా అడిగా నేను

    “వాడి బొంద. మూడువేల మందిని చంపి వాడు సాధించింది ఏమిటి? ఇరాక్ నీ ఆఫ్ఘనిస్తాన్ నీ నాశనం చేసాడు”

    “నిజమే సుమీ”

    “అంతే కాదు, వీడి పిచ్చి తుగ్లక్ పనులవల్ల ఎయిర్లైన్స్ సెక్యూరిటి దగ్గర ప్రయాణికులు చెప్పులు విప్పటం మినహా పెద్దగా ఏమీ మార్పు లేదు” ముక్తాయించింది భజన

    “భజన గారూ, యమధర్మరాజుగారు పిలుస్తున్నారు. ఏదో సమస్య వచ్చిందట, మీతో చర్చిద్దామని” అంటు లోపలికొచ్చాడు ఒక కింకరుడు

    “సరే ప్రియా, అయిదు నిమిషాలలో మళ్ళీ వస్తా” అని చెప్పి వెళ్ళింది భజన

    అన్నట్టుగానే అయిదు నిమిషాల్లో తిరిగి వచ్చింది, “ఏదో పాపుప్ల శిక్షల గొడవలే” అంటూ

    “అందులో సమస్యేమిటి”

    “వీళ్ళూ కరుడుగట్టిన పాపులట. భయంకరమైన శిక్ష సామూహికంగా విధించగలిగేది ఏమన్నా ఉంటే ఒక గంట రెండుగంటల్లో చెప్పమన్నాడు యముడు”

    “అవునా. మరి ఆలోచించావా?” అడిగా నేను

    “ఆలోచిస్తున్నా” అంది భజన

    “ఎంతమంది ఉన్నారేమిటి?”

    “తొమ్మిది గదుల్లో గదికి ఎనిమిది మంది చొప్పున ఉన్నారు. ఇంతమందికి సామూహికంగా విధించే శిక్ష కావాలిట” అంది భజన

    “అది సరేగానీ ఘోషామా సంగతేమిటి?”

    “అక్కడికే వస్తున్నా. వాడు చేసిన పనులకు ప్రతిగా ఇక్కడికి వస్తున్నాడు”

    “అవునూ, నాదో ప్రశ్న” అడిగా నేను

    “ఏమిటది?” అడిగింది భజన

    “వాడి సిద్ధాంతం ప్రకారం వాడికి 72 మంది అమ్మాయిలతో కూడిన స్వర్గం కావాలి కదా. నరకానికి ఎందుకొస్తున్నాడు?” నా డౌట్ అదిగేశా

    “ముందు స్వర్గానికే తీసుకెళ్ళారు. అయితే వాడు అదో టైపుట”

    “అదో టైపంటే?” అర్థం కాలేదు నాకు

    “అదే ప్రియా, దోస్తానా” అంది భజన

    “అర్థం కాలేదు భజనా”

    “అబ్బా, నీకెలా చెప్పాలి ప్రియా. భరత్ గోళం గారి విసజ్ఞ బ్లాగు చదివావా?”

    “ఒహ్హ్ అదా!” వెలిగింది నాకు “అంటే వాడికి మగవాళ్ళు కావాలన్నమాట”

    “అవును ప్రియా. అయితే స్వర్గంలో మగవాళ్ళ కొరత ఎక్కువగా ఉందిట. అందుకని వాడిని నరకానికి పంపిస్తున్నాడు ఇంద్రుడు”

    “కానీ ఇక్కడ 72 మంది అబ్బాయిలు ఎక్కడ దొరుకురాతు?”

    “నేను కూడా అదే ఆలోచిస్తున్నా ప్రియా”

    “భలే చిక్కొచ్చిపడిందే” అన్నాను నేను

    “వన్ మినట్. ఇందాక నేను చిప్పిన పాపులెంతమందీ?” భజన కళ్ళు మిలమిలా మెరిసాయి

    “తొమ్మిది గదుల్లో ఎనిమిదేసి మంది”

    “అంటే ప్రియా, మొత్తం 72 మంది!” అరిచినంత పని చేసింది భజన

    “నిజమే సుమీ”

    “అంటే, వాడీకి కావాల్సిందీ దొరుకుతుంది. ఈ 72 మందికీ భరించలేని శిక్షా పడుతుంది. హౌ ఈస్ దట్?” అంపైర్ మీద ప్రెషర్ పెట్టే బౌలర్లా అడిగింది భజనా

    ఒకే దెబ్బకి రెండు పిట్టలు, అటు ఘోషామా లాడెన్ సమస్య, ఇటు యముడి సమస్య రెండూ తీరాయి.

    భజనా, యూ ఆర్ ఏ జీనియస్. యూ ఆర్ రియల్లీ రియల్లీ ఏ జీనియస్!!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!