సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “కలిమిలేములు” కథ చాలా చాలా బాగుంది వాణీ గారూ! నిజజీవితంలోని కఠిన వాస్తవాలను కళ్ళ ముందు నిలిపారు మీ రచన ద్వారా. నిజమే! ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా అన్నమే తింటారు గానీ, కరెన్సీ నోట్లను తినరు. “లక్షాధికారి యైన లవణ మన్నమె గాని మెరుగు బంగారమ్ము మ్రింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు” అని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు (నరసింహ శతకం)……డబ్బుతో సాటి మనుషులను ఏమార్చవచ్చు గానీ, సత్యాన్ని మరుగు పరచలేరు. ఇవన్నీ పైవాడు చూస్తూనే ఉంటాడు. ఏనాటికైనా కర్మఫలం అనుభవించక తప్పదు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి ని వర్ణసంకరపు వివాహం చేసుకోమని వత్తిడి చేస్తుంటే, “పాపపుణ్యాలు విచారించటానికి పైన దండధరుడు ఒకడు ఉన్నాడు” అని అంటాడు హరిశ్చంద్రుడు. … మీ కథ ఎన్నెన్నో ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నది. …అభినందనలు.

    1. 1.1

      డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

      కథ చాలా చాలా బాగుంది అన్నందుకు ధన్యవాదాలు మురళీకృష్ణ గారూ ..!’ ఈ కథ ఎన్నెన్నో ఆలోచనలను రేకెత్తించేదిగా వుంది ..’ అన్న మీ మాటలు ఎంత ఆనందాన్ని కలిగించాయో .! కథను విశ్లేషించే సంధర్భంలో మీరు చెప్పిన పురాణ కథాంశాలు కథకు మ్యాచ్ అయ్యేలా ఉండి క్వటేషన్స్ కూడా అవును అనిపించేలా వున్నాయి .. ఎంచక్కటి కామెంట్ పెట్టారు ..! కలిమి శాశ్వతం కాదని , ప్రకృతి ధర్మం ముందు ఎంత వున్నవాడయినా తలవంచక తప్పదనీ , డబ్బుతో అన్నీ కొనుక్కోలేరని ఈ కథ ద్వారా నేను చెప్పదలచుకున్నాను ..దానికి నిజమే అన్నట్టు వుంది మీ వ్యాఖ్యానం .. టైమ్ వెచ్చించి విని , కథకు ప్రశంసాపత్రం లాంటి కామెంట్ ని పెట్టారు 😊థాంక్యూ అండీ ……🙏

  2. 2

    ఎం.వి.ఎస్. రంగనాధం

    రావాల్సిన వాళ్లందరికీ బుద్ధి రాలేదు కదా, ఈ కథ అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఆక్సిడెంట్ (accident) చేసిన వాళ్ళని వదలి వేరే వాళ్ళని పోలీసులకు పట్టిచ్చి డబ్బుతో అందరినీ మేనేజ్ (manage) చెయ్యడం చాలా కాలం నుండి వింటున్నాం. నేటి కార్పరేట్ (corporate) ప్రపంచంలో ఉన్న బెంచ్ స్ట్రెంగ్త్ (bench strength) అన్న కాన్సెప్ట్ (concept) ఈ రోడ్డు ఆక్సిడెంట్ల విషయంలో ఎప్పట్నుంచో వింటున్నాం. నిత్యం బస్సు సర్వీసులు నడిపే వాళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళు ఉంటారట, ఆక్సిడెంట్ అయినప్పుడు జైలులో కూర్చోడానికి. ఇక, అడ్డంగా సంపాదించిన వాళ్ళ పిల్లలు చెడిపోవడానికి కారణం వారసత్వంగా వచ్చే ఆస్తే అయితే, ఆ పద్ధతిలో ఏమన్నా ఆంక్షలు పెడితే బాగుంటుందేమో ఆలోచించాలి.

  3. 3

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    చిన్న కథ లో అన్నీ చెప్పటం కుదరడుకదా అందుకనితతిమ్మా ముగింపు మీ ఊహకు వదిలేసాను 😊జీవిత చరమాంకంలో పెద్దాయన పశ్చాత్తాపంతో ఆలా ప్ప్రయశ్చిత్తం చేసుకున్నాడు కదా ..! ఇక అయన కొడుకు , కూతురికి అనుభవాలే పాఠాలు నేర్పాలి విచ్చలవిడితనం, డబ్బు మదం ఉంటే ఏమవుతుంది అన్నది . అవును ..రంగనాథం గారూ ..డబ్బున్నవాళ్ళ పిల్లలు ఆక్సిడెంట్ లు చేస్తే వాళ్ళ దెగ్గర పనిచేవాళ్ళు జైలు కు వెళ్ళటం చాలా చోట్లజరిగేదే .. కానీ బస్సు డ్రైవర్లు ముందుగా అలా కిరాయిమనుషులను రెడీ గా పెట్టుకుంటారు అని మీ ద్వారా తెలిసి ఆశ్చర్యపోయాను .ఏమి సమాజంరా దేవుడా ..అనిపించింది .ఎటు చూసినా అక్రమాలు , అన్యాయాలేనా ఇక ..?అందుకే నా కథలో చెప్పాను .. డబ్బుతో కిరాయిమనుషులను కొనుక్కోగలవేమోగానీ యవ్వనాన్ని , ఆరోగ్యాన్ని , మనఃశాంతి ని కొనుక్కోలేవు అని ..తండ్రిని చూస్తూ పిల్లలు కూడా ఈ విషయాన్ని గ్రహించి జీవితపాఠం నేర్చుకొని ఉంటారని ఈ కథముగింపు ను ఊహించుకోవచ్చు మనం .Thank you మీ మంచి , విశ్లేషణాత్మక మోమెంట్ కి ……🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!