సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    విహారి గారూ !.. నమః
    1. “ఢిల్లీని విడిచి యాతడు కాశికాపురి కరిగెను. కాని యాతని పేరు ప్రఖ్యాతుల కీర్ష్యాళువులయిన పండితుల సత్యదూరములగు నపనిందాంచిత వాగ్ధోరణి హృదయకంటకమై బాధింప నా పురిని విడిచి పండితరాయలు నిలువనీడ వెదకికొనుచు పలుతావుల కరిగెను; పలువురు భూవరులను సందర్శించెను. ఏమయిననేమి ఆ మహాకవి పండితరాయల జీవితము చరమదశ విషాదాంతము, నజ్ఞాతము నయినది.” అని మహాపండితులు మల్లంపల్లి సోమశేఖర శర్మగారు పండితరాయల చరమ దశ అజ్ఞాతము అని వ్రాసారు. దానిని మీదైన శైలిలో జ్ఞాతము చేసారు. అభినందనలు.
    2. పండితరాయల లహరీ పంచకంలో పేరు పొందిన గంగాలహరీ రచన శిఖరిణి వృత్తములో ఉంటుంది. శిఖరిణి అంటే సంబారములు చేర్చి పక్వముచేసిన మజ్జిగ ( చల్లపులుసు). చదివిన వారికి మానసికంగా చల్లదనపు ప్రశాంతతను తన గంగాలహరి కలిగిస్తుందని నమ్మకమేమో… శిఖరిణి వృత్తాన్ని కవి స్వీకరించాడు. అందుకే మీరు కూడా గంగా హారతి, గంగా లహరితో మీ కథాకావ్యాన్ని ముగించి ఉంటారని భావిస్తున్నాను.(తనువుని చల్లగా తాకింది తెమ్మెర)
    3. జలం తే జంబాలం మమ జననజాలం జరయతు ( (అమ్మా ! గంగా ! నీ నీరు ఈ జననమరణ చక్రానికి ముగింపు పలకాలి) అని పండితరాయలు గంగా లహరిలో కోరుకొన్న భావన మీ రు ఈ కథాకావ్యంలొ చివరిలో వ్రాసిన వాక్యాలుగా మారాయని భావిస్తున్నాను.
    4. ఇతర కవి వాక్యాలు ఉదహరించటానికి అంతగా ఇష్టపడని జగన్నాథుని ఆత్మ ప్రత్యయం లక్ష్మీస్తోయ… ( శివాపరాధ క్షమార్పణ స్తోత్రం) కాలోహ్యయం .. ( భర్తృహరి) మొదలయిన శ్లొక పంక్తుల స్మరణతో కరిగిపోయింది. మోక్షార్హునికి కావాలసిన లక్షణాలలో ఒకదానిని ఈ ఉత్తమ రచనల స్మరణ ఆ కవికి సమకూర్చిపెట్టింది. పాత్ర చిత్రణలో చక్కని పరిణతిని చూపించారు. మీకు మరోమారు అభినందనలు.
    ఆచార్య తాడేపల్లి పతంజలి

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఈరోజు సీరియల్ చదువుతున్నంతసేపూ మనసు భావోద్విగ్నతకు లోనయ్యింది. నిజమే.. ఎక్కడి ముంగండ? ఎక్కడి కాశీ? ఒక తెలుగు పండితుని వైభవం, అనన్యసామాన్య ప్రతిభ, నాయకత్వ లక్షణాలు.. ఓహ్.. అపూర్వం.. అద్భుతం.. ఇక మిగిలింది.. నవల ఇంటికి చేర్చుకునే తాపత్రయం.. నమస్సులు గురువు గారూ.. 🙏🏼 MRVS Murthy

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    విహారి గారికి నమస్సుమాంజలి.
    మీరు ‘జగన్నాథ పండితరాయలు’ నవలని తెలుగు నవలా సామ్రాజ్యానికి అందించడం కోసం అర్థశతాబ్ది పైగా కలగన్నారు.ఎంతో పరిశీలించి, పరిశోధించి నవలా రచన గావించారు. 2020 లో మా గుడివాడ వచ్చినప్పుడు కూడా “జగన్నాథ పండితరాయలు’ నవల వ్రాయాలనుకుంటున్నాను. లైబ్రరీకి వెళ్లి అందుకు ఉపయోగపడే పుస్తకాలు దొరుకుతాయేమో వెదకాలి అని కూడా అనుకున్నారు.ఇంత గొప్ప సాహితీ , చారిత్రక నవలను వ్రాసి తెలుగు పాఠకులకు అందించిన మీకు మనహ్పూర్వక అభినందనలు, ధన్యవాదాలు మీకు, సంచిక వారికి. 🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻.
    పుట్టి నాగలక్ష్మి

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    నవల ముగియడం బాధాకరంగావున్నా , ముగింపు అద్భుతంగ వుంది. నేనింతవరకు కాశీ వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు మాత్రం జగన్నాధ పండితరాయులు గారి కోసం వెతుకుతాను. కన్పిస్తే ముందుగా పాదాభివందనం చేసుకున్నాకే మాట్లాడతాను 👌👏💐🙏🙏
    జయశ్యామల తురగా

  5. 5

    Trinadha Rudraraju

    ఈ నవల చారిత్రక పరిణామమేకాక సాహిత్యం – ఆధ్యాత్మికమిళితమైన సంస్కృతీసుసంపన్న కథనంతో అద్భుతంగా సాగిన అరుదైన ప్రయోగం. ముఖ్యంగా జగన్నాథ పండితరాయులు గురించి పాఠశాలలో(ఉపాధ్యాయులు శ్రీ ప్రయాగ సూర్యనారాయణ గారు చెబితే) విన్నాము కాని విపులంగా ప్రస్తుతించిన శ్రీ విహారి గారికి ధన్యవాదాలు🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!