సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

  2. 2

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    చాలా మంచి స్ఫూర్తి దాయక ఇంటర్వ్యూ సార్👏👏👏👏👏👏👏 సుదీర్ఘ,సమగ్ర మైన గంటి సుబ్రహ్మణ్య శర్మ సార్ గారితో ప్రసాద్ సార్ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది . ఎన్నో తెలియని విషయాలు తెలిపారు ఈ ఇంటర్వ్యూ ద్వారా. ముందు పేరు చాలా చాలా ఆశ్చర్యం కలిగించింది. చాలా విలువైన ప్రసాద్ సార్ గారి ప్రశ్నలకు ఎంతో ఆసక్తి కరమైన సమాధానాలు చెప్పారు శర్మ సార్ గారు.అప్పటి పరిస్థితులకు కొన్ని చోట్ల బాధ కలిగింది కొన్ని చోట్ల మగవాళ్ళు ప్రేమలేఖలు వ్రాసే వాళ్ళంటే నవ్వొచ్చింది. ఓ మంచి కధా నవల రచయిత ను పరిచయం చేశారు చాలా సంతోషం కలిగింది చదువు తుంటే. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎందరో రచయితల పేర్లు పత్రికల పేర్లు అప్పటి స్థితి గతులు అర్థం అయ్యాయి.ఉదయాన్నే చదవగానే ఓ మంచి అనుభూతిని మిగిల్చింది ఈ ఇంటర్వ్యూ. హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రసాద్ సార్ గారికి, సుబ్రహ్మణ్య శర్మ సార్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు ఇరువురు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శెలవు సార్ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    మొహమ్మద్ .అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ. గో. జి )

    1. 2.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  3. 3

    Rajendra+Prasad

    ఎప్పటిలాగే బాగా ఇంటర్వ్యూ చేశారు. మంచి రచయితను పరిచయం చేశారు. ధన్యవాదాలు

    – రాజేంద్ర ప్రసాద్

  4. 4

    పుట్టి. నాగలక్ష్మి హన

    గంటి రమాదేవి గారికి మీరు సంధించిన ప్రశ్నలు, వారి సమాధానాలు గొప్పగా ఉన్నాయి.. రమాదేవి గాదు ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా సమాధానాలని అందించారు.. ఇద్దరికీ అభినందనలు 🌹🌹💐💐🙏🏻🙏🏻

  5. 5

    శ్యామ్ కుమార్ చాగల్

    నేనింత వరకూ చదివిన డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారి ‘సంభాషణ ల’ పర్వం లో శ్రీ గంటి రమాదేవి గారి పరిచయం,సంభాషణ అద్భుతమైనది చెప్తాను
    మొదటగా ఆ రచయిత స్త్రీ కాదు అది కలం పేరు అన్నది తెలిసి ఆశ్ఛర్యానికి గురయ్యాను.ఇంత అద్భుత మైన రచయిత గురించి మనకిన్నాళ్ళూ తెలియక పోవటం అన్నది . విస్మయం కొలిపించేదే .
    అసలు కలం పేర్లు విచిత్రం గా వుండి కొన్ని సార్లు మనకు తెలిసి పోతాయి. కానీ ఈ పేరు మాత్రం ఏ విధంగా కూడా ఊహకు అందనిది. దానికి గల కారణాలు రచయిత గారు చెప్పినవి చదివి చాలా బాధపడ్డాను.
    అదే విధంగా రచనా కార్యక్రమంలో , మన సమాజం లో అతను ఎదుర్కున్న ఇబ్బందులువారి తమ , ప్రచురణకర్తలు చేసిన అన్యాయాలు,అక్రమాలు, పెట్టిన ఇబ్బందులు తెలిసి బాధ కలిగింది. అయితే అతని రచనా పటిమ ను ప్రోత్సహించిన వారు కూడా ఎంతో ధన్యులు.

    ప్రతీ కళాకారుడు కూడా మొదట ఇబ్బందులు ఎదుర్కొన్నవాడే అనే సంగతి కూడా మనం మరువొద్దు.
    అయితే ఇక్కడ పేరొందిన రచయితలు చాలా వరకు స్వార్థ పరులు గా ఉండటం మన దేశంలో వున్న దురదృష్టం.
    వీరు ఎంతసేపూ తమ గొప్పతనాన్ని చాటింపు వేసు కోవటం లో వుండే స్వార్థం తోనే జీవితాన్ని ముగించేస్తారు.
    కళాకారుల ప్రతిభను తన వంతు సేవగా మనందరికీ, సంచిక ద్వారా పరిచయం చేస్తున్న డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ కు నా హృదయ పూర్వక అభినందనలు.

  6. 6

    sunianu6688@gmail.com

    Klv prasad గారి ఇంటర్వ్యూ రచయిత గంటి రమాదేవి గారితో చాలా సూటిగా జరిగింది. గంటి రమాదేవి గారు రచయిత అవ్వడం ఇంటర్వ్యూ అద్భుతంగా,ఆశ్చర్యంగా కొనసాగింది. ప్రతి సమస్య ని ఎదుర్కొని నిలబడటం గొప్ప విషయమే కదా.ఇప్పుడంటే social media vundhi. ఎవరికి వారు easy ga promote చేసుకుంటున్నారు.చివరిగా రచయిత గారు చెప్పినట్లు తమ పిల్లలకు తెలుగు నేర్పటానికి తల్లిదండ్రులు కృషి చేయాలి.గంటి రమాదేవి గారికి, klv prasad gariki హృదయ పూర్వక శుభాకాంక్షలు👌💐

  7. 7

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    శ్రీ శర్మ గారి రమాదేవి కలం పేరుతో పాటు వారి జవాబులు చాలా వినూత్నంగా ఉన్నాయి.స్వచ్ఛమైన మనస్సుకు అద్దం పట్టే వారి ఆలోచనల్ని చాలా మంచి ప్రశ్న లతో ప్రతిఫలింపచేశారు.ముందుతరం అనుభవం ,సాహితీ జిజ్ఞాస చాలా గొప్పది.పద్ధతైనది. శర్మ గారి మాటలు పాఠాల్లా ఉండి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.ఇట్టి మహానుభావుల రచనలు పుస్తక రూపంలో అందుబాటులో ఉంటే మా తరానికి ఎంతో మార్గ దర్శకంగా ఉండును.చాలా చాలా మంచి ఇంటర్వ్యూని చేశారు డాక్టర్ గారూ.మీకు ,శ్రీ శర్మ గారికి నమస్కారాలు🙏👌
    💐💐–నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 7.1
  8. 8

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    కథా, నవలా రచయిత గంటి రమాదేవి గారి అంతరంగ ఆవిష్కరణలో..శ్రీ గంటి సుబ్రహ్మణ్య శర్మ గారే గంటి రమాదేవి కలం పేరుతో రాయడం వెనక ఉన్న కథనాన్ని శర్మ గారు తెలిపారు. ఆనాటి పత్రికల నిష్పక్షపాతం గురించి, కొత్త తరం రచయితలకు వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం గురించి రచయిత నిర్మొహమాటంగా చెప్పారు. కాల ప్రవాహంలో ఎండిపోయిన ఆకు మీద పిపీలకం లాంటి వాడినని చెప్పడం శర్మ గారి నిరాడంబర వ్యక్తిత్వాన్ని తెలియచేసింది. శర్మ గారి కథలు వారపత్రికలలో చదివాను.
    –జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    1. 8.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      చారిగారు
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!