మరో సమయానుకూల ఆలోచన
పిల్లలు
పులుల, ఏనుగుల రూపాల్ని
మేఘాల ఆకారాల్లో చూసినట్టు
ఓ ఆలోచన తళుక్కుమంటుంది
చాలా మంది కాలంలో
జ్ఞానాన్నీ, దార్శనికతని గ్రహిస్తారు
చాలామందికి ఆ విశ్వాసపు ఛాయల్లో
తమ వెతుకులాటకు ముగింపు కూడా లభిస్తుంది
మనం కాలం అనుకుంటున్నది
నిజానికి ‘దైవం’
కానీ
సత్యాన్ని వెతికే వారు
కాలమంటే ఏమిటి అన్న ప్రశ్నను
తమ హృదయపు లోతుల్లోనూ
తమ ఆలోచనల్లోనూ నింపుకుని
సంచరిస్తూనే వుంటారు
మూలం: జావేద్ అఖ్తర్
తెలుగు: వారాల ఆనంద్

కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత
3 Comments
కొల్లూరి సోమ శంకర్
పోయెమ్ బావుంది సార్. అభినందనలు…
డా. వెల్దండి శ్రీధర్, హైదరాబాద్
కొల్లూరి సోమ శంకర్
మరో సమయానుకూల ఆలోచనలో సృజనాత్మ చాలా బాగుంది. జ్ఞానానికీ, ఆలోచనకూ, సత్యానికీ దేవ దూతగా,బహుశా కవిత్వానికీ, అక్షరానికీ నీటి ఊటలా తడిగా వడిగా పరుగిడే అనిర్వచనీయ శక్తి కాలం. ఆలోచనను వదిలిన బాణమే కాలం. ఇది గొప్ప కవిత మూల కవితను ప్రభావితం చేసినది.కంగ్రాట్స్ ఆనంద్..ఆల్ ది బెస్టు…
ఈ కవితానువాద కవితను అందించిన ‘సంచిక’ సంపాదకులు శ్రీ కస్తూరి మురళీ కృష్ణ, సోమ శంకర్ లకు కృతజ్ఞతలు
డా.టి.రాధాకృష్ణమాచార్యులు
సీనియర్ కవి, ప్రముఖ వైద్యులు హైదరాబాద్
కొల్లూరి సోమ శంకర్
సంచరిస్తూనే. ముగింపు లేని అనంత వెతుకులాట తండ్లాట

Dr. M VIJAYA MOHAN REDDY, M.D. PHYSICIAN and writer