అలా.. నేను ఎప్పుడూ అనుకోలేదు! అది.. నా స్థిరనివాస స్థలం అవుతుందని..!!
ఆలోచిస్తే కొన్ని విషయాలు ఆశ్చర్యంగానే అనిపిస్తాయి. ఎందుచేతనంటే అన్నీ అందరూ అనుకున్నట్టు జరిగిపోవు. పుట్టిననాటి నుండి గిట్టేనాటి వరకూ మనిషి ప్రయాణం ఎటు నుండి ఎటు పోతుందో, ఎలా పోతుందో, ఎందుకు పోతుందో ఎవరమూ ఊహించలేము. ఊహించినట్టుగా అన్నివిషయాలూ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే అంతటి అదృష్టం మరింకేమి ఉంటుంది? అలా అని అనుకున్నవి అనుకున్నట్టు జరిగేది ఎందరికి? బహు కొద్ది మందికే అలా జరుగుతుంది.
మనిషి పుట్టుక ఎక్కడో, పెరిగేది ఎక్కడో, చదువు సంధ్యలు ఎక్కడో, ఉద్యోగం – సద్యోగం ఎక్కడో, బ్రతికి బట్ట కట్టేది ఎక్కడో, చివరికి కట్టెగా మిగిలేది ఎక్కడో ఎవరు మాత్రం చెప్పగలరు? దేవుడిమీద నమ్మకమున్న ఆస్తికులు అందరూ ‘అంతా దైవలీల’ అంటారు, అలా అనుకుని తృప్తి పడతారు. దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఆలోచిస్తారు నాస్తికులు. ఎవరు ఎలా అనుకున్నా జరిగేవి అలా జరిగిపోతూనే ఉంటాయి. మనం కేవలం ప్రేక్షకులు మాదిరిగా, జరిగేవన్నింటినీ చూస్తూ ఉండిపోతాం.
తగినన్ని ఆస్తిపాస్తులు వుండి, ఉన్నచోటనే తమ జీవితాలని తీర్చిదిద్దుకునేవారు కూడా వుంటారు. వారికి ఎక్కడికో పోయి ఉద్యోగం చేయాలనీ, ఉద్యోగంతోనే పొట్ట నింపుకోవలసిన నియమం అవసరం ఉండదు. వాళ్లకు అన్ని విధాలా కలిసొచ్చే జీవితం అది. అలాంటి జీవితం ఏ కొద్దిమందికో ప్రాప్తిస్తుంది. మిగతా వారి పరిస్థితి ఎంతమాత్రమూ అలా ఉండదు. జీవన యానంలో అందరూ ఇవి చవిచూచే అంశాలే, జీవిత సత్యాలే! అందుచేత ఎక్కువ శాతం మంది జీవితాలు ఎలా ప్రారంభం అవుతాయో, ఎలా ముగుస్తాయో ఎవరికీ తెలియదు.
ఊహించని రీతిలో అంచెలంచెలుగా కొనసాగిన నా జీవితం ప్రత్యేకమైనది, అతి తక్కువమందికి అవగాహన కాగలిగిన గూఢమైన జీవితం నాది. ఇలాంటి నా జీవితం శత్రువుకి కూడా ఉండకూడదని, కష్టాలు గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుంది. కానీ, కష్టాలతో కొనసాగి, చక్కని మలుపు తిరిగి నన్నొక ప్రయోజకుడిని చేసిన నా జీవితం గొప్పదనే భావిస్తాను. అయితే కల్లోల భరితమైన జీవితానికి ఎదురుగా నిలిచి సుఖమయ జీవితాన్ని పొందగలగడం సామాన్యమైన విషయం కాదు. అదొక పెద్ద సమరం. దానిలో విజేతను కావడం నా అదృష్టమే! నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలమే! నా సోదర సోదరీమణులు అందించిన సహకార బలమే అని నేను భావిస్తాను. నా అనుభవంలోనుంచి స్థిరపరుచుకున్న నా అభిప్రాయం ఇది.
దిండి (తూ. గో. జి) గ్రామంలో పుట్టి పెరిగి, అక్కడే ప్రాథమిక విద్యాబ్యాసం పూర్తి చేశాకా, తాలూకా కేంద్రమైన ‘రాజోలు’కు హైస్కూల్ విద్యకోసం వెళ్ళక తప్పలేదు. కారణం మా దిండి గ్రామంలో హైస్కూల్ లేకపోవడమే! మా గ్రామానికి కొంచెం దూరం తేడాలో హైస్కూల్ చదువుకునే సౌలభ్యం ఉండేది. రామరాజులంక, శివకోడు, మల్కీపురం, సఖినేటిపల్లి, రాజోలులో హైస్కూళ్లు అందుబాటులో వుండేవి. ఎందుకో మా అందరి చూపు రాజోలు హైస్కూల్ మీదనే ఉండేది. అలా రాజోలులో అప్పట్లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గొల్ల చంద్రయ్య గారు నడుపుతున్న వసతి గృహంలో ఉంటూ హైస్కూల్ చదువు ప్రారంభిచినప్పటికీ అది నాకు కలిసి రాలేదు. అందువల్లనే ఎనిమిదవ తరగతి పూర్తి చేయకుండానే అనారోగ్య కారణంగా హైదరాబాద్ వెళ్లడం, చికిత్స పూర్తికాగానే మెట్రిక్యులేషన్ పూర్తి చేయడం, ఇంటర్మీడియెట్ కోసం నాగార్జున సాగర్‌లో వున్న అక్క దగ్గరికి వెళ్లి చదూకోవడం, అది పూర్తికాగానే తిరిగి హైదరాబాద్‌కు వచ్చి, ఒక సంవత్సరం బి.ఎస్.సి. చదవడం, అలా చదూతుండగా బి.డి.ఎస్.లో సీటు రావడంతో, నా జీవన గమనమే పూర్తిగా మారిపోయింది. అదిగో అలా ఉస్మానియా వైద్య కళాశాలలో ఎం.బి.బి.ఎస్ చదువుతున్న ఎసెందర్ (తర్వాత పి.జి. చేసి ఎనాటమీ ప్రొఫెసర్ అయినాడు) పరిచయం అయినాడు. బహుశః నా సామాజిక వర్గానికి చెందినవాడు కావడం మూలాన నాకు మరింతగా దగ్గరైనాడని ఇప్పుడు అనిపిస్తుంది.

రచయితకు మొదట ‘హన్మకొండ’ చూపించిన మిత్రుడు డాక్టర్ ఎసెందర్

ఎనాటమీ ప్రొఫెసర్ గా డా.ఎసెందర్ (హైదరాబాదు)
మొదట్లో అతను ‘హన్మకొండ’వాసి అని నాకు తెలీదు. తర్వాత ఏవో సెలవులు వచ్చినప్పుడు నన్ను వాళ్ళ ఊరు హన్మకొండకు తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ ఇల్లు నయీమ్ నగర్లో ఉన్నట్లు నాకు గుర్తు. అప్పటి వరకూ నాకు హన్మకొండ గురించి అసలు తెలియదు. అంతమాత్రమే కాదు భవిష్యత్తులో నేను హన్మకొండలో స్థిరపడతానని, అప్పుడు నేనసలు ఊహించలేదు. అవకాశం వెంట ఎటు తీసుకుపోతే అటు వెళ్ళిపోయాను.

పదవీవిరమణ అనంతరం రచయిత, డా.ఎసెందర్ (హన్మకొండ లో)
అలా బెల్లంపల్లి (సింగరేణి కాలరీస్) ఏరియా ఆసుపత్రిలో ఆరు నెలలపాటు పని చేయడం, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం రావడం మూలాన అప్పటి వరంగల్ జిల్లాలోని, మహాహబూబాబాద్ తాలూకా (ఇప్పుడు జిల్లా అయింది) ఆసుపత్రిలో వరుసగా పన్నెండు సంవత్సరాలు పని చేయడం, ఆ తర్వాత జనగాం (ఇప్పుడు జిల్లా అయింది) లో పది సంవత్సరాలు పనిచేయడం – పదోన్నతిమీద కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో ఏడు సంవత్సరాలు పనిచేయడం సివిల్ సర్జన్‌గా పదవీ విరమణ చేయడం, హన్మకొండ (రామకృష్ణా కాలనీ)లో స్థిరనివాసం ఏర్పరుచుకోవడం వరుసగా జరిగిపోయాయి. ఇక్కడ స్థిరపడతానని నేను ఊహించలేదు, అనుకోలేదు. కానీ అది జరిగిపోయింది.

విద్యార్థులుగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో ఎసెందర్ మిత్రులతో

వేయి స్తంభాల గుడి (హన్మకొండ) దగ్గర
నాకు హైదరాబాద్ (డాయిన్స్ టౌన్షిప్)లో మంచి ఇల్లు ఉన్నప్పటికీ నేను ఇక్కడ హన్మకొండలో స్థిరపడడానికి ముఖ్య కారణం, నేను పనిచేసిన ప్రదేశాలన్నీ హన్మకొండకు దగ్గరగా ఉండడం వల్ల పరిచయస్థులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతా ఎక్కువమంది ఉండడం మూలాన ఇక్కడే స్థిరపడిపోవడానికి ప్రాధాన్యం ఇచ్చాను.

హన్మకొండలో రచయిత స్వప్న సౌధం (రామకృష్ణ కాలనీ)
అంతమాత్రమే కాదు, సాహిత్యప్రియుడిని కావడం మూలాన, వరంగల్ సాహిత్యరంగంతో నాకు సన్నిహిత సంబంధాలు అధికంగా ఉండడం మూలాన, హన్మకొండను ఆశ్రయించక తప్పలేదు. ఎప్పుడైనా హైదరాబాద్ వెళితే సాధ్యమయినంత త్వరగా హన్మకొండకు తిరిగి వచ్చేయడానికే ప్రయత్నం చేస్తాను. హన్మకొండతో నా అనుబంధం అలాంటిది మరి!
ఒకప్పుడు వరంగల్ జిల్లాలో భాగమైన ‘హన్మకొండ’ ఇప్పుడు జిల్లా స్థాయికి రావడం విశేషం!!
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో చదివి, మరెక్కడో పనిచేసి ఇక్కడ (హన్మకొండ) స్థిరపడడం కూడా విశేషమే కదా!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
33 Comments
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ఇప్పటి వరకూ
నాచేత 90 ఎపిసోడ్ లు రాయించిన
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు. నా రచనావ్యాసంగానికి సంబంధించి ఇదొక రికార్డు.
—–డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ.
26-12-2021
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
అనుకున్నామని జరగవు అన్ని
అనుకోలేదని ఆగవు అన్నీ
.. బాగా చెప్పారు.ఇంత పదిలంగా అలనాటి ఫోటోలు పది లపరుచుకున్నారు.పంచుకుంటు న్నారు మాతో జ్ఞాపకాల పందిరి కింద you are great.
—–వెంపటి.కామేశ్వరరావు
హైదరాబాద్.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ఆద్యంతం… ఆసక్తిదాయకం !
జీవితం… అనుకుంటే జరిగిపోయేది కాదు ! జరుగవలసింది ఆగమన్నా ఆగదు !ఎవరి జీవితాలు ఎలా మొదలవుతాయో… ఎన్నెన్ని మలుపులు ఎలా తిరుగు తాయో…ఏ గమ్యాన్ని చేరుస్తాయో… !అదొక అద్భుతం… !! చాలా బాగుంది.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
కోరాడ వారూ.
Sagar
మనచేతిలో ఏముంది సర్? విధిరాత ఎలా ఉంటే అలా జరగాలి. అంతేకదా? ఎక్కడ దిండి? ఎక్కడ హనుమకొండ? ముఖ్యంగ మీ సాహితీ రంగ ఆసక్తి అక్కడే మిమ్మల్ని కట్టిపడేసింది అని నా అభిప్రాయం. మీకు అభినందనలు సర్ .
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
సాగర్
నీ స్పందన కు
ధన్యవాదాలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Gd Mng doctor garu, Ekkda manaki neellu ప్రాప్తమో adi mana స్థిర నివాసం అవుతుం di.
For me its 3 years in హనుమకొండ.
—–సూర్య నారాయణ రావు
హైదరాబాద్.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Rajendra+Prasad
పుట్టి పెరిగిన ఊరితో ఒక అనుబంధం అయితే, భార్య పిల్లలతో స్థిరపడిన చోటుతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. సాహిత్యంతో మీకు ఉన్న మమకారం, హన్మకొండలో ఇంకా బలపడింది. ఊరిని ప్రేమించి అక్కడే స్థిర పడి శేషజీవితాన్ని ఇష్టంతో గడుపుతూ ఉండటం మీకు దేవుడిచ్చిన భాగ్యం. May God continue to bless you and your family sir. Merry christmas.
– రాజేంద్ర ప్రసాద్
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Thank you somuch
Prasad Farook…..
Rama Reddy Ganta
Read this episode doctor garu. It’s a thrill to follow your life story and know the great person in you.
Rama Reddy Ganta
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Thank you
Somuch sir.
తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి
మీ జ్ఞాపకాల పందిరి నిజంగా అపురూపమైనది సర్. తూర్పు గోదావరి జిల్లా దిండిలో పుట్టి, రాజోలు లో చదివి, హనుమకొండలో స్థిరపడటం నిజంగా విశేషమే. మీరన్నట్టుగా ఎవ్వరు ఎక్కడ పుడుతారో ఎక్కడ పెరుగుతారో ఎక్కడ పోతారో
డా. కె.ఎల్ వి ప్రసాద్
అమ్మా
మీ హృదయపూర్వక స్పందనకు ధన్యవాదాలు
Bhujanga rao
ఈ జీవనయానంలో అనుకున్నవి జరగవు, జరిగేటివి అగవు,ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కాలక్రమేన జరిగే మార్పుల కనుగుణంగా తూర్పుగోదావరి జిల్లా దిండి గ్రామంలో పుట్టి, వైద్యవృత్తి స్వీకరించి డాక్టర్ గా ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలలో పని చేస్తూ చివరికి హనుమకొండలో స్థిరపడటం ఒక అద్భుతం మరియు ఆశ్ఛర్యకరం.మీ శేష జీవితం హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. మంచి విషయాలు అందిస్తున్న మీకు హృదయ పూర్వక నమస్కారములు సర్.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
భుజంగరావు గారు
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
ఎన్.వి.ఎన్.చారి
అవును మనకు ఎక్కడ రుణం ఉంటుందో అక్కడే స్థిరపడుతాం
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యోస్మి
మొహమ్మద్+అఫ్సర+వలీషా
మీ ప్రతి ఙ్ఞాపకం అపురూపం సార్ ఎక్కడ పుడతామో తెలియదు ఎక్కడ పెరుగుతామో తెలియదు ఎక్కడ స్థిర నివాసమేర్పరచు కుంటామో తెలియదు. ఒక చోట స్థిర పడ్డాకా గతం తాలూకు జ్ఞాపకాలు తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ సందర్భంగా మీ మిత్రుని తలుచుకోవటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది సార్. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీ 90 విజయ పతాక ఎపిసోడ్ కు .

ఇలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ 

డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాల.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
జీవిత అనుభవాల సారాన్ని వడ బోసి చాలా సరళంగా చెప్పారు డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారు. భగవంతుడి పట్ల , పూజా విధానాల్లో మన లోవుండే తప్పులను చాలా నిష్కర్షగా ఎత్తి చూపటం అన్నది సరి అయినదే. జీవిత సత్యాలను కళ్ళకు కట్టారుఅనుభవించినప్పటికీ . చావు పుట్టుకలు మధ్య జరిగే ఈ నాటకాన్ని ఎవరు ఎలా పోషినప్పటికీ కూడా అంతిమంగా మిగిలేదేమిటో చాల క్లుప్తంగా చెప్పారు ప్రసాద్ గారు.
తాను పుట్టింది,పెరిగింది,,ఆఖరున ఉద్యోగ రీత్యా స్థిర నివాసం ఏర్పర్చుకున్న ప్రదేశాలు ఒక దానికొకటి బహు దూరం. ఎవేరో కొందరికే తప్ప ఉద్యోగస్థుల్లో అందరికీ కూడా ఇలాంటి చేదు నిజం ఎదురవుతుంది.
నా వరకూ కాలేజి చదువు నుండీ వుద్యోగం , ,వివాహం ,పిల్లలు, ఇల్లు ,పదవీ విరమణ వరకూ నిజామాబాదు లోనే వుండి పోవటం అన్నది నా అదృష్టం అనీ ఇది చదివిన తర్వాత
ఇప్పుడనిపిస్తోంది.
ఆరోగ్య సమస్యల ను అధిగమించి , అన్నయ్య , అక్కయ్య ల ప్రేమ తో జీవితాన్ని ఒడ్డుకు చేర్చిన ప్రసాద్ అదృష్టవంతుడే. తాను భవిష్యత్తులో స్థిర పడ బోయే ప్రదేశాన్నించి ఒక వ్యక్తి DR ఎసెందర్ పేరు తో దేవుడే వచ్చాడనిపిస్తోంది.
మొత్తానికి డిండి నుండీ వచ్చి హనంకొండ లో స్థిరపడటం అన్నది కర్మ సిద్ధాంత మే కాక మరేమిటీ.!!!
-శ్యామ్ కుమార్
నిజామాబాదు
Shyamkumar chagal. నిజామాబాద్

మొత్తానికి డిండి నుండీ వచ్చి హనంకొండ లో స్థిరపడటం అన్నది కర్మ సిద్ధాంత మే కాక మరేమిటీ.!!!జీవిత అనుభవాల సారాన్ని వడ బోసి చాలా సరళంగా చెప్పారు డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారు. భగవంతుడి పట్ల , పూజా విధానాల్లో మన లోవుండే తప్పులను చాలా నిష్కర్షగా ఎత్తి చూపటం అన్నది సరి అయినదే. జీవిత సత్యాలను కళ్ళకు కట్టారుఅనుభవించినప్పటికీ . చావు పుట్టుకలు మధ్య జరిగే ఈ నాటకాన్ని ఎవరు ఎలా పోషినప్పటికీ కూడా అంతిమంగా మిగిలేదేమిటో చాల క్లుప్తంగా చెప్పారు ప్రసాద్ గారు.

నీ సుదీర్ఘ స్పందనకు
హృదయపూర్వక ధన్యవాదాలు
మిత్రమా…..
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మీరు జ్ఞాపకాల పందిరి 90 లో చెప్పనట్టుగా, మనిషి ఎక్కడ పుడతాడో, ఎక్కడ చదువుతాడో, ఉద్యోగం ఎక్కడ చేస్తాడో, పదవీ విరమణ చేసిన తర్వాత ఏ పట్టణంలో స్థిరపడతాడో అని రాశారు. ఔను..అందరి బతుకులు వడ్డించిన విస్తరికాదు కదా..తెలిసిన విషయాలను సరళమైన భాషలో రాయడం మీ నైపుణ్యం…అభినందనలు. నేను వరంగల్ లో పుట్టి పెరిగినా సింగరేణి సంస్థలో సుదీర్ఘంగా 37 సంవత్సరాలు పనిచేసి, పదవీవిరమణ తర్వాత పుట్టిన పట్టణంలో స్థిరపడ్డాను.
——జి.శ్రీనివాసాచారి
కాజీపేట.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ చారిగారు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
హన్మకొండ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Destiny makes us every moment, days, months and years. It will decide whom to meet where to live and where to settle. It is not completely in our hands but being a human being we feel that I have done it.
—Dr.M.Manjula
Hyderabad.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Thank you brother.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Thank you
Madam
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
శత దినోత్సవానికి దగ్గరౌతున్న మీ జ్ఞాపకాల పందిరి లో 90 వ మజిలీలో సేదతీరినాను.( చదివినాను).విశేషాలేవే లేనట్టనిపించినా జీవితసత్యం చెప్పినారుఒకటి.అదే ఎవరి బతుకు ఎట్లా గడవాలో ఏయే మలుపులు తిరుగుతుందో ఎవరికీ తెలువదు అనే విషయం.అదే గదా man proposes God disposes అంటరు .హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుని నోట రచయిత అని పిస్తాడు.ఎవరికి ఏది ప్రాప్తమో అది అవశ్యమనుభోక్తము.రాజే కింకరుడౌతాడు కింకరుడే రాజౌతాడు.కాలానుగుణ్యంబుగాన్ అని .కాలమంటే బోలెడన్ని అర్థాలున్నాయని పిస్తుంది.ఒక కనిపించని శక్తి అందరి తక్దీర్ లను నిర్ణయించి తీర్చి దిద్దేది.కాలం నడిపించినట్టు నడువవలసిందే.ఎదురీదటం కష్టసాధ్యం.
ఇంతకంటె ఎక్కువగా ఏంచెప్పినా అధికప్రసంగమౌతుంది..మీరిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసినట్టవుతుంది.
నమస్సులు
మీ
రామశాస్త్రి
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
శాస్త్రి గారు.