జీవితంలో అనుకోకుండా, పరిస్థితులను బట్టి కొన్ని సంఘటనలు ఎదురై అవి జీవితాంతం మనతో కలసి ప్రయాణించే పరిస్థితులు ఏర్పడతాయి. అవి మంచివి అయినప్పుడు, మన జీవితానికీ, ఆనందమయ జీవన యానానికి, మనకి ఉపయోగపడేవిగా వున్నప్పుడు, అవి మనల్ని గానీ మన జీవితాల నుండి గానీ వేరయ్య ప్రసక్తి ఉండదు. అంటే దానికి అంత శక్తి ఉంటుందన్నమాట! మన సంతోషానికి, చైతన్యానికీ అవి అంత శక్తివంతంగా పనిచేస్తాయన్న మాట!
ఇంతకీ, నేను చెప్పబోతున్నది రేడియో గురించి, నా జీవితంపై రేడియో ప్రభావం గురించి. నా జీవితాన్ని రేడియో అంత ప్రభావితం చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి అవకాశాలను నేను వూహించలేను కూడా! కారణం నా కుటుంబం ఆర్థిక నేపధ్యం. పుట్టినప్పటి నుండి (1953) ఎనిమిదవ తరగతి వరకూ నా జన్మస్థలం లోనే (దిండి – రాజోలు) వున్నాను. అప్పడు రేడియో అనేది నాకు అందని ద్రాక్షపండే! నా మనసులో అది బడాబాబుల విలాస వస్తువు. అందుచేత ఆ వయస్సులో రేడియోని చూడ్డం గానీ, దాని గురించిన ఆలోచన గానీ జరగలేదు. దానికి మించిన ప్రాధాన్యతలు వేరేవి అనేకం ఉండేవి! అందుచేత రేడియో గురించి ప్రత్యేకంగా ఎప్పుడూ ఆలోచించలేదు.
అనారోగ్యం కారణంగా నేను 1964 ప్రాంతంలో నేను అన్నయ్య దగ్గరకు హైదరాబాద్ వెళ్లాను. అన్నయ్య రెండుగడుల ఇంటిలో, చాపల్ బాజార్ దగ్గర కూబ్దీగూడలో ఉండేవాడు. పది పన్నెండు పోర్షన్ల గృహ సముదాయం అది. అంతా ఒకే కుటుంబం మనుష్యుల్లా కలసిమెలసి ఉండేవారు. ఆ ఇంటి యజమానులు కృష్ణయ్య – యాదయ్య అన్నదమ్ములు. వాళ్ళు కూడా స్వంత మనుష్యుల్లా ప్రవర్తించేవారు. ఆ రెండు గదుల పోర్షన్‌కు 40/- అద్దె ఉండేది. ఈ వాతావరణంలో అన్నయ్య మీనన్, ఫిలిప్స్ రేడియో కొని తెచ్చాడు. కరెంట్‌తో పనిచేసేది. అక్కడ నాకు రేడియోతో పరిచయం ఏర్పడింది. రేడియో అంటే ఏమిటో తెలిసింది.
శ్రీ అమీన్ సహానీ
ఉదయం సిలోన్ (రేడియో శ్రీలంక)లో పాత హిందీ పాటలు వినేవాడిని. ప్రతి బుధవారం శ్రీ అమీన్ సహానీ నిర్వహించే ‘బినాకా గీత్మాల’ ‘అసలు మిస్ అయ్యేవాడిని కాదు. అలా రేడియోతో విడరాని బంధం ఏర్పడడంతో, తెలుగు కార్యక్రమాల పట్ల కూడా మక్కువ ఎక్కువైంది. సమయం అంతా ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి ఉండడం వల్ల, ఉదయం భక్తి రంజనితో మొదలై, రాత్రి 9 గంటల ఆంగ్ల వార్తల వరకూ ఇంచుమించు రేడియో పని చేస్తూనే ఉండేది. ఈ విషయంలో మా అన్నయ్య గానీ, వదిన గానీ, నన్ను ఎప్పుడూ నిరుత్సాహ పరచలేదు.
ఢిల్లీ నుండి వెలువడే జాతీయ తెలుగు వార్తలు (ఇప్పుడు హైదరాబాద్ నుండి), హైదరాబాద్ – విజయవాడ నుండి వెలువడే ప్రాంతీయ వార్తలు తప్పక వినేవాడిని. శ్రీ పన్యాల రంగనాథ రావు, శ్రీ తిరుమలశెట్టి శ్రీరాములు, ద్రోణంరాజు వెంకట్రామయ్య, శ్రీమతి జోలిపాళెం మంగమ్మ, మాడపాటి సత్యవతి, ప్రయాగ రామకృష్ణ, కందుకూరి సూర్యనారాయణ, దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్, శ్రీ సురమౌళి, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, శ్రీ రాఘవులు, డి. వెంకట్రామయ్య, ఇలా నేను మరచిపోయిన ఇంకా చాలామంది వార్తలు చదివేవారు. ఆ వార్తలు వినసొంపుగా ఉండేవి. ఉర్దూ వార్తలు చదివిన శ్రీ వసీం అఖ్తర్ వార్తలు చదివే విధానం, తక్షణం ఉర్దూ నేర్చుకోవాలని అనిపించేలా ఉండేది. అంత గొప్పగా చదివేవారు. పద ఉచ్చారణ చాలా స్పష్టంగా, సరళంగా ఉండేది.
శ్రీ పన్యాల రంగనాథ రావు
మధ్యాహ్న కార్యక్రమాలలో ‘కార్మికుల కార్యక్రమం’ తప్పక వినేవాడిని. ప్రతి శుక్రవారం, కార్మికుల కార్యక్రమంలో ‘వినోదాల వీరయ్య’ అనే కార్యక్రమం వచ్చేది. ఇది చాలా వినోద భరితంగా ఉండేది. ప్రయాగ నరసింహ శాస్త్రి గారు అనుకుంటా, వీరయ్యగా బుర్రకథ, హరికథ, పద్ధతిలో కొనసాగేది. తప్పకుండా ఈ కార్యక్రమం కోసం ఎదురు చూసేవిధంగా ఉండేది. అప్పటికి టి.వి. చానళ్ల హడావిడి లేదు.
తరువాత, నేను ఎన్నటికీ మరువరానిది, ‘కాలకన్య’ సీరియల్ నాటకం. శ్రీ నండూరి విఠల్ ఈ నాటకం రాసి, సమర్పించారు. నండూరి విఠల్, శ్రీమతి శారదా శ్రీనివాసన్, హీరో హీరోయిన్లుగా నటించారు. అందులో శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి సంభాషణలు – ఆ స్వరం, ఇప్పటికీ మరచి పోలేను. అలాంటి స్వరం నేను మళ్ళీ ఇప్పటివరకూ వినలేదనే చెప్పాలి, అంత బాగా ఉండేది.
తరువాత ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒక పాత సినిమా వచ్చేది. ఇంచు మించు ఇంట్లో వాళ్ళు అందరు ఆ సమయానికి రేడియో దగ్గరికి చేరేవారు. వాడ్రేవు పురుషోత్తం, ఈ సంక్షిప్త శబ్ద చిత్రం వ్యవహారం చూసేవారు. తరువాత, వార్తావాహిని అనే కార్యక్రమం చాలామందిని ఆకట్టుకునేది. మంచి వ్యాఖ్యాతను ఎన్నుకునేవారు. నాకు గుర్తున్నవారు, పి.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్త్రి, రాఘవులు, మాడపాటి సత్యవతి, ప్రయాగ రామకృష్ణ, తిరుమలశెట్టి శ్రీరాములు, డి. వెంకట్రామయ్య, సురమౌళి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. నాకు గుర్తులేనివారు ఇంకా వుండి వుంటారు.
శ్రీ తిరుమలశెట్టి శ్రీరాములు
తరువాత తప్పకుండా మరచిపోకుండా గుర్తుపెట్టుకోదగ్గ మరో కార్యక్రమం ‘ఈ మాసపు పాట’ ప్రసిద్ధకవుల లలితగీతాలను, మంచి గాయకుల చేత, సమర్థవంతులైన సంగీతకారుల దర్శకత్వంలో, చాలా మంచి లలితగీతాలను వినిపించేవారు. ఇది ప్రతి ఆదివారం, నాలుగు వారాలపాటు ఉండేది.
నాకు గుర్తున్న అలాంటి సంగీత దర్శకుల్లో శ్రీ పాలగుమ్మి విశ్వనాథం, శ్రీ చిత్తరంజన్ ముఖ్యులు. ఎక్కువగా కృష్ణ శాస్త్రి, బోయి భీమన్న, శ్రీశ్రీ, దాశరథి, సి.నా.రె. రాసిన పాటలు ఉండేవి. కార్మికుల కార్యక్రమం (హైదరాబాద్)లో, శ్రీమతి రతన్ ప్రసాద్, ఉషశ్రీ, జీడిగుంట రామచంద్ర మూర్తి, శ్రీ సత్యనారాయణల సంభాషణలు, చాలా వినోద భరితంగా, విజ్ఞాన దాయకంగా ఉండేవి. సాయంత్రాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇద్దరి ప్రముఖుల సంభాషణ (కబుర్లు) చాలా విజ్ఞాన దాయకంగా ఉండేది. ప్రారంభంలో “నమస్కారం పంతులు గారూ..” అంటే, ఇంకొకాయన – “రా.. ఎల్లయ్యా.. రా.. ” అన్న మాటలతో ఆ సంభాషణలు వినసొంపుగా, గ్రామీణ వ్యవసాయదారులకు అర్ధమయ్యే భాషలో/యాసలో ఇది కొనసాగేది!
ఇంకా సినీమా పాటలతో రూపకాలు, సాహిత్య కార్యక్రమాలు, కవి పరిచయాలు ఉండేవి. ఇటువంటి కార్యక్రమాలు శ్రీ రావూరి భరద్వాజ తదితరులు నిర్వహిస్తూ వుండేవారు. ఉగాదికి తప్పక కవి సమ్మేళనం ఉండేది. ఇందులో మహామహులంతా పాల్గొనేవారు. నేను మాత్రం శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె, బోయి భీమన్న, కుందుర్తి ఆంజనేయులు, కరుణశ్రీ, దాశరథి వంటి కవుల కోసం ఎదురుచూసేవాడిని. ఒక ఉగాదికి విశ్వనాథ వారు అధ్యక్షత వహించిన కవి సమ్మేళనం వినే అవకాశం నాకు కలిగింది.
ట్రాన్సిస్టర్ రేడియో నా చేతికి రావడానికి చాలా కాలమే పట్టింది.
ఇక అసలు విషయానికొస్తే -నా రేడియో కార్యక్రమాల ఆరంగేట్రం 1975లో జరిగింది. ఆ సంవత్సరం హైద్రాబాద్ చింతలబస్తీలో కొత్తగా పెట్టిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, బి.ఎస్.సి (బి.జెడ్.సి గ్రూపు) మొదటి సంవత్సరంలో చేరాను. మాసాబ్ ట్యాంక్ నుండి నడిచి వెళ్ళేవాడిని. అన్నయ్య మీనన్ అప్పుడు శ్రీ రామచందర్ రాజు గారి ఇంట్లో అద్దెకు ఉండేవాడు.
శ్రీ సత్యవోలు సుందరసాయి
అలా కళాశాలలో నాకు, శ్రీ సుందరసాయి, కృష్ణమోహన్, మురళి, తదితరులు మంచి స్నేహితులైనారు. అందులో శ్రీ సత్యవోలు సుందరసాయి, బహుశా నేనుకూడా తూర్పుగోదావరి జిల్లావాడినని కాబోలు నాతో కాస్త ఎక్కువగా స్నేహంగా ఉండేవారు. పైగా, ఆయన విజయనగర్ కాలనీలో ఉండడం వల్ల, ఇద్దరం చాలా సార్లు కాలేజీకి కలసివెళ్లడం, కలసి రావడం జరిగేది. నేను వాళ్ళ ఇంటికి వెళ్లడం, ఆయన మా ఇంటికి రావడం జరుగుతుండేది. అలా మా స్నేహం బాగా బలపడిందని చెప్పాలి. సుందరసాయి గారికి బావగారి వరస శ్రీ జీడిగుంట రామ చంద్రమూర్తి గారు. అప్పటికే ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రంలో మంచి రచయితగా, ముఖ్యమైన వ్యక్తిగా బాగా పేరు తెచ్చుకున్నారు. అలా సుందరసాయి ఆకాశవాణి యువవాణి కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అలా నన్ను కూడా సాయి రేడియోకి పరిచయం చేసాడు. ఆయనతో పాటు నేను కూడా యువవాణి కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాడిని. మేము రేడియో నాటికల్లో (యువవాణి) తరచుగా పాల్గొనేవాళ్ళం. అప్పుడు యువవాణి కార్యక్రమాలను శ్రీమతి దుర్గాభాస్కర్ గారు చూసేవారు. ప్రయాగ వేదవతి గారు కూడా తర్వాత యువవాణిని నిర్వహించేవారు. ఈ నేపథ్యంలోనే నాకు శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి, పాలకుర్తి మధుసూదనరావు గారు, రాఘవులు గారు, భీమయ్యగారు, మంత్రవాది సుధాకర్ గారు పరిచయం అయ్యారు. ఇలా నా బి.డి.ఎస్. అయ్యేవరకూ ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రంతో అవినాభావ సంబంధం ఉండేది. తర్వాత ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఏర్పడడం, నేను వరంగల్‌లో స్థిరపడడం జరిగింది. ఈ నా రేడియో కార్యక్రమాలు నిరాటంకంగా 1975 నుండి 2013 వరకూ కొనసాగాయి.
అనేక కారణాలవల్ల, అవకాశాలవల్ల నాకు, ఆకాశవాణి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కొత్తగూడెం, వరంగల్ కేంద్రాలలో నా కార్యక్రమాలు ప్రసారం అయ్యే అవకాశం కలిగింది. అలాగే కొంత మంది మిత్రులను ఆకాశవాణికి పరిచయంచేసే అవకాశం నాకు కలిగింది. హైద్రాబాద్‌లో దూరదర్శన్ వచ్చాక, నాకు మొదట టి.వి.లో కార్యక్రమం ఇప్పించిన ఘనత కూడా మిత్రులు సత్యవోలు సుందరసాయిదే!
ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, నా చిన్నన్నయ్య (డా. మధుసూదన్ కానేటి) ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో అనౌన్సర్గా పదవీవిరమణ చేయడం, నా కూతురు, నిహార కానేటి ఇప్పుడు ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తుండడం రేడియో పట్ల నాకున్న మక్కువకు పరాకాష్ట.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
సంచిక సంపాదక వర్గానికీ ఇతర సాంకేతిక నిపుణులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
మంచి కథనం..అలవరసలపై ప్రసంగం విన్నంత హాయిగా ఉంది
ధన్యవాదాలండీ
Baagundi sir mee radio visheshalu. Radio 1969 lo maa naannagaru konnaru. Meeru cheppina perlu anni gurthuku vachayi sir. It is a great memory 👍
——కె.జె.శ్రీనివాస్ హైదారాబాద్.
ఆకాశవాణి ఒకనాటి ప్రసార జ్ఞాని అలనాటి జ్ఞాపకాల వృష్టిలో తడిపి ముద్దచేసారు.నిజమే భావప్రసారసాధనంగా ప్రజలమన్నన పొందింది సాంకేతిక పురోగతి ఆధునిక వైజ్ఞానిక ప్రగతి ఎన్నింటినో అవుట్ డేటెడ్ చేసింది అయినా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉఃది కాకపోతే down sizing నాన్ రిక్రూట్ మెంట్ వల్ల మూలన పడేసిన పచవస్తువులా తయారవుతున్నది దాని ఉనికినీ ఘనైరిత్రను కాపాడవలసిన బాధ్యత మన అభిమానుదే ధన్యవాదాలు
చారి గారూ ధన్యవాదాలు .
రేడియోతో మీ అనుబంధం .. 1976లో వరంగల్ కు మా నాన్నతో వెళ్లి రేడియో కొనుక్కొచ్చిన ఆనందం నుంచి మీరుకోరిన పాటల కార్యక్రమానికి ఉత్తరాలు రాయడం.. మీనాక్షిపొన్నూదురై అనౌన్సర్ ఆధ్వర్యంలో సీలోనేలో సినిమా పాటలు వినడం.. కార్మికులకార్యక్రమం.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సినిమా.. నేటికి నేను రేడియో వినడం.. ఈ గొప్ప అనుభూతులను మళ్ళీ మీరు కలిగించారు.. ____వేంకట్రామ నర్సయ్య మహబూబాబాద్.
నిను వీడని నీడనునేనే లాగ మిమ్మల్ని మీ కుమార్తె రూపంలో మరలా గుర్తుచేసుకుంటూనే ఉంది సర్ రేడియో. మీకు అభినందనలు.
సాగర్ థాంక్ష్.
ఈ సంచికలో అమూల్యమైన సంగతులు గుర్తుకు తెచ్చుకుని మాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు సర్ శారదా శ్రీనివాసన్ టాప్ హీరోయిన్ 👌🙏🏻 ________భూమెశ్వర్ ఆకాశవాణి నిజామాబాద్.
Gd Mng doctor garu, I also had the opportunity to give a talk on AIR Warangal Stn. about the procedure for availing housing loans & education loans from banks. You have given me this opportunity through your AIR friend (Reddy garu) during my stay at Hanamkonda. That shows your connection with AIR & its personnel. 🙏
_______సూర్య నారాయణ రావు హైదారాబాద్.
Thank you Rao garu.
నాకు కూడ రేడియోతో మంచి అనుబంధం ఉన్నా పేర్లు దగ్గర నించి చెప్పగలగే జ్ఞాపక శక్తి నాకులెదు. అందుకు మీకు అభినందనలు . రేడియో టీవీకార్యక్రమాలలో మీరు పాల్గొన్న విషయం నాకు ఇప్పుడే తెలసింది సుమా.
సరసి గారూ ధన్యవాదాలు.
చాలా బాగుంది. నేను మరచి పోయిన యెన్నో విషయాలు మళ్ళీమళ్ళీ గుర్తు కు వచ్చాయి. అసలు అన్ని పేర్లు ఎలా వ్రాస్తారు. Ushasri ను marchipoyaru. అన్నీ మనకు తీపి జ్ఞాపకాలు. భలే చెప్పారు. , ,కళ్లకు కట్టినట్లు.
శ్యాం మీ స్పందన కు ధన్యవాదాలండీ .
కొసమెరుపు లో నిహార గారు వరంగల్ వచ్చాక స్వీయ నియంత్రణగా మీరు కార్యక్రమాలలో పాల్గొనడం లేదని మెన్షన్ చేస్తే బాగుండేది.
——- అనీల్ ప్రసాద్ ఆకాశవాణి వరంగల్లు
ధన్యవాదాలండీ మీ సూచన సబబే.
అసలు అన్నీ విషయాలు పేర్లు ఎలా గుర్తు పెట్టుకున్నారు. డైరీ లో నా??
జ్నాపకం వున్నాయ్
మీ రేడియో కథనం బాగుంది. నేను చిన్నప్పుడు విన్న పేర్లు మళ్లీ విన్నాను. శ్రీ వాడ్రేవు పురుషోత్తం గారు నా భార్య కి పెద్ద నాన్నగారు, వారి శ్రీమతి నా అత్తగారు అన్న తమ్ముల పిల్లలు. కాక వారు యల్ బి నగర్ లో ఉంటారు కనుక . మాకు వాళ్ళకి రాకపోకలు ఎక్కువే. పురుషోత్తం గారు కాలం చేసి ముప్పై సంవత్సరాలు అయింది ఏమో. వారి అబ్బాయిలు శ్రీ .వాడ్రేవు జోగా రావు, శ్రీ. అప్పారావు , తరుచూ కలుస్తుంటాను. శ్రీ అమీన్ సాయని గారి చిత్రం నాకు బినాక గీత్ మల , గుర్తు చేసింది. నాకు క్రికెట్ పట్ల అమితమైన మక్కువ. రేడియోలో క్రికెట్ కామెంటరీ వెనేవడిని. నేను తోమిది పదవ తరగతి లో tv వచ్చినా BBC లో టెస్ట్ మాచ్ స్పెషల్ అని వచ్చేది సర్ . ఆ ప్రోగ్రాం 92 వరకు వినేవాడిని. తరువాత కేబుల్ tv వచ్చాక, మానేశాను
_______డా.డి.సత్యనారాయణ హైదారాబాద్.
చాలా మంచి అనుభవాలను మాతో పంచుకున్నారు.మీ జ్ఞాపకాల ద్వారా ఎన్ని విషయాలు తెలవడమే కాదూ.. మా లాంటి వారిని కూడా రేడియో వైపు తీసుకెళ్లారు.నేను వ్రాసిన రెండు వ్యాసాలు విశాఖపట్నం స్టేషన్ ద్వారా ప్రసారం అవడం జరిగింది.మీ ప్రోత్సా హం ఎప్పటికీ మరువలేనిది.మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్.మా నాన్న గారు కూడా రేడియోకు వీర అభిమాని అని ఈ సందర్భంలో తెలియచేయడం నాకెంతో సంతోషంగా ఉంది.మీ అమ్మాయి కూడా ఆకాశవాణి ఉద్యోగష్టురాలు కావడం విశేషం.వారికి మీకు అభినందనలు💐
అమ్మా.. మీ స్పందన కు ధన్యవాదాలండీ .
Gkp 28 chala bagundi with this I remembered the old memories with radio we used to hear cricket commentary more very nice
Dr.TVlu Kazipet
ధన్యవాదాలండీ.
Prasad Garu! Naa chinna thanamlo maa intlo Electricity ledu.. Anduke battery paina Nadiche oka Philips Transistor Radio vundedi.. Meeru nammutharo ledo , maa veedhilo vaallantha theerika samayallo maa intlone vundevaarandi .. Aa rojulu gurthochhaayi.. Thanks for sharing your Jnaapakam, with me.. 🙏🙏🙏
రావు గారూ సంతోషం. మీ స్పందన కు ధన్యవాదాలండీ .
రేడియో తో మీ అనుబంధం గాఢమైనది. పాత తరం రేడియో కళాకారుల ను స్మరించుకునే అవకాశం కలిగింది. ఆకాశవాణి వరంగల్లు కేంద్రం కళాకారులకు హైదరాబాద్ కేంద్రం ఇచ్చే హానరోరియంతో సమానంగా ఇచ్చేలా మీరు చేసిన కృషి గొప్పది. ఆకాశవాణి వరంగల్లు కేంద్రానికి రాపూరి వెంకటేశ్వర్లు గారు డైరెక్టర్ గా పని చేసిన కాలం ఒక సువర్ణాధ్యాయం.
అవునండీ మీ స్పందన కు ధన్యవాదాలండీ .
మొదటగా మిమ్ములను అభినందించ వలసినకారణం ,నాటి ఆకాశవాణి కళాకారులను వారికార్యక్రమాలను వివరించి నేటితరంవారికి పరిచయం చేసినందుకు.మీరు కళాకారునిగా మీ అమ్మాయి ఉద్యోగినిగా ఆకాశ వాణి సేవలు చేస్తున్నందుకు బాగుంది .ధన్యవాదాలు
______వజ్జల రంగాచార్య హనంకొండ.
మీ స్పందనకు ధన్యవాదాలు సర్ .
ముందుగా రేడియో తో మీ 38 సంవత్సరాల (1975-2013) అనుబంధం,మీరు రేడియో లో విన్నా కార్యక్రమాలు,మరియు అందులోని వ్యక్తులందరి పేర్లు ఇప్పటికీ గుర్తుపెట్టుకోవడం చాలా గ్రేట్ సర్.
రేడియో తో మీ 38 సంవత్సరాల (1975-2013) అనుబంధం,మీరు రేడియో లో విన్నా కార్యక్రమాలు,మరియు అందులోని వ్యక్తులందరి పేర్లు ఇప్పటికీ గుర్తుపెట్టుకోవడం చాలా గ్రేట్ సర్. మీరు అన్ని సంవత్సరాలు పాటు రేడియో లో వివిధ కార్యక్రమాలలో పాల్గోనడం,మీ అన్నయ్య గారు విశాఖ రేడియోలో అనౌన్సర్గా పనిచేసి,పదవీవిరమణ చేయడం, ఇప్పుడు మీ అమ్మాయి గారు వరంగల్ రేడియో లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ ఉండటం మీ కుటుంబ సభ్యులకు రేడియో కు ఉన్న అనుబంధం ఎంత గొప్పదో అర్థం అవుతోంది సర్….ఇప్పటికీ మీరు రేడియో పట్ల చూపిస్తున్నా ఆసక్తి చాలా గొప్ప విషయం సార్.
భాషా ధన్యవాదాలు.
Jane Bhasha Thank you.
[18/10, 13:44] Ch sangeetha: రేడియో గురించి బాగుంది సార్ జ్ఞాపకాలు
_____సి.హెచ్.సంగీత జగిత్యాల.
తియ్యని అనుభూతులపంపకంలో మికు మీరే సాటి. తవ్వినక్రొద్ది gnapakala ganuku bayataku vastune untai. D.Chandra sekhar N G O colony , Vanastalipuram Hyderabad.
జొగం నీ స్పందన కు ధన్యవాదాలు.
రేడియో గురించి మీ అనుభవాలు అధ్భుతం. రేడియో గురించి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. రేడియోలో గాయకుడు లలిత గీతాలు పాడుతుంటే నేను ఆ లిరిక్స్ రాసేవాడిని. బీనాకా గీత్ మాలా లాంటి కార్యక్రమాలను మరియు మిగతా కార్యక్రమాలను ఫోటోలతో సహా తెలిపారు. ధన్యవాదాలు.
______శ్రీనివాసాచారి.జి కాజీపేట.
సర్! ఈ సారి ప్రత్యేకత ఏమై ఉంటుంది అంటే, మీ జ్ఞాపకాల పందిరి, 1945 -1965 మధ్య పుట్టిన చాలామందికి కూడా వర్తిస్తుంది. ( రేడియో కార్యక్రమాల participation తప్పిస్తే) కళ్ళకు కట్టినట్టు చాలా చక్కగా వర్ణించారు. ధన్యవాదాలు – రాజేంద్ర ప్రసాద్
ప్రసాద్ గారూ మీ స్పందన కు ధన్యవాదాలండీ .
శీర్షిక చదవగానే విషయం అర్థమైపోతూంది .. ఎంతో ఘనిష్ఠమైన అనుబంధం ఉంటే తప్ప నేను ~ రేడియో అనం … మన తో పూర్తిగ ముడిపడి ఉన్న విషయమైతేనే మనం ఇలా చెప్పుకుంటుంటాం !!! మొదటి పరిచయంనుంచి నేటివరకూ మీకున్న అనుబంధం మీ సోదరులు , అమ్మాయిల ఆకాశవాణి ఉద్యోగాలతో మరింత గట్టిపడి శీర్షిక సార్థకమైంది … సాధారణంగా మన జీవనక్రమం లో తటస్థపడే కొన్ని కొన్ని అంశాలు మన జీవితంలోనే విశేషభాగాలై నిలబడిపోతాయి .. అటువంటి వాటిలో మీకు ఆకాశవాణి ఒకటి కావటం ఒకరకంగా ఎల్లకాలం తలచుకునే విషయంగా స్థిరపడ్డది .. మీరు చెప్పినట్టు ఒక రోజుల్లో ఇతర ప్రసారమాధ్యమాలు అందుబాటు లేని కాలంలో రేడియో కేవలం కాలక్షేపంగానే కాకుండా విషయగ్రహణ సాధనకు కూడా ముఖ్యమైన వస్తువు … ఆ తరానికి చెందిన మనవంటివాళ్ళకే ఈ అనుభవాలుంటాయి .. కమ్మని కంఠం తో , స్పష్టమైన ఉచ్చారణ తో వార్తలు చదివేవాళ్ళూ , తమ సంభాషణాచాతుర్యంతో అలరించే శారదాశ్రీనివాసన్ వంటి ప్రతిభావంతులైన నటులతో నాటకాలు వివిధ విశేషాలతో ఉండే కార్మికుల కార్యక్రమాలు , సిలోన్ లో తెలుగు వార్తలు , బినాకాగీత్ వంటి గొప్పగొప్ప కార్యక్రమాలను స్మరించుకున్నప్పుడంతా మంచి అనుభూతులు ముసురుకుంటాయి … ఇవ్వాళ మీ కథనం మరోసారి ఆ మంచి రోజుల్ని గుర్తుచేసింది … దరిద్రపు గొట్టు సీరియళ్ళు , ఆడ విలన్లు , పనికిరాని ఊకదంపుడు వార్తలు , అటు తెలుగును ఇటు ఇంగ్లీషును ఖూనీ చేస్తున్న ఆంకరమ్మలు … ఇలా మాధ్యమాలన్నీ మనుషుషులను కాల్చుకుతింటున్న ఈ భయంకరపు రోజుల్లో వీలైనన్ని ఫోటోలు , పేర్లతో సుసంపన్నమైన మీ జ్ఞాపకాల పందిరి చల్లని నీడనిచ్చింది … ధన్యవాదాలు సర్ !! ( చిన్న సవరణ అనుకుంటాను ద్రోణంరాజు వెంకటరామయ్య కాకపోవచ్చు ఆయన దివి వెంకటరామయ్య కావచ్చు , మీరు సూచించిన డి.వెంకటరామయ్య ఆయనే నేమో !! ద్రోణంరాజు సత్యనారాయణ అని జ్ఞాపకం )
ధన్యవాదాలండీ గురువుగారు
అలవరసలపై మంచి ప్రసంగం విన్నంత హాయిగా ఉంది 🙏
____సి.ఎస్.రాంబాబు హైదారాబాద్.
ధన్యవాదాలండీ మిత్రమా.
Very Excellent Gnapakam Drklv. Its really Great your memory power from 1975 to 2020 nearly 45 years old history with all their names, you have mentioned programmes also n their talents with voice modulation everything you have remembered. Hats off….. to Your Brain. Any hw its seems to be from childhood to till now you are Eating, Drinking n Sleeping with Radio . Finally you have rooted strong pillar in the Radio by your Daughter for next Generation. So now you’re more n most happiest person to fulfill your Desire regarding Radio. Hearty 🎊 Congratulations Dr. KLV. You are Great.
Thank you Brother Rao.
మీ రేడియో ప్రయాణం బాగుంది సార్ మీ అమ్మాయి రేడియో కేంద్రంలో ఉంది కాబట్టి మీకు మంచి అవకాశం. అభినందనలు🌹 ఇప్పటికి వీలయింది మీ రచన చదవటానికి.
______రాయవరపు సరస్వతి. విశాఖపట్నం.
థాంక్యూ. నేను నీ పోస్టింగ్స్ చూసి, తప్పక నా అభిప్రాయం చెబుతా. నీ AIR జ్ఞాపకాలు నాకూ చాలా తియ్యగా అనిపించాయి. ఒక్కొక్కసారి మనం అక్కరలేని విజ్ఞానబాధితులం అనుకుంటా. _____జి.బి.శర్మ విశాఖ పట్నం.
మిత్రమా నీ స్పందన కు ధన్యవాదాలు.
ఎంత గొప్ప అనుభవాన్ని పంచుకున్నారు సర్.రేడియో ఏంత అద్భుత మాధ్యమమో…మరెందరి ప్రియ నేస్తమో….ఇప్పుడు ఎన్ని దృశ్య మాధ్యమాలు వచ్చినా …మనుష్యులు కనిపించకుండానే అద్భుతమైన భావనల్ని పలికించి పులకరింప చేయడం ఇప్పటికీ ,ఎప్పటికీ గొప్ప విశేషమే.కార్యక్రమాలల్లోని ఉద్దాత్తత, నాణ్యతా ఆకాశవాణిలో ఇప్పటికీ తగ్గలేదు. గొప్ప సాంస్కృతిక వైనం రేడియో.మీ తరంలానే మా తరాన్ని కూడా వైజ్ఞానికంగా ఎంతో ఉత్తేజ పరిచింది.మీరు వివరించిన కార్యక్రమాలూ,స్మరించిన రేడియో వక్తలూ మరో సారి హృదయాల్లో ఆవిష్కృతమయ్యారు.మీ గొప్ప జ్ఞాపక శక్తికి నమస్సులు.రేడియో ను మీ జీవితములో ఎంత ప్రాధాన్యత కలిగి ఉందొ మీ వారసురాలు ఆ రంగంలో కొనసాగుతుండడంతో తెలుస్తుంది.ఇది ఒక జ్ఞాపకంగా కాక మీ కుటుంబం రేడియో నేపధ్యంగా సమాజానికి చేసిన ఒక సుకృత్యంలా అనిపిస్తున్నది.నా లాంటి రేడియోను ఆత్మ బంధువుగా భావించే వారికి మరీ మరీ చదువుకోవాలనిపించే చాలా మంచి జ్ఞాపకాన్ని పంచుకున్నారు సర్.రేడియో కు మీరు,మీ అన్నగారూ పరిచయం చేసిన వారిలో నేనూ ఉండడం నా అదృష్టం. నా చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన మీకు ధన్యవాదాలు తెలపడం ఈ సందర్భంగా అప్రస్తుత ప్రసంగం కాదనే భావిస్తున్నాను.ధన్యవాదాలు సర్🙏💐
______నాగ జ్యొతి శేఖర్ కాకినాడ.
అమ్మా చాలా బాగా రాసారు. మీ స్పందన కు ధన్యవాదాలమ్మా.
రేడియో గురించి మీ కున్న అనుబంధం చాలా చాలా చక్కగా మీరు వివరించారు. నాకూ నా చిన్నతనం గుర్తు చేసింది. ముక్యంగా, బినాకా గీమాల కోసం చాలా చాలా ఎదురు చూసేవాడిని. ఆ ట్యూన్ వస్తూoదంటే ఒక విధమైనా పులకరం. మా నాన్న BDO గా వున్నా, Radio కొనుక్కోని తానే స్వయంగా మోసుకొని వచ్చిన విధం (బంట్రోతుకు ఇవ్వకుండా) నాకూ చాలా గుర్తు. మనుషులు కనబడకుండా ఎలా మాటలు వింటున్నది చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. మమేకం చూస్తూ వుండి పోయేవాడిని. మీరు చక్కగా అందరిని గుర్తుచేశారు. నేను కృష్ణ శాస్త్రి గారి లలిత సంగీత పాటలు Radio లో వింటూ నేర్చుకున్నా. హోంగే కామ్ యాబ అనే పాట Radio నుంచే నేర్చుకున్న. చాలా చాలా బాగా వ్రాసి చిన్న తనం గుర్తు చేశారు. ధన్యవాదాలు. 🙏
____ప్రొ.రవికుమార్.పి. కాజీపేట.
మీ స్పందనకు ధన్యవాదాలు తమ్ముడూ…
మీ రేడియో అనుభవాలతో ఈసారి మీ ఙాపకాలపందిరి బాగుంది సార్. నాకూ చాలా ఇష్టమైన ప్రసారమాధ్యమం రేడియోనే. ఉదయం వందేమాతరం రోజూ రేడయో పెట్టి వినడం మా అమ్మకు చాలా ఇష్టం. నేను కూడా రోజూ అదే కొసాగిస్తున్నాను.ఉదయం 6 నుండి రాత్రి 11దాకా వీలైనపుడల్లా రేడియో వినడం నాకిష్టమైన అభిరుచి.వరంగల్ రేడియో కేంద్రం ప్రారంభంలో ఒక సంవత్సరం (శ్రీరంగస్వామి అన్నయ్య ప్రోత్సాహంతో) పని చేయడం నా అదృష్టం. ఈ సందర్భంగా ఎంతోమంది పరిచయం కావడం నా భాగ్యం.మీరా ఙాపకాలలోకి తీసుకెళ్ళినందుకు ధన్యవాదాలు. మీరు కామేశ్వరి అక్కయ్య బాలానందం ప్రతీ ఆదివారం రారండోయ్ బాలబాలికలు రారండోయ్ బాలానందం వినరండోయ్ అంటూ మధురంగా వచ్చేది మర్చిపోయారు కదా!మేమూ కుటుంబమంతా రేడియో చుట్టూ చేరి చాలా కార్యక్రమాలు వింటూ ఆనందించేవారం. మరోసారి ధన్యవాదాలతో సోదరి విద్యాదేవి. 🙏👌✊👏🙏
అమ్మా మీ స్పందన కు ధన్యవాదాలు.
జ్ఞాపకాల పందిరి-28 http://100.26.73.229/gnapakala-pandiri-28/ Radio gurinchi vivarinchi maaku paatha jnapakaalu gurthu chesaaru. Afternoon 3 ki Meenakshi ponnudorai voice baaga eshtapadevaallam. Sunday movie sanshiptha sabha chitram, chitra Lahari, farmer kaburlu, Baalanandam chala chala eshtam ga chuse vine vaallam. Piga maa entlo T.V laaga oka pedda Radio undedi😃. Mee aricle avanni gurthu chesinanduku Thank you
____mrs.padma.ponnada Narasapur
దైనందిన కార్యక్రమాలను క్రమబద్ధీకరిస్తూ..సరైన సమయంలో జరిగేలా రేడియో కార్యక్రమాలు ఉండేవి.ముఖ్యంగా పాఠశాల విషయంలో అవే సమయ సూచి.సుంకం చెల్లిస్తూ ఉన్న కాలం నుండి మా ఇంట్లో రేడియో పలికింది.మానాన్న మా ఊరినుండి 60 కి.మీ పైగా సైకిల్ పై వరంగల్ వచ్చి లైసెన్స్ పునరుద్దరణ చేయించేవాడు.చాలా అనుబంధాల్ని గుర్తు చేసారు..!
_____డా.మల్లికార్జున్ హనంకొండ.
The divtion and voice of all the announcers and anchor in those very wonderful and impressive to hear. We used hear Telugu songs daily at 4.30pm in radio sri lanka. You have almost mentioned about all famous personalities of that era we used to attend readio classes during our high school dsys
రేడియో వినడం మొదలుపెట్టి programmes ఇవ్వడం తర్వాత programmes తయారు చేసే వాళ్ళను తయారుచేసే వరకు సాగిన మీ పయనం చాల బాగుంది సార్ congratulations 🌺💐🌸
_______శ్రీహరి.కె హనంకొండ
రేడియోతో మీ అనుబంధాన్ని అద్భుతంగా వివరించారు👌👌.. Amazing write up giving all details and pics of radio participants of those days taking all readers into nostalgic memories💐💐
ధన్యవాదాలండీ ఝాన్సీ గారూ….
సర్ మీ రేడియో అనుభవాలు చదువుతుంటే.. నా చిన్నప్పుడు రేడియోలో వివిధ భారతి లో పాటలకోసం … ఆదివారం సినిమా కోసం ఎదురు చూసిన సందర్భాలు గుర్తుకు వచ్చాయి… మీ జ్ఞాపక శక్తి కి జోహార్లు సర్ 🙏
______kalasvathi.k Hyderabad
Thank Amma.
I have read the story of how you got an opportunity to work with radio, and people who helped you for that. I can correlate with how I got an opportunity to work in government hospital just because of you sir for which Iam ever grateful to you sir and one’s support can help us to establish a path or pursue our dreams in life. Thank you sir.
_____Dr.Harika. Karimnagar.
Thank you Dr.Harika.
ఆనాటి ఆకాశవాణి కార్యక్రమాలను కళ్ళముందుంచారు…. బాగుందండీ….!
_____ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ హైదారాబాద్.
మీ రేడియో అనుెభవాలు చాలా బాగున్నవి.ఆరొజుల్లొ రేడియో ఇంట్లొ ఉంటే అదొక status symbol గా భావించే వాళ్ళంగదా. హనుమ కొండలొ పబ్లిక్ గార్డెన్ లొ రేడియో కార్యక్రమాలు విని 9 గంటలకు న్యూస్ మొదలువకాంగనే వెళ్ళి పొయే ది.బనాకా గీత్ మాలా ఇంకా తబస్సుమ్ కే లతీఫే కూడా వినేది మొత్తం మీద మీ రేడియో అనుభవాలు ఆనాటి సమకాలికులకు తమతమ అనుభవాలుఙనే అన్పించి మమేకం ఔతారు — —-రామశాస్త్రి
శాస్త్రి గారు ధన్యవాదాలు సర్.
సార్ మీ రేడియో జ్ఞాపకంతో మమ్మల్ని అందరినీ గొప్ప అనుభూతికి లోనుచేశారు.నిజంగా టీవీ , ఫోన్ రాక ముందు అప్పట్లో అందరికీ రేడియో ఒక అపురూపం. మీరు రేడియో అనగానే చదువుతున్న మా అందరికీ దానితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చారు.రేడియో అంటే నాకూ ఒక ప్రత్యేక అనుబంధం .ఎందుకంటే నేను పుట్టగానే మా నాన్న గారు ఫ్రెండ్స్ బలవంతంతో సరదాగా నాపేరు మీద టికెట్ తీసుకుంటే రేడియో వచ్చిందని చాలా సంతోష పడ్డారు. ఇంట్లో అమ్మా నాన్నా ల ఆరాధ్యం రేడియో అలా మాక్కూడా అలవాటయ్యింది. ఎక్కువ గా నేను పాటలే చాలా చాలా ఇష్టంగా వినేదాన్ని.మళ్ళీ ఆ అపురూపాన్ని , దానితో మీ అనుబంధాన్ని అందులోని సభ్యులను అప్పటి వారందరినీ పేరు పేరు తో గుర్తు పెట్టుకుని స్మరించడం మీ జ్ఞాపక శక్తి కి జోహార్లు సార్. మీ జ్ఞాపకాల జ్ఞాపకాల పందిరిలో దాగిన అపారమైన పుటలను మాముందు తెరచి మాకు మళ్ళీ పాత మధురాలను గుర్తు చేస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలుకృతజ్ఞతలు సార్. మీకే రంగం ఇష్టమో అదే రేడియో స్టేషన్ లో మీ అన్నయ్య గారు మీపాప నీహార గారు పయనించడం చాలా చాలా సంతోష దాయకం సార్ .మనసు పొరల్లో దాగున్న మధురమైన స్మృతులను మీ జ్ఞాపకాల పందిరితో ఉత్తేజితుల్ని చేస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
అమ్మా ధన్యవాదాలు.
డాక్టర్ గారు..
అప్పటి కాల పరిస్థితులు, రేడియో ప్రసారాలు తెలియని వారికి ఇది మంచి కథనం.. నాకు చాలా తక్కువ అనుభవం రేడియోతో.. చాలా బాగా వివరించారు… మా ఇంట్లో రేడియో గుర్తు వచ్చేలా చేశారు..
ధన్యవాదాలు
చిన్నక్క ఏకాంబరం గా నేను rv ramana(old dcb bank). Lions club lo. Matladukunde vallam
_____డా.అంజనీ దేవి హనంకొండ
Such a remarkable article presentation..as I too gone through plenty of experiences..speech less.Thanking is less for this article..greatful is the right word. Fabulous
Dr.Jhansi Nirmala Sakhineti palling.
అమ్మా మీ స్పందన కు ధన్యవాదాలండీ .
సార్ నమస్తే!మీ జ్ఞాపకాల పందిరి చదివాను.చాలా బాగుంది.అది చదువుతుంటే రేడియోతో నాకున్న అనుబంధం,పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి.ఈ రేడియో విషయంలో దాదాపు నేనూ మీలాగే!చక్కగా రాశారు. అభినందనలు మీకు.
____బొందల నాగేశ్వర రావు చెన్నై.
Everyone will not have interest. Those who are interested only will be attracted and also it requires art. Because you had both you started and continuing with your daughter. But I admire your remembering capacity including the names.
——Dr.M.Manjula Hyderabad.
Thank you Dr.garu.
బాగుంది సార్
You must be logged in to post a comment.
నూతన పదసంచిక-111
అలనాటి అపురూపాలు- 182
35. సంభాషణం – శ్రీమతి పుట్టి నాగలక్ష్మి అంతరంగ ఆవిష్కరణ
గోవిందుడా మా గోవిందుడా
క్రమం..
జాతీయవాద ఉద్యమకారుడీ యోగి – ‘రుద్రరాగాలు’ పుస్తకానికి శ్రీ గోరటి వెంకన్న ముందుమాట
గోలి మధు మినీ కవితలు-37
పిచ్చుకల్ని ప్రేమించండి
తెలుగుజాతికి ‘భూషణాలు’-36
అమ్మ కడుపు చల్లగా-31
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®