సంచికలో తాజాగా

Related Articles

22 Comments

  1. 1

    Rajendra Prasad

    Your points are practical and solution to such challenges are appreciable. Well discussed sir

  2. 2

    సుగుణ అల్లాణి

    సర్ నిజం మీరు చెప్పింది… నేను తెలుగు చెపుతున్న సమయం లో… పోతన భాగవతం లోని అంశాలు చెపుతుంటే ఆ పాఠం చదవను పరీక్ష లో వచ్చినా జవాబులు రాయను అంటూ ఏడవ తరగతి పిల్లవాడు మొండికేసాడు. కారణం పేరెంట్స్…. కొందరైతే ప్రాంతీయ భేదం కూడా పాటించేవారు… .. మతసంబంధమైన పాఠాల్లో ఉండే ముఖ్యోద్దేశ్శాల గురించి ఆలోచించడం … ప్రధానం

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు సుగుణ గారూ

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Patha rojula chaduvu guruvulu vari paddathi nadatha nadavika vidhya Dani pradanynatha gurinchi chala baga rasaru Doctor garu. Congrats miku.
    —ప్రొ.డేవిడ్
    హైదరాబాద్.

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా నిజం మరియు ఈ సున్నితమైన పాఠాలు యువకులను కలవరపెట్టడమే కాకుండా కుటుంబ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ధన్యవాదాలు.
    —-ప్రొ.పి.రవికుమార్
    కాజీపేట.

  5. 5

    Shyamkumar... Nizamabad

    మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి విద్యార్థులకు అందించవలసిన పాఠ్యాంశాలలో సరియైన జాగరూకత వహించలేదని చెప్పాలి.
    మన మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా గారికి కనీస స్కూల్ విద్య కూడా లేద ట.
    గడిచిన తరంలో ఆడుతూ పాడుతూ విద్యనభ్యసించేవారు. విద్యార్థుల మీద ఇప్పుడు ఉన్నంతటి మానసిక ఒత్తిడి లేదని చెప్పాలి.
    పాఠ్యాంశాల పరంగా చూస్తే అప్పటి జీవిత విధానానికి అది సరి అయినది.
    మారుతున్న కాలానికి అనుగుణంగా దాని వేగాన్ని అందుకునే విధంగా అవి మారి పోవటం సహజమే.
    కొత్తగా వస్తున్న ప్రభుత్వాల విధి విధానాల పరంగా అందులో కూడా మార్పు చేసుకోవడం తప్పేమీ కాదు. ఉదాహరణకి మన చరిత్ర మొత్తం బ్రిటిష్ వారి పెత్తనంతో రాయబడింది.
    దురాక్రమణదారులను అత్యుత్తమైన రాజులుగా చిత్రీకరించారు అనడం లో సందేహం లేదు. భారతదేశ యొక్క సంస్కృతి సంప్రదాయాలను వెనక్కి నెట్టి పశ్చిమ దేశాల యొక్క సంస్కృతి జీవన విధానాన్ని గొప్పగా మన ముందు ఉంచారు.
    వాటిని సరిదిద్దే ప్రయత్నాలను రాజకీయపరమైన దృష్టి కోణంలో చూసి వాటిని వ్యతిరేకిస్తూ లేదా బలపరుస్తూ ఉన్న పార్టీలను మనం చూస్తూనే ఉన్నాం.
    ఇకపోతే దైవం, భక్తి కోణంలో రచయిత గారికి ఎదురైన అనుభవాన్ని దురదృష్టకరమైన సంఘటనగా భావించవచ్చు. మన దేశంలో మతమార్పిడులకు గురి అయిన వ్యక్తులు కొత్తగా వారు తీసుకున్న మతం పట్ల మత మౌఢ్యం అధిక రీతిలో ప్రదర్శించడం మనకందరికీ చిరపరిచితమే.
    ఇంతకుముందు హిందువులలో మతసామరస్యం, పరమత సహనం అధికంగా ఉండేది. ఇప్పుడు కూడా ఉందనేది నిజం. అలా లేనట్లయితే మన దేశంలో హిందూ మతం నుండి వేరే మతంలోకి ఇన్ని మతమార్పిడులు ఇంత వేగంగా జరిగేవి కావు. ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం లాగా సెక్యులర్ గా లేదు.
    అయితే ఈ సెక్యులర్ విధానాన్ని దుర్వినియోగం చేయడం మూలాన, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం జరుగుతుండడం మూలాన, లేదా రాజకీయ శక్తుల ప్రభావంతో హిందువులలో కూడా కొద్దిపాటి మార్పులు వస్తూ పరమత సహనం అనేది కాస్త కూసో తగ్గిపోతుంది అనేది ఎవరూ కాదనలేని నిజం.
    ఓట్ల యావతో ధన ఆర్జనని పరమావధిగా ఉన్న రాజకీయ పార్టీలు వీటిని మరింత ఎగదోస్తూ మైనార్టీ బుజ్జగింపు చర్యల ద్వారా రాజకీయ అధికారాన్ని పొందడానికి ప్రయత్నిస్తుండగా, హిందువుల ఓట్లతో అధికారం రావడానికి మరి కొన్ని పార్టీలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి.
    విద్యార్థి లోకాన్ని మన దేశాన్ని పరిపాలించే ఉత్తమమైన భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఏకైక సాధనం మంచి విద్య మాత్రమే. అందులో ఏమాత్రం సందేహం లేదు.
    విద్యా, ఆరోగ్య రంగాలు రెండు పూర్తిగా వాణిజ్య రంగంగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో అది నెరవేరడం కల్ల అని అనిపిస్తుంది.
    బాధ్యత కలిగిన దేశ పౌరులుగా మనము నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని సందర్భానుసారంగా వివరించారు
    రచయిత శ్రీ డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్. వారికి నా యొక్క అభినందన నమస్కారములు.

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  6. 6

    sagar

    చిన్నపిల్లల మస్తిష్కంలో పెద్దల అభిప్రాయాలు జొప్పించడం నిజంగ మంచి పద్దతి కాదు. ఒక వేళ అది మంచి విషయమైనా చెప్పవలసిన రీతిలోనే చెప్పాలి అనేది నా అభిప్రాయం సర్. ఇక ఈ రోజుల్లో కొంతమంది మేధావులకు నాటి మహనీయుల లోపాలను వారి కులమే కాదు, లేనిపోని అబద్దపు ప్రచారాలు ప్రచారం చేయడం ఒక ప్యాషన్ అయింది. ఇక ఇలాంటి వాటికి మీరు చేసినట్లు మన ఇంటి దగ్గరనుంచే సంస్కరణ మొదలెట్టాలి. మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదములు సర్

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు.

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఎంత బాగా ‌. వివరించారు ఇన్ని మతాలు ఉన్న మన దేశంలో అన్ని ఫిలలు తెలుసుకోవాలి తల్లి తండ్రుల సహకరించాలి ఈవిషయాన్ని మీరు చాలా బాగా చెప్పారు
    —-విజయలక్ష్మి. కస్టూరి
    అమెరికా.

    1. 7.1
  8. 8

    J Mohan Rao

    Sir తమరు చాల సున్నితము అయిన విషయము
    చక్కగా వివరించారు. మన దేశములో ఇంతకు ముందు వేల సంవత్సరముల క్రిందట
    వున్న గురుకుల విద్యాలయములు, వ్యవస్త నేడు లేదు. విద్య ద్వార మనిషి పరిపక్వత చెందుతాడు.
    కాని నేడు , ముఖ్యముగ రెండు మూడు దశాబ్దాలు నుంచి ఇంచుమించు విద్య వ్యవస్త లోన corporate సంస్థలు వేళ్లునుకొన్నాయి
    విద్య వ్యవస్త వ్యాపారము చేసి , teaching కంటె ( బోధన) , coaching institutes అయినవి. అభిలషణీయము కాదు. Students లోన వున్న innovative గుణం, rankల కోసం చదివే రోజుల్లో, సన్నగిలు తున్నది. మార్పు తల్లి తండ్రుల నుంచి రావాలి. మత సామరస్యము
    గురించి అందరు పిల్లలకు తెలియ చెప్పవలెను
    Moral values, దయ, సమాజము పట్ల అవగాహన కలిగి వుండేల syllabus తయారు చేయ వలెను.
    మంచి వ్యాసం అందించారు. ధన్యవాదములు.

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ అమూల్య స్పందనకు ధన్యవాదాలు సర్

  9. 9

    పుట్టి నాగలక్ష్మి

    ఈసారి మీరు తీసుకున్న అంశం సార్వజనీనమైనది.విద్యావ్యవస్థ లోని లొసుగులు,పాఠ్యాంశాల ఎంపికలోని పొరబాట్లు, విద్యావేత్తల నిర్ణయాలు నిమిత్త మాత్రమే కావడం నివారించలేని పరిస్థితులు నెలకొన్నాయి. కులాలు, మతాల, దేవుళ్ళ గురించిన భిన్నాభిప్రాయాలు పిల్లల మనస్సులను కలుషితం చేస్తున్నాయి.సిలబస్ తయారీలో ప్రభుత్వ జోక్యం ఉన్నంతవరకూ మనము ఏమీ చెయ్యలేని పరిస్థితులు.తల్లిదండ్రులే పిల్లల మనసులు కలుషితం కాకుండా చూసుకోవాలి మరి. మంచి అంశం తీసుకున్నందుకు ప్రసాద్ గారికి అభినందనలు.👍🙏🏻

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ అమూల్య స్పందనకు ధన్యవాదాలు

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్కారం! ఈ వారం శీర్షికలో మీరు చాలా సున్నితమైన, అందరూ ఆలోచించవలసిన విషయాన్ని ఎంచుకున్నారు. ముఖ్యంగా పిల్లల పాఠ్యపుస్తకాలలో ఇటువంటి మతపరమైన అంశాలను వ్యక్త పరచవలసిన అవసరం ఉందా?… అనే సందేహానికి, ఉంది …లేదు.. అనే దొరకని సమాధానమే లభిస్తుంది. మీరు చెప్పినట్టు ప్రభుత్వాలు నిపుణుల కమిటీ ద్వారా నిర్ణయించవలసిన విషయమే అయినప్పటికిని, ప్రజాస్వామ్య వ్యవస్థతో ముడిపడి ఉన్న ఏ పార్టీకి చెందిన ప్రభుత్వమైనా “పిల్లి మెడలో గంట ముందుగా ఎవరు కట్టాలి “..అనే ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారేమో! అందుకు కారణం తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేరు.
    కించిత్ స్వభావము గల వ్యక్తులే ఇతర మతాలకు సంబంధించిన ఆచార వ్యవహారాలను వక్రబుద్ధితో ఆలోచిస్తారు . ఇటువంటి స్వభావము మనదేశంలో కొందరు ముఖ్యంగా ,మతఛాందస్సులైన ముస్లిం మరియు క్రిస్టియన్ మైనార్టీ లోనే కనిపిస్తుంది. నాకు తెలిసినంతవరకు హైందవులలో ఈ స్వభావము బహు స్వల్పము. కారణం ఎదుటివాడి ఎదుగుదలను ఎలా అడ్డుకోవాలని ఆలోచించేవాడు ,పక్క ఇంట్లో ఏం జరిగితే నాకెందుకులే అని మిన్నకుండేవాడు ,కష్టాల్లో ఉన్న వాడిని పలకరించాలంటే తను ఎక్కడ సహాయపడవలసిస్తుందో అని తప్పుకునేవాడు , చివరగా అన్నింటికీ మించి, సర్దుకుపోయే గుణము గల హైందవుడు… ఇతర మతాల గురించి ఆలోచించడు… అనేది నా వ్యక్తిగత అభిప్రాయము.
    —-బి.రామకృష్ణ రెడ్డి
    సఫిల్ గూడా.

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ అమూల్య స్పందనకు ధన్యవాదాలు సర్

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    194 వసంచిక ను విద్య గురించి.కదా.
    మనదేశంలో ఎక్కువ నిరాదరణకు గురైనది ఎక్కువ ప్రయోగాలకూ గురి అవుతున్నదీ విద్య అనే అంశమే.పాలనలో ఏరాజకీయపార్టీ వుంటే ఆపార్టీ రాజకీయ సిద్ధాఅంతం ప్రకారం పాఠ్య ప్రణాలికలూ వుండాలనే పట్టుదలలూ విద్యారంగాన్ని పూర్థిగా కళంకం చేస్తున్నయి. పూర్వం విద్యాలయాలలోగ రకరకాల రాజకీయ సిద్ధాంథాలకూ నిబద్ధులయిన ఊపాధ్యాయులున్నా సిలబస్ లోవున్న పాఠాలు చెప్పేవారు తమ రాజకీయనిబద్ధతతో పని లేకుండా.
    యాభైఏండ్లు జాతిపితగా కీర్తించబడ్డ గాంధీ పనికిరానివాడైపోతున్నడు సోషలిస్ట్ భావాలతో దేశానికి మార్గదర్శనం చేసిన నెహ్రూ దేశద్రోహిగావమారిపోయినాడు.స్వాతంత్ర్య సమరంలో అసలు సంబంధమేలేని పాల్గోనని వ్యతిరేకులు దేశరక్షణకొ కంకణంకట్టుకున్నవారయిపోతున్నరు.రాజ్యాంగం రచించిన మహానుభావుడు అంటరాని వాడవుతున్నడు
    పాఠాలలో నీతి పద్యాలు చెడ్డవై పోతున్నవి.
    రాజకీయపార్టీలు అధికారంలో వుండేది అయిదేండ్లో పదేండ్లో.ఈలోపుననే చేయగలిగినంత నష్టం చేస్తున్నరు
    ఇంకోరాజకీయపార్టీ అధికారం రాగనే మళ్ళీమారుతది.విద్యార్థులు గందరగోళం లోనికి నెట్టబడుతున్నరు. ఇదంతా ఎప్పుడు ఆగుతుందో? విద్యారంగం లో విపరీత అసంఖ్యాక ప్రయోగాలెప్పుడాగిపోతయో !?
    —-నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ .

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!