సంచికలో తాజాగా

Related Articles

29 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    -కె.ఎల్.వి.ప్రసాద్
    సఫిల్ గూడ.

  2. 2

    Neelima

    డాక్టర్ గారు..
    నమస్కారములు..
    ఆనాటి విద్య, ఈనాటి విద్య మధ్య వ్యత్యాసం చాలా బాగా చెప్పారు.
    పిల్లలకు బడిలో ఆటపాట లు ఎంత అవసరమో, ఈనాడు అది ఎంత లోపించిందో చక్కగా వివరించారు.
    ఆటపాటల ఆవశ్యకత ఎంత అయిన అవసరం. ఈ విషయం ప్రభుత్వం మరింత ఆలోచించాలి..

    ధన్యవాదాలు..

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నీలిమ గారు
      చక్కగా చెప్పారు
      హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  3. 3

    Sagar

    తిలా పాపం తలా పెడికెడు సామెత మాదిరి ఈ విషయంలో తల్లి తండ్రుల మరియు పాలకుల తప్పిదాలు ఉన్నాయి సర్. తమ పిల్లలు పేరెన్నిక గన్న పాఠశాల లో చదవాలని తల్లి తండ్రుల కొరికే ప్రభుత్వ పాఠశాలలకు శాపమై కూర్చంది. కాబట్టి అందరిలో మార్పువచ్చి విద్యారంగం పై దృష్టి పెడితేనే పిల్లలకు వయసుకు తగిన విద్య అబ్బుతుంది. మంచి వ్యాసం అందించిన మీకు ధన్యవాదములు సర్.

  4. 4

    Rajendra Prasad

    This attitude of only academic interest is seen more in India because we struggle for existence and there is uncertainty about career. At least well to do families need to encourage their children to sports or other activities of their interest

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      హృదయ పూర్వక కృతజ్ఞతలు

  5. 5

    Madhumaasam

    నమస్కారం సార్… నేను అనునిత్యం బాధపడే ప్రతి ఆలోచన మీ కలం ద్వారా ఈ రోజు బయటపడింది అనిపించేంతలా మీ వ్యాసం తో మనసును ఆకట్టుకున్నారు…..పసిపిల్లలు జీవితాలు ప్లాస్టిక్ వాసన కొడుతున్నాయి. పసి మొగ్గలు విచ్చుకొని ఆ నవ్వులు తారా జువ్వల్లా ప్రతి ఇంటి లోగిళ్లలో వెలుగులు విరాజిమ్మలని ఆరాటపడే హృదయం నాది……
    సార్..నేను కథలు వ్రాస్తుంటాను కానీ నా కథలను ఈ పత్రికకు పంపాలంటే మార్గం దొరకటం లేదు . ఈ పత్రిక వారిని ఎలా సంప్రదించాలో తెలియచేయగలరు. నా నెంబర్ :9182486988
    .

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అక్షర సత్యం సర్ మీరు నేటి విద్యా వ్యవస్థ గూర్చి,చిన్నారుల అవస్థల గూర్చి చెప్పింది.చిన్ని మెదళ్లకు ఆడేందుకు,పాడేందుకూ సమయమూ లేదు.చాలా అలసటతో కూడిన చదువును వారు చదువుకొంటున్నారు.విరామమెరుగని పని గంటల్లా బడి గంటలు వారిని నిర్దేశిస్తున్నాయి.మీరన్నట్టు ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ,అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి కావాల్సిందల్లా క్వాలిటీ టైం టీచింగ్ కి వినియోగించేలా సంపూర్ణ స్వేచ్ఛను ఉపాధ్యాయులకు ఇవ్వడమే.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు ఎందరో ఉన్నత పదవుల్లో ఉన్న అంశం మనందరికీ విదితమే.విద్యావిధానం లో వచ్చిన పెను మార్పులు అటు ఉపాధ్యాయ లోకాన్నీ ,ఇటు విద్యార్థి భవితవ్యాన్నీ వ్యాకుల పరుస్తున్నాయి. నాటి కాలంలా స్వేచ్చా పూరిత బడి సమయం నేటి విద్యార్థులకు దొరకాలని మీతో పాటు మేమంతా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.చిన్నారి ఆన్షి దినచర్య ఎందరో బాలల బాధాకరదినచర్య. అందరూ ఆలోచించవలసిన చాలా ప్రాముఖ్యమైన అంశం గూర్చి చర్చించారు సర్.ధన్యవాదాలు🙏💐💐
    —-నాగ జ్యోతి శే ఖర్
    కాకినాడ.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా ధన్యవాదాలు మీకు

  7. 7

    పుట్టి. నాగలక్ష్మి

    మంచి అంశం తీసుకుని విశ్లేషించారు. తల్లిదండ్రులే కాదు, మా ఉపాధ్యాయులంకూడా ఈ విషయములో మధనపడుతూ బాద పడుతున్నాం. ఇందులో అతిశయోక్తి లేదు.. పిల్లలకు మూడేళ్ళకే బాల్యం, వసంతం లేకుండా పోయాయని బాధగా ఉంటుంది..

  8. 8

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 136 సంచికలో బడిగంటలు..!!నాటి నేటి విద్యావిధానం పిల్లల చదువుల మధ్య వ్యత్యాసం చక్కగా వివరించారు. ఇప్పటి కార్పొరేట్ స్కూల్స్ మోజులో పడి వారి బాల్యం ఎం కావాలని ఆలోచన లేకుండా చిన్నప్పటి నుండి ఆడి పాడే వయసులో అంత భారం మోపి చదువు చదువు అంటూ వారిని రుద్దుతూ ఉంటే న్యాయమేనా, విద్యారంగంపై దృష్టి పెట్టి పిల్లల వయస్సుకు తగ్గ బోధన ఉంటే చదువు అబ్బుతుంది. ఈ విషయములో అటు ప్రభుత్వం మరియు తల్లిదండ్రులు ఆలోచించాలి, అంతేకాకుండా ప్రభుత్వం అందుకు తగ్గ చట్టం తీసుకురావాలని అందరం ఆశిద్దాం. మంచి విషయాలు అందిస్తున్న మీకు నమస్కారములు సర్,🙏

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      ధన్యవాదాలండీ.

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నాటి -నేటి విద్యా విధానాలు, వాటి యొక్క ప్రమాణాల గురించి రచయిత గారు క్లుప్తంగా చాలా చక్కగా వివరించారు. ఆనాటి విద్యా విధానాలు ఉన్నత విలువలతో, భక్తి భావంతో ,అత్యుత్తమ ప్రమాణాలతో, క్రమశిక్షణతో, సామాజిక బాధ్యతతో కూడుకొని ఉండేవి.
    కానీ నేటి విద్యా విధానం వ్యాకరణ, చందస్సు ,పద కూర్పు లోపించిన వక్ర వ్రాతలతో కూడుకొని ఉన్నప్పటికీ, ఆధునిక ,విలాసవంతమైన జీవనము కొనసాగించటానికి కావలసిన ధన సంపాదనకు అనువైన ఉద్యోగ సాధనకు ఎంతో అనుగుణంగా ఉండటం కొసమెరుపు.😁
    —-బి.రామకృష్ణా రెడ్డి
    సఫిల్ గూడ.

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డిగారు
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-136 ..చిన్న పిల్లల చదువుల గురించి కూలంకషంగా తెలిపారు. ఆ రోజుల్లో చాలా వరకు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనూ, ఎయిడెడ్ స్కూళ్ళలో చదువుకునేవాళ్ళు. అన్ని పాఠశాలల్లో బోధనలు సిలబస్ ప్రకారం జరిగేవి.

    నేడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి హైటెక్ స్కూళ్ళు. లక్షలు లక్షల డొనేషన్లు కట్టి పిల్లలను చదివిస్తున్నారు. రోజూ హోంవర్క్ ఇస్తున్నారు. ఆటపాటలకు ప్రాధాన్యత తక్కువ. చిన్నారులపై పెనుభారం మోపుతున్నారు. చక్కటి కథనంతో సాగింది మీ వ్యాసం. అభినందనలు.
    —–జి.శ్రీనివాసాచారి
    కాజీపేట

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    136వ సంచిక:
    “ఏ దేశ చరిత్ర,చూసినా ఏమున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం”
    అన్నట్టు ఏపార్టీ అధికారం లోకివచ్చినా శిద్యారంగంపైప్రయోగాలే. ఇప్పటికీ ఒక సమగ్ర విద్యాప్రణాళిక లేదు. అధికారం లోకి రాగానే విద్యారంగం మెరుగుదలకు అంటూ ఒక కమిటీ వేయటం నివేదికరాగానే అటకెక్కించటం.
    ఉదాహరణకు డా: జకీర్ హుస్సేన్ బేసిక్ ట్రేనింగ్ అన్నరు గాంధీ ఆదర్శంగా ఉపాధ్యాయులకు శిక్షణలో భాగంగా చర్ఖాలు వడకటం తక్ లీలు వడకటం వంటలు వగైరా ప్రవేశపెట్టి ఆయా ఉపకరణాలు కొని మూలపడేసినారు .బి టి ఎస్ లో అవన్నీ స్టోర్ చేసిన గది తలుపులను 14 ఏండ్లు తీయనే లేదు అని నేనంటే మీరు నమ్మరేమో!
    1955 లో బహుళార్థ ప్రయోజక విద్యాపద్ధతిని ప్రవేశపెట్టి అంతకు ముందున్న HSC ని తేసేసాన్రు 1955 లొ ప్రవేశపెట్టిన ఈ వాద్యలొ మూడేండ్లు సాంకేతిక విద్యకు సంబంధించిన సిలబస్ గాని సంబంధించిన పరికరాలు లేక మూడేండ్లు సాంకేతిక విద్యను ఎన్నుకున్న వాద్యార్థులు కేవలం languages మాత్రమే చదువుకున్నరు. చివరి సంవత్సరం ఆవిద్యార్థులనందరినీ MPC,BPC గ్రూపులలో సర్దుబాటు చేసి ఒక్కసంవత్సరంలోనే మూడేండ్ల సిలబస్ వాళ్ళ మెదళ్ళలో కుక్కినారు. తరువాత మూడునాలుగేండ్ల తరువాత ఆ సిస్టమ్కు స్వస్తి చెప్పి మరలా ssc పద్ధతి పెట్టి పాత ఇంటర్ మీడీయేట్ను ప్రవేశ పెట్టినారు.
    పూర్వం మీరన్నట్టు చదువులో ఆర్ట్స్ క్రాఫ్ట్,తోటపని, ఆటలు , morals కు ప్రత్యేకంగా పీరియడ్ స్ ఉండేవి ఇప్పుడవేవీ లేవు .ప్రభుత్వ ఉద్దేశం ఆటలు నైతికత పిల్లలకు అవసరం లేదేమో!
    ఇది నిజమేనని ప్రస్తుత రాజకీయ నాయకులను చూస్తే తెలుస్తున్నది.
    విద్యా రంగం ప్రయోగాలకు లోనైనంత ఏ రంగమూ కాలేదనుకుంట.
    పూర్వ కాలంలో ప్రైవేట్ పాఠశాలలు( ఖాన్ గీ బడులు) తెలుగు భాషను కాపాడటానికి కృషిచేసినవి.ఆంధ్ర ప్రాంతం లో వలె పంచాయితీ బోర్డు పాఠశాలలు తెలంగాణలో లేకపోవటం ఒక కారణం.
    అధికారంలో వున్న ప్రజాప్రతినిధులకే విద్యాసంస్థలుఉంటే ఇక ప్రభుత్వ బడులకు ప్రోత్సాహం ఎట్లా వస్తది?
    ప్రజాప్రతినిధుల ,ప్రభుత్వోద్యోగుల పిల్లలు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలలోనే చదవాలని చట్టంచేసి ఇంప్లిమెంట్ చెయ్యాలె.ప్రైవేటు ప్ఠశాలలకు ప్రభుత్వ సహాయం బందు చెయ్యాలె. విద్యారంగంలో పోటీ చదువుకుంటున్న విద్యార్థుల మధ్యలో వుండాలెగాని విద్యాసంస్థల మధ్యలో కాదు. మాత్భాషకు ప్రియారిటీ వుండాలె.
    బడులలో ఉత్తీర్ణత తగ్గుతే ఉప్ధ్యాయులను శిక్షించటం ఎంతవరకు సబబు.అందుకే పిల్లవాడికి జ్ఞానం రాకున్నా ఉత్తీర్ణులను చేస్తున్నరు,పాఠశాలల్లో స్థాయి లు పడిపోయాయని గగ్గోలు పెట్టటంవృథా.
    అతిగా మాట్లాడానట్టున్నాను.దేనికైనా సిన్సియారిటీ ఉండాలె .ఏరంగంలో నైనా.అదొక్కటి తప్ప అన్నీ ఉన్నాయి ప్రభుత్వానికీ మనకూ ( ప్రజలకూనూ.) . మీరు లేవనెత్తిన సమస్యలు విస్తృతంగా చర్చించ వలసినవి అదీ ప్రభుత్వ వర్గాలు ముఖ్యంగా . అది జరుగుతుందనే ది అత్యాశే.
    —-నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      శాస్త్రి గారూ.

  12. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir
    ఈ వారం ఎపిసోడ్ చదివాను
    విద్యా వ్యవస్త గురించి
    బాగా విశ్లేషించారు.
    —-డా.తాటి నరహరి
    ముంబై.

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      డాక్టర్ గారు.

  13. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి పలు ప్రశ్నలకు పునాది అయింది👍👌💐💐
    –సంగివేని రవీంద్ర
    ముంబై.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!