సంచికలో తాజాగా

Related Articles

31 Comments

  1. 1

    డా. కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    సఫిల్గూడ.

  2. 2

    Sagar

    చాలా మంచి రచన సర్. నిజమే మనిషిని పలకరిస్తే వచ్చే సంతోషం అదీ ముఖ్యంగా పల్లెటూరు వాతావరణంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక వర్తమానానికి వస్తే, మీలాగా కానున్న పదుల సంఖ్యలో నా శుభోదయం మెసేజ్లు ఉంటాయి. అందులో మీకు స్థానముంది. అసలు అలాంటి పలకరింపులే మనిషిని రోజంతా ఉత్సాహపరుస్తాయి అనడంలో కూడా సందేహం లేదు. మంచి వ్యాసం అందించినందుకు మీకు ధన్యవాదములు సర్.

  3. 3

    Neelima

    డాక్టర్ గారు..
    నమస్కారములు..

    పలకరింపు అనేది జీవితంలో ఎంత ముఖ్యమైనదో చాలా బాగా చెప్పారు..
    మొబైల్ ఫోన్ల వల్ల ఈ పలకరించడం ఎంత బాగా చేయవచ్చు అనేది కూడా బాగా చెప్పారు.. అదే మొబైల్ ఫోన్ల వల్ల ఎదుట ఉన్నవారితో మాట్లాడడం మాత్రం తగ్గించేస్తున్నాం. రైలు, బస్సు ప్రయాణాలలో మొబైల్స్ పట్టుకుని కూర్చుని, పక్కన ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి వస్తుంది..
    ఏది ఏమైనా పలకరింపు అనేది హృదయనికి ఒక స్వాంతన అని చెప్పకనే చెప్పారు..

    ధన్యవాదములు

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నిజమే…మీరు చెప్పింది.
      అభినందనలు…ధన్యవాదాలు.

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అవసరం కోసం కాదు.. ఆత్మీయత కోసం పలకరింపు.. అనే మీ సందేశం 👌
    —వెంకట నర్సయ్య
    మహబూబాబాద్

    1. 4.1
  5. 5

    నూతక్కి రాఘవేంద్ర రావు

    తుమ్మెద ఝం కర్మతో మొగ్గ వికసిస్తుంది
    పలకరింపుతో మనసు పరవశిస్తుంది.
    చిరునవ్వుతో పలకరొస్తే పరిమళమేగా .

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవునండీ
      ధన్యవాదాలు మీకు.

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    తాజాసంచిక చదివినాను..నాకూ ఉదయాన్నే బంధుమిత్రులను పలకరించే అలవాటున్నది.
    మనం బతికున్నామనే సంగతి అవతలివారికి తెలుస్తుందని నా నమ్మకం.
    మీ అభిప్రాయాలతో విభేదించవలసిన కారణం కనిపించటం లేదు.
    పూర్తిగా ఏకీభవిస్తున్న ,నమస్తే
    –రామశాస్త్రి
    హన్మకొండ.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు శాస్త్రి గారు.

    2. 6.2

      డి. వి. శేషాచార్య

      గత మూడు నాలుగేళ్లుగా క్రమంతప్పని
      ఆత్మీయమైన మీ పలుకరింపు నన్ను పులకరింపజేస్తూనే వుంది. ధన్యవాదములు. ప్రతిస్పందించనివ్వని నా బద్దకాన్ని మన్నించ ప్రార్థన.

      1. 6.2.1
  7. 7

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 131 సంచికలో పలకరింత-పులకరింత..!! విషయాన్ని చక్కగా వివరించారు.పల్లెల్లో కనిపించిన ప్రతివారితో దారిపొడవునా పలకరింపులు మరియు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటూ,వారి కష్టాలు, సుఖాలు మనసులో ఉన్న భావాలు వ్యక్తపరుస్తూ చాలా అత్మీయంగా పలకరించుకుంటారు.పలకరింపు అనేది జీవితానికి ఎంతో ముఖ్యమైనది చాలా విలువైనది అని మంచి వివరణ ఇచ్చారు సర్.మీకు ధన్యవాదములు డాక్టర్ గారు🙏

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కృతజ్నతలు
      భుజంగ రావు గారూ.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక ఆత్మీయ పలకరింపు ఎదుటి వ్యక్తి కి పలకరించిన వారికి కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది చాలా చక్కగా వివరించారు
    —విజయ లక్ష్మి.కస్తూరి
    హైదరాబాద్.

  9. 9

    Jhansi koppisetty

    ధన్యోస్మి 🙏🙏🙏మీ పలకరింపు మిత్రుల జాబితాలో నేనూ వున్నందుకు ఆనందంగా వుంది. మీరు ఒక విషయం తెలుసుకోవాలి… ఉదాహరణకి నాకు బ్రాడ్కాస్ట్ పద్దతిలో కొందరు మిత్రుల శుభోదయం క్రమం తప్పకుండా వస్తుంది. నేను సాధారణంగా జవాబు ఇవ్వను… కాని నిత్యం వచ్చే శుభోదయం రాని రోజున వెలితిగా వుంటుంది…రెండు మూడు రోజులు వరుసగా రాకపోతే ISD call అయినప్పటికీ కాల్ చేసి పలకరించి క్షేమసమాచారం తెలుసుకుంటాను.. జవాబు ఇవ్వకపోవడంలో అలక్ష్యమో, గర్వమో, చిన్నచూపో మరేదో కాదు….కేవలం సమయాభావం.. నా స్నేహితులు నన్నర్ధం చేసుకుంటారని నా నమ్మకం…. అలాగేమీరూ అర్ధం చేసుకోవాలని విన్నపం🙏🙏

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అర్ధం చే సుకుంటున్నాను
      విశ్లేషణ
      వివరణ బాగున్నాయ్.
      అభినందనలు
      ధన్యవాదాలు.

  10. 10

    Rajendra Prasad

    ఆత్మీయ పలకరింపుల జాబితాలో నన్ను కూడా పెట్టి నా స్థాయిని పెంచారు. ఇది అటు ఉంచి, విషయంపై చాలా చక్కగా, నిష్కర్షగా రాశారు
    – రాజేంద్రప్రసాద్

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఆహా! ఎంత చక్కని ముగింపు !పలకరింపు అనేది…” కనిపించని ఆత్మీయ కరచాలనం “…
    మీరన్నట్లు ఏదో ఒక రూపంలో పలకరింపులు కొనసాగినప్పుడే బంధాలు అనుబంధాలు నిలబడతాయి. మన పలకరింపుకు లభించే ప్రతిస్పందనను బట్టి ఎదుటి మనిషి యొక్క మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చు . కొందరు తమ ఆత్మీయపలకరింపుతో మనసుకు దగ్గరై తిరిగి ఎప్పుడు ఎదురు పడతారా! అని ఆగి ,మరీ ఎదురు చూస్తాము . మరి కొందరి పలకరింపుతో మనము వీరికి ఎందుకు ఎదురుపడ్డామా !అని అనిపిస్తుంది .
    నాకు ఈ మధ్యకాలంలో “శృతి తప్పిన పలకరింపు ” అనే శీర్షికతో చిన్ని వ్యాసం వ్రాయాలనిపించింది. మీ పలకరింపుతో దానికి అక్షర రూపం ఇవ్వాలనుకున్నాను. చక్కని ఉత్తేజాన్ని కలిగించినందుకు ధన్యవాదములు.🙏🙏.
    —-బి.రామకృష్ణా రెడ్డి
    అమెరికా.

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చాలా బాగా రాసారు
      రెడ్డి గారు.
      కృటజ్నతలు.

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పలకరింపు గూర్చి ఎన్ని పులకరించే విషయాలు పంచుకున్నారో సర్.నిజం పలకరించే వ్యవధి కూడా ఉండడం లేదు నేటి హడావిడి జీవితాల్లో.కానీ మీరన్నట్టు మీరు మాకు గుర్తున్నారు అనే పలకరింపు అది ఫోన్ ద్వారా అయినా చిన్న సందేశమైనా ఎంతో ఆనందాన్నిస్స్తుంది. కొన్ని సార్లు మనస్సు స్థబ్ధతను వదలగొట్టి మనుషుల్లో పడేలా చేస్తుంది.పలకరింపుకి వెంటనే జవాబు ఇవ్వని వారిలో నేను కూడా ఉన్నాను.కానీ ఈనాటి మీ వ్యాసం చదివాక పలకరింపు ఒక ఆత్మీయ కరచాలనం అని స్పర్శకు వచ్చింది.హృదయం ఉత్తేజపడే అంశాన్ని అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్🙏🙏💐
    —-నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా ధన్యవాదాలు మీకు.

  13. 13

    samsundar.yeeda@gmail.com

    చాలా చక్కగా చెప్పారు…ఒకపుడు గ్రీటింగ్ కార్డ్స్ పోస్ట్ లో పంపేవాళ్ళము…కొత్త తరానికి వాటి గురించే తెలియదు….కనీసం సామాజిక మధ్యమాల ద్వారా అయిన పలకరిస్తే చాలా మంచిది….మనిషి సోషల్ జీవితం లోనే ఉండాలి….ఒంటరిగా బంది అయ్యి ఉండలేడు…
    మంచి మాట చెప్పారు ..

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సామ్
      నీ స్పందనకు
      కృతజ్ఞత లు.

  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 131 లో…పల్లె విషయాలను, అక్కడి పలకరింపులను చక్కగా వర్ణించారు. ప్రయాణంలో జరిగే పరిచయాలను తెలిపారు. బంధువులను, ఆత్మీయులను పలకరించడం ద్వారా బంధాలు బలపడతాయని తెలియచేశారు. పలకరింపు ఫ్యాషన్ కాదని, కనిపించని ఆత్మీయ కరచాలనం.. కొసమెరుపు బాగుంది. అభినందనలు.
    —-జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

  15. 15

    శ్యామ్ కుమార్ చాగల్

    జ్ఞాపకాల పందిరి సాహిత్యపథంలో dr కె ఎల్వి ప్రసాద్ గారి 131 భాగం లో పలకరింతకు వున్న ప్రాముఖ్యాన్ని సోదాహరణంగా తీర్చి దిద్దారు. ప్రస్తుతం రచించే తప్పటడుగులు వేస్తున్న నాకు మొదటి అడుగు వీరి యొక్క రచనలను విశ్లేషించటమే.
    ఇవి ప్రతీ జ్ఞాపకపు మలుపులు, తన యొక్క జీవితపు సహజ జీవన పాఠం
    నుండీ వచ్చిన మచ్చు తునకలు. గమనించి చూస్తే ప్రతీ ఒక్కటి అనుదినం మనం అనుభవిస్తున్నవే. ప్రతీ వ్యాక్యం మన గుండెల్లో వ్యంగ్య బాణాలుగా దిగి పోయేవే. వృత్తి రీత్యా డాక్టర్ అయినప్పటికీ రచన వ్యాసాంగం పట్ల గౌరవం తో తనకున్న ఆసక్తి తో ప్రతీ విషయాన్ని మనసుకి అల్లుకు పోయేలా కథా వస్తువును మనకు ప్రతీ వారం అందించగలిగారు.
    ప్రతీ విషయం సర్వ జనావళికి అనువర్తించేవే. ఎందుకంటే ప్రతీ రచనలో జీవితం వుంది. ఈ రచనల్లో ప్రతీ విషయాన్ని పరిశీలించి పరిశోధించి రాసినట్లుగా తెలుస్తోంది. అందుకనే చదివిన మనకు ఇందులో ఎక్కడా అతిశయోక్తి కనపడదు.

    అందుకే రాసిన ప్రతి ఇతివృత్తం, నిజాలకు వుండి , కల్పితం లాగా కనపడకుండా మనకు వర్తించేలా వున్నాయి.ప్రతీది వాస్తవానికి దగ్గరగా, నిర్మొహమాటం గా వున్నాయి. . స్నేహాలకు, పలకరింపు లకు , వుండే ప్రాముఖ్యాన్ని ఎత్తి చూపారు. అన్నీ కూడా మనకు వర్థించేవే. రచయిత కు , సంచిక కు ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!