పుట్టుకతోనే బంపర్ బహుమతి..!!
ప్రతి ఇంట్లోనూ పిల్లవాడికైనా, కూతురుకైనా పెళ్లి చేసిన తర్వాత పెద్దవాళ్ళు కోరుకునేది వెంటనే వాళ్లకు పిల్లలు పుట్టాలని. అందులో మళ్ళీ కొడుకు విషయంలో ప్రత్యేక శ్రద్ధ. ఎందుకంటే వంశోద్ధారకుడి కోసం ఆరాటం అన్నమాట! ఎవరైనా ముందు మగ పిల్లవాడే పుట్టాలని కోరుకోవడానికి ఇదే కారణం అనుకుంటాను. దీనికి తోడు మతాల పరంగా కులాల పరంగా ప్రాంతాల పరంగా చిరకాలంనుండి అల్లుకుపోయిన ఆచార వ్యవహారాలూ, సంప్రదాయాలూ కూడా కావచ్చు.


రచయిత మనవరాలు ఆన్షి.నల్లి (సికింద్రాబాద్)
ఆడపిల్ల వద్దనుకోవడానికి ప్రధాన కారణం అందరికీ తెలిసిందే, అదే వరకట్న పిశాచం. ఇది తరతరాలుగా వస్తున్నదే. కన్యాశుల్కం ఒకరకంగా ఇబ్బంది పెడితే వరకట్నం మరో రూపంలో ఇప్పటికీ ఆడపిల్లలను ఇబ్బంది పెడుతూనే వుంది. వీటికి తోడు ఈనాడు ఆడపిల్లను ఇంటాబయటా కూడా సంరక్షించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని చాలామంది – ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఆడపిల్ల పుట్టకూడదని వేయి దేవుళ్ళకు మొక్కుకుంటారు. ఒకప్పుడు అందుబాటులోనికి వచ్చిన ఆధునిక యంత్రం ‘స్కానర్’ ద్వారా, పుట్టబోయేది ఆడా? మగా? అన్న విషయం తెలుసుకుని, ఆడపిల్ల అయితే ఆది లోనే అంటే పిండ స్థాయిలోనే అంతమొందించేవారు. అలా ఒకప్పుడు ఆడపిల్లల నిష్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఎక్కువ శాతం మగ పిల్లలు బ్రహ్మచారులుగా మిగిలిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. లేకుంటే, కులాంతర, మతాంతర, ప్రాంతీయేతర వివాహాలు చేసుకోవలసి వచ్చేది. అందుకే భ్రూణహత్యలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం తీసుకు రావలసి వచ్చింది. ఎవరైనా చట్టం అతిక్రమిస్తే కఠిన శిక్షలు వేసే చట్టం కూడా రావడం వల్ల భ్రూణహత్యలు చాలా మట్టుకు తగ్గాయనే చెప్పాలి.


తాత.. అమ్మమ్మ లతో బేబి ఆన్షి.నల్లి.
అయితే, ఇప్పటికీ ఆడపిల్ల పుడితే అది కేవలం తల్లి లోపమనీ అంటూ, మగపిల్లవాడు పుట్టడానికి, తల్లితో పాటు తండ్రి పాత్ర కూడా ఉంటుందని తెలియని మూర్ఖ జనావళి ఇంకా మనలో ఉండడం దురదృష్టకరమే! ఈ విషయంలో కోడళ్లను అత్తలు సూటిపోటి మాటలతో మానసికంగా హింసించడం గమనించ దగ్గ విషయం. అందుకేనేమో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ‘ఆడవాళ్ళకు ఆడవాళ్లే శతృవులు’ అని చెబుతుంటారు.
మగపిల్లవాడు పుట్టకపోతే, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేసే పురుష పుంగవులు కూడా ఇలాంటివారే. శాస్త్రీయమైన, సాంకేతికపరమైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాళ్ళు కూడా ఇలాంటి ఆలోచనలే చేయడం దురదృష్టకరం.


అమ్మ..అమ్మమ్మ తో బేబి ఆన్షి. నల్లి.
కాలనుగుణంగా సమాజంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా కొన్ని శాసనాలు కట్టుదిట్టం చేయడంతో భ్రూణహత్యలు తగ్గాయి, ఆడపిల్లల నిష్పత్తి శాతం కూడా పెరుగుతున్నది. ఆడపిల్లలను కోరుకునే తల్లిదండ్రులు ఎక్కువైనారు. ఆడపిల్లలు దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉన్నత పదవులలో సమర్థవంతంగా రాణించ గలుగుతున్నారు. శ్రీమతి గోల్డామెర్ (ఇజ్రాయేల్), మార్గరెట్ థాచర్ (యు.కె.), సిరిమావో బండారునాయకె (శ్రీలంక), శ్రీమతి ఇందిరాగాంధీ (ఇండియా) వంటి మహిళామణులు ప్రధానమంత్రులుగా తమ ప్రతిభ చూపించిన వారే! అయినా ఆడపిల్లల పై వివక్ష పూర్తిగా తొలగి పోలేదు. సందర్భం వచ్చింది కనుక నాకు దగ్గరి బంధువుల ఆలోచనా విధానం గురించి చెప్పడం సమంజసంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.


తమ్ముడు నివిన్.నల్లి తో ఆన్షి. నల్లి
వాళ్ళు యువ జంట. హైదరాబాద్‌లో నివాసం. భర్త ఉద్యోగి, భార్య నూరుపైసల శాతం గృహిణి. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. మొదటి సంతానం మగ పిల్లాడు. రెండవ సంతానం ఆడపిల్ల. ఇద్దరినీ ప్రేమగా (వాళ్ళ దృష్టిలో) చూస్తారు. కానీ వాళ్ళ చదువు విషయం వచ్చేసరికి, తల్లిదండ్రుల ఆలోచన భిన్నంగా మారిపోయింది. కొడుకుని ఒక మంచి ప్రైవేట్ స్కూల్ చూసి అందులో జాయిన్ చేసారు. కూతురు విషయం వచ్చేసరికి ఒక మామూలు బడిలో చేర్చారు. దానికి తల్లి వ్యాఖ్యానం ఏమిటంటే “ఎంత చదువుకున్నా అమ్మాయి ఎప్పటికైనా నాకులా వంటింటికి పరిమితం కావలసిందే కదా!” అని.
ఇలాంటి మాటలు వింటే ఎవరికైనా ఆశ్చర్యమూ దుఃఖమూ కలగక మానవు. దీనికి భిన్నమైన మరో ఉదాహరణ మీకు వివరిస్తాను.


అక్క-తమ్ముడు (ఆన్షి -నివిన్)
మహబూబాబాద్‌లో నేను పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆయన మంచి విద్యావంతుడు. విద్యాశాఖలో ఉద్యోగి. చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఎందరో పేద విద్యార్థులకు చేయూతనిచ్చి, వారు ఉన్నతస్థాయికి చేరడానికి మార్గదర్శనం చేసిన వ్యక్తి. ఈయన కొడుకు కోసం అయిదుగురు ఆడపిల్లల్ని కన్నాడు. మగపిల్లాడిని కనలేకపోయామని ఆ దంపతులు ఎప్పుడూ బాధ పడలేదు. ఆ ఆడపిల్లలందరినీ ఆణిముత్యాల్లా తయారు చేశారు. అందరూ వివాహాలు చేసుకుని ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారు. ఆయనకు ఇప్పుడు వయసు 90+. కొన్ని కుటుంబాలలో పరిస్థితి ఇలా కూడా ఉంటుంది. ఇక అసలు విషయానికొస్తే, స్వయంగా నాకు ఆడపిల్లలంటే ఇష్టం! అలా అని మగ పిల్లలంటే ఇష్టం ఉండదని కాదు. ఏదో ప్రత్యేకత సహజంగా ఉంటూ వాళ్ళ వైపు మొగ్గు చూపుతుంది. అలా.. నా కూతురంటే నాకు చాలా ఇష్టం. బహుశః సృష్టిలో ప్రతి తండ్రి – కూతురు అనుబంధం ఇలానే ఉంటుందేమో!


తల్లితో తనయుడు (నిహార & నివిన్)
చాలా మంది విషయంలో ఇలానే ఉంటుందని నేను విన్నాను కూడా. అలా 2017 జనవరి 24, న నాకు మనవరాలు పుట్టింది. నా కూతురుకి, అల్లుడికి, మాకూ మహా సంతోషం అయింది. నా కూతురికైతే మొదటి సంతానం ఆడపిల్లే కావాలని కోరుకుంది. అలాగే జరిగింది. ఇంట్లో పండుగ వాతారణం ఏర్పడింది. మనవరాలికి ‘ఆన్షి’ అని పేరుపెట్టాం. మా అమ్మాయి ఉద్యోగం వరంగల్ లోనే (ఇప్పుడు హైదరాబాద్) కావడం వల్ల మనవరాలికి అయిదు సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ వరంగల్‌లో నా దగ్గరే వుండే అవకాశం ఏర్పడింది. ఆ సమయం నా జీవితానికి మహదానంద సమయం. తర్వాత మా అమ్మాయికి హైదరాబాద్‌కు బదిలీ కావడం, అక్కడికి షిఫ్ట్ అయిపోవడం రెండో సంతానానికి అంకురార్పణ ఏర్పడడమూ జరిగిపోయాయి. ఇప్పుడు అసలు చర్చ మొదలైంది. ఈ సారి బాబు పుడతాడా? పాప పుడుతుందా? అని. కొందరు మగ, అని మరికొందరు ఆడపిల్ల అనీ ఊహాగానాలు మొదలు పెట్టారు. డాక్టర్లకు తెలిసినా చెప్పరు కనుక, మా అమ్మాయి అల్లుడూ “ఎవరైనా మాకు ఇష్టమే” అనడం మొదలు పెట్టారు. కొందరు ఖచ్చితంగా మగ పిల్లాడే.. అనడం మొదలు పెట్టారు.


అమ్మ-నాన్న- అక్క తో నివిన్.నల్లి.
నా విషయం వచ్చేసరికి, నేను కూడా ‘మగపిల్లాడు పుడితే బావుణ్ణు!’ అని మనసులో అనుకున్నాన్నాను. తర్వాత ‘నల్లోడు’ (ఇంటి పేరు నల్లి) పుడతాడని నా శ్రీమతి దగ్గర బాహాటంగానే అన్నాను. ఇప్పటి వరకూ ఆడపిల్ల – గొప్పలు చెప్పి ఈయన మగపిల్లాడిని కోరుకుంటున్నా డేమిటి అని పాఠకులు అనుకోవచ్చు. ఆయన విషయం వచ్చేసరికి సమర్థించుకుంటున్నాడని కూడా అనుకోవచ్చు! ఇది సహజమే. కానీ, నేను అనుకున్నది, ఆడపిల్ల అంటే ఇష్టం లేక కాదు. మొదటి సంతానం ఎట్లాగూ ఆడపిల్ల వుంది కాబట్టి, ఈ సారి మగపిల్లాడు అయితే బాగుంటుందని, అందరిలానే నేనూ అలా ఆలోచించాను. అంత మాత్రమే కాదు, మనవడు పుడితే లక్ష రూపాయలు మనవడికి ఇస్తానని మనసులో అనుకున్నాను. ఈ విషయం నా శ్రీమతికి కూడా చెప్పలేదు. మా అమ్మాయి ప్రసవించే వరకూ అది గోప్యంగానే వుంచాను.


తల్లిదండ్రులతో…. బేబి ఆన్షి.నల్లి..
13 జూన్ 2022 ఉదయం 2 గంటలకు నేను ఊహించినట్టుగానే మనవడు పుట్టాడు. ఆనందం అనిపించింది. నాతోపాటు కుటంబ సభ్యులు అందరూ సంతోషించారు. అమ్మాయి ప్రసవించిన మొదటి రోజు ఆసుపత్రిలో అమ్మాయి దగ్గర మొదటిసారి మనవాడి బంపర్ బహుమతి గురించి ప్రకటించాను. సహజంగానే అమ్మాయి చాలా సంతోషించింది.


Baby boy Nivin..Nalli
మరి మనవరాలి సంగతి ఏమిటని కొందరికి సందేహం రావచ్చు. సహజం కూడా! కానీ మనవరాలికి పుట్టినప్పటినుండీ ఇంకా ఎక్కువ చేస్తున్నాను. అవి ఇక్కడ ప్రస్తావించడం అంత మంచిదికాదని నా ఉద్దేశం.


తాతలతో (ప్రసాద్. కానేటి & విజయకుమార్. నల్లి) మనవడు..నివిన్. నల్లి.
ఆడపిల్లలు వున్న ఇల్లు ప్రేమకు, అనురాగాలకూ పుట్టిల్లు. ఆడపిల్ల వున్న ఇల్లు ఆనందాల హరివిల్లు! ఎక్కడో ఒకచోట ఒక కలుపు మొక్క ఉంటుంది, అది ఆడ కావచ్చు, మగ కావచ్చు. అలాగని అందరికీ అది అంట కట్టడం సమంజసం కాదు! ప్రకృతి సిద్ధంగా రేపటి సమాజ నిర్మాణానికి ఆడపిల్ల తప్పని సరి. కుటుంబ సంక్షేమ పరంగా ఇద్దరి పిల్లల వరకూ అనుమతి వుంది కనుక, ఆడ అయినా, మగ అయినా ఇద్దరు పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడంలో తప్పు లేదనుకుంటాను.
ఇంతకీ మా మనవడి పేరు చెప్పనేలేదు కదూ… పుట్టుకతోనే తాత నుండి బంపర్ బహుమతి కొట్టేసిన మనవడి పేరు ‘నివిన్ అయాంశ్ నల్లి’ (NIVIN AAYANSH.NALLI).
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
35 Comments
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక కృతజ్ఞతలు
–డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ జిల్లా.
sagar
మీరు మొదట చెప్పినట్లుగ సంతానం విషయంలో తల్లిని ఆడిపోసుకోవడం చాలా దురదృష్టం సర్. ఆ పద్దతీ నేటికీ కొన్ని ప్రాంతాలలో ఉండడం విచారకరం. మనం ఆశించడంలో తప్పులేదు. అలాగని మనకు ప్రాప్తించిన వరాన్ని అక్కున చేర్చుకోవడమే మన విధి. ఇది నా అభిప్రాయం. ఇక మీ విషయంలో మీరు అనుకున్నట్లుగా జరిగినందుకు మీకు హృథయపుర్వక శుభాకాంక్షలు సర్.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
సాగర్
ధన్యవాదాలు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Good story near to everyone’s true life and congratulations on the occasion of becoming blessed with grand son and
with greatness enjoy 
—-prof.Rama krishnamurthy
USA.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Thank you somuch
Guruji.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Very good explanation between boy and girl
—KJ Srinivas
Hyderabad.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Thank you sir.
Neelima
Doctor garu..
Namaskaramulu..
నేటి సమాజంలో ఆడ – మగ వివక్షత కోసం కళ్ళకి కట్టినట్టు చెప్పారు.
నేను కూడా ఆడపిల్ల పక్షపాతినే.. కానీ మీలా కాకుండా నాకు మగపిల్లలు ఇష్టం ఉండదు.
మాకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. రెండవ సంతానం ఎక్కడ మగపిల్లవాడు పుడతాదేమో అని , ఒక పాప తో ఆపేసాము. ఇపుడు పాప పెళ్లి కూడా అయింది. ఏనాడూ మగపిల్లవాడు లేడన్న ఆలోచన రాలేదు.
ఎలా అయినా ఆడపిల్ల అదృష్టం అంతే..
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
బాగా చెప్పారు
ధన్యవాదాలు మీకు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
జ్ఞాపకాల పందిరి119 లో ఆడపిల్లల పట్ల జరిగే వివక్షను తెలిపారు. స్కానర్ ద్వారా తెలుసుకుని గర్భంలోనే ఆడపిల్లలను మట్టుబెట్టే దుర్మార్గులు నేటికీ ఉన్నారు. చక్కటి కథనము. అభినందనలు.
—జి.శ్రీనివాసాచారి
కాజీపేట
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ
Rajendra+Prasad
While you justified the reasons for the society to favor a girl to a girl, you did not hesitate to point out the foolish belief of people against a girl baby. Good to know you favoured a girl. One should pray God to gift a healthy child whether it be a girl or boy
– Rajendra Prasad
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Thank you prasad garu.
గీతాచార్య
పెద్ద తరం వాళ్ళు వారి జ్ఞాపకాలు, అనుభవాలు భదిరపరచి కింది తరాలకు అందించాలి. అవి కింది తరం వాళ్ళు విలువైనవిగా భావించేలా మధ్యతరం వాళ్ళు ప్రోత్సహించాలి.
Thats how the realities of life generations upon generations will be recorded and a great truth will be uncovered when time comes.
మీరు రాస్తున్న ప్రతి అక్షరం విలువైనదే
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
కృతజ్ఞతలు సర్ మీకు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
మీ మనవడి పరిచయం మీ స్పందన బాగుంది
—కె.విజయ
హైదరాబాద్.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ
పుట్టి. నాగలక్ష్మి
మనదేశంలో అత్యధిక కుచుంబాల పరిస్థితి ఇది. మీ అనుభవాలని,అనుభూతులను చక్కగా వెలువరించారు.స్కానింగ్ దుష్పరిణామాలనీ వివరించారు.ధన్యవాదాలండీ
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
నాగ లక్ష్మీ గారూ
ధన్యవాదాలు మీకు
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Nanasthe sir.
Manumala sanchika chala bagundi.idi chadivina prathi vallu,
Avunu naku anthe.ani anukuntaru.
Ma ammayiki mee ammayi la ge modata kuthuru.
Amma lanti akka ga thammudi ni chakka ga,badhyatha ga chesthundi.
.modata ammayi ayithe,ammaye ayithe intiki oka amma dorinatle.
Idharu ammayilaithe okari ki okaru friends la pedha ayinappudu kasta sukhalu
Panchukodam ki baguntundi.
Anna kani thammudu kani
Unte,nanna dorikinatle.puttillu dorikinatle.
Yevaritho unna anandam
Varitho undi.
—Smt.Sujana panth
Bheemaaram
HANAMKONDA
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Thank you somuch
Madam.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Hearty congratulations doctor garu. Lakshadikaari మనువడు.
—–Surya narayana rao
USA
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Thank you sir.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ఏ బిడ్డయినా ఒడి నిండడం ముఖ్యం అని తెలియచేస్తూ మంచి ఉపోద్ఘాతంతో మిమ్మల్ని ఎంతో ఆనంద పరిచిన విషయాల్ని పంచుకున్నారు సర్.ఆడ బిడ్డయినా మగబిడ్డయినా కావాలని ఆశపడడంలో తప్పు లేదు.పుట్టిన బిడ్డను మనసారా స్వీకరిస్తే కోరుకున్న బిడ్డ కలిగినప్పుడు ఆ ఆనందం మరింత పెరుగుతుంది. మనుమరాలిని ఎంతో ప్రేమిస్తూ మనుమడు కావాలని మీరు కోరుకోవడం సమంజసమే.అది నెరవేరడం ఎంతో ఆనందదాయకం.పుడుతూనే లక్ష విన్ అయిన ని”విన్” ని మనసారా ఆశీర్వదిస్తూ …మీ మురిపెం తీరిన ఈ శుభ సమయం మాకూ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది సర్.శుభాకాంక్షలు. ధన్యవాదాలు




—–నాగజ్యోతి శేఖర్
కాకినాడ.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
చాలా చక్కగా విశ్లేషించారు
ధన్యవాదాలు జ్యోతి.
Bhujanga rao
జ్ఞాపకాల పందిరి 119 లో సమాజంలో జరుగుతున్న లింగ వివక్షత పక్షపాత ధోరణి కళ్ళకు కట్టినట్టు చక్కగా చెప్పారు డాక్టర్ గారు.రేపటి సమాజం కొరకు ఆడపిల్ల తప్పనిసరి, కానీ ఈ రోజుకు కూడా ఆడపిల్ల అంటే నష్టం,కష్టం అనే భావన ఇంకా సమాజంలో కనపడుతున్నది. ఈ భావన తగ్గించటానికి గవర్నమెంట్ ఎన్ని చట్టాలు తెచ్చినా ఇంకా కొనసాగుతుండడం దురదృష్టకరం. ఇందుకు ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సి ఉంది.మీరు మనస్సులో అనుకున్న కోరిక (మనవడు) నెరవేరింది చాలా సంతోషం సర్.మంచి విషయాలు అందిస్తున్న మీకు హృదయ పూర్వక నమస్కారములు
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ప్రతి తల్లిదండ్రి తమకు ఆడపిల్ల అయినా లేదా మగపిల్లవాడైనా సమానమే అని పైకి చెప్పుకుంటున్నప్పటికి ,మన భారతీయ సంప్రదాయం ప్రకారము వంశోద్ధారకుడైన మగ పిల్లవాడికున్న ప్రత్యేకమైన స్థానం ఆడపిల్లతో తీర్చలేనిదిగా కనిపిస్తుంది. ఇది యుగయుగాలుగా, తరతరాలుగా అవలంబిస్తున్న సనాతన సంప్రదాయము. సైన్స్ ,టెక్నాలజీ, నాగరికత ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ దీనికి భిన్నంగా పాటించాలనే ఆలోచన ఇప్పటికీ కలుగలేదు/ కలగబోదు కూడా!
ఆడపిల్ల విషయానికొస్తే పెళ్లయిన తర్వాత తను మరో కుటుంబానికి చెందిన వ్యక్తిగా చూస్తాము. కానీ ఆమె అలా ఎప్పటికీ భావించదు. ఆమె పలకరింపులో ఉన్న ఆప్యాయత, అనురాగము, అవసరమైనప్పుడు దగ్గరగా ఉంటూ అందించే సేవ మహోన్నతమైనవి. దీనికి పూర్తిగా భిన్నమైన మనస్తత్వం గల మగ పిల్లవాడైనా… తల్లిదండ్రుల సంపాదన మరియు వారికి సంక్రమించిన ఇతర సదుపాయాలు మగవాడికే ఎక్కువ చెందేటట్లు చేయడమనే మరో దురాచారాన్ని రూపుమాపగలిగినప్పుడే తమ సంతానానికి సరైన న్యాయం చేకూర్చిన వారవుతాము . ఇద్దరూ సమానమే అని భావించి, దానిని అమలుపరుస్తున్న రచయిత గారు అందించిన తమ జ్ఞాపకంతో కొందరు పాఠకులైనా జత కలుపుదామని కోరుకుంటూ ….
—బి.రామకృష్ణా రెడ్డి
అమెరికా.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
మంచిగా విశ్లేషించారు
ధన్యవాదాలు మీకు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Good story near to everyone’s true life and congratulations on the occasion of becoming blessed with grand son and
with greatness enjoy 
——prof.V.Rama krishna murthy
USA.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you so much Guruji.
డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ కుటుంబం
ఆడపిల్లా….

అమ్మాయి గురించి బాగా చెప్పారు…..
ఆడపిల్లల అగచాట్లు మాత్రం ఎన్ని చట్టలోచ్చిన……
ఏం మార్పు లేకుండా పోతుంది కదా!
మీ మనవడి నివిన్ బంపర్ ఆఫర్
చాలా బరువైన కానుకే సుమా!!
——సరలశ్రీ లిఖిత
సికింద్రాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు.
Sarasi
ఆన్షి మీకొక వరం. ఆమే కాదు ప్రతి ఆడ పిల్ల తల్లిదండ్రులకి వరమే. అందుకే నేను ఆడపిల్ల లందరూ బంగారు తల్లులంటాను. అలాగే నాకు పరిచయం పెరగగానే స్నేహితురాళ్లందరినీ అక్కా అని పిలుస్తాను. ఎంతో ఆత్మీయత కలుగుతుంది నాకు అలా పిలవడంలో. నీకంటే వయసులో చిన్నవారిని అక్కా అని పిలుస్తున్నావేంటీ అని అడుగుతారు కొందరు. నా అక్క లందరూ వయసులో నాకంటే చిన్నవాళ్లే అంటాను నేను. సృష్టి అద్భుతాలలో స్త్రీ ఒకటి. ఏ మగాడూ స్త్రీ రుణం తీర్చుకోలేడు. అది తీరని రుణం.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Super sir
Thank you sarasi garu.