కరిగిన ఆనాటి పంచరంగుల కలలే
బతుకు అసలు రంగు చూపించేది
విరిగిన మన ఆశలనిచ్చెన చెక్కలే
నిత్యజీవనానికి ఊతకర్రగా నిలిచేది
కూలిపోయిన ఊహాసౌధా శకలాలే
వాస్తవ హర్మ్యానికి పునాదిరాళ్లయ్యేది
అడుగడుగున ఎదురయ్యే నిరాశాభూతాలే
బతుకు తెరువు బాటలో భయం పోగొట్టేది
రాలిన కన్నీటి చుక్క లే చెరువులయ్యి
ఎండిన గుండెను తడిపే చెలమలయ్యేది
జీవనగతిలో తగిలిన ఎదురుదెబ్బలే
మన ఎదురీతకి గుండె ధైర్యాన్నిచ్చేది
అంతా మనోళ్లేనన్న భ్రమలు తెగిన దారాలే
మనో స్థైర్యానికి బలమైన అల్లికగా అమరేది
మనుషులు మనసుకు చేసిన గాయాలే
గుండెను గట్టి చేసి ధీరత్వాన్ని నింపేది
జీవనయానంలో అడ్డొచ్చిన ముళ్లకంచెలే
సుతిమెత్తని పాదాలను దృఢ పరిచేది
సుదీర్ఘ సంక్లిష్ట యాత్ర నేర్పిన పాఠాలే
జీవన్ముక్తి దుర్గానికి తిన్నని మెట్లయ్యేది

అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
14 Comments
Lalitha Goteti
True Gouriji
బావుంది
పుట్టి. నాగలక్ష్మి
జీవితంలో మనకి ఎదురయ్యే వ్యతిరేక పరిస్థితులనే గాయాలకి క్రుంగిపోకుండా.. ఎదురీది మన సమర్థతను నిలుపుకోగలిగితే మనం సుమపరిమళమాన్ని ఆస్వాదించవచ్చని కవితాత్మకంగా వెలయించారు గౌరీలక్ష్మి గారు..అభినందనలు మరియు ధన్యవాదాలు..
కొల్లూరి సోమ శంకర్
Wonderful.
Syamalamba
కొల్లూరి సోమ శంకర్
Sanchika is super gauri, its very practical, our life experiences are making us strong, keep going Gauri, pl continue the poems and stories
అనురాధ
కొల్లూరి సోమ శంకర్
P.Krishna Reddy
కొల్లూరి సోమ శంకర్
గాయాలనుండి ఎంతచక్కని పూలు పూయించారు గౌరీలక్ష్మీ గారు.


భ్రమ ఏదో నిజ మేదో చక్కగా చెప్పారు
జి. ప్రమీల
కొల్లూరి సోమ శంకర్
గౌరీలక్ష్మీ గారు ఇలాంటి కవితలు కూడా వ్రాస్తారా?
ఏమో.. …నాకు ఆమె కించిత్ హాస్యాన్ని చిందించే, నిజజీవితానికి దగ్గరగా ఉండే వ్యాసాలు బాగుంటాయి
వి. జయవేణి
Durga pakalapati
చాలా చాలా బాగుంది.ప్రతి వాక్యం అక్షర సత్యం.ధన్యవాదములు
కొల్లూరి సోమ శంకర్
Mallik
కొల్లూరి సోమ శంకర్
కవిత ఎంత,బాగున్నదో




సావిత్రి
కొల్లూరి సోమ శంకర్
గీతావాణి
G.S.lakshmi
అక్షరసత్యాలే అన్నీ..
డా. అమృతలత
నిరాశావాదంలో కూరుకున్న వాళ్లని
ఆశావాదం వైపు మళ్లించే కవిత రాసిన అల్లూరి గౌరీలక్ష్మి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ…
కొల్లూరి సోమ శంకర్
Very nice message. We have to learn lessons for life practically,.not by just seeing others suffer.
శేషమ్మ