సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    శీలా సుభద్రా దేవి

    కథని మొదటినుంచీ చివరివరకూ మంచి టెంపో చకచకా చదివింపజేసింది.చివరలో అదే స్థితిలో ఉండి ఒంటరి స్త్రీ లజీవితం గురించి ఆలోచించే తాను కూడా రహ్మాన్,యశోద మధ్య బంధం ఏమిటి అని తన్నుతాను ప్రశ్నించుకొన్న తర్వాత కూడా ఆ ప్రశ్న వెంటాడుతోంది అని ముగించారు.అది చాలా సహజంగా మానవ మనస్తత్వాన్ని చూపుతోంది.మొదటికథతోనే ఆకట్టుకున్నారు.హృదయపూర్వక అభినందనలు జ్యోతి గారు

  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    రచయిత్రి
    సమీక్షకురాలు
    విమర్శకురాలు జ్యోతిగారు
    తన ఉపన్యాసాలకోసం ఇప్పటివరకూ
    కొన్ని వందల కథలు చదివి వుంటారు.
    అందుచేత తాను రాసిన కథకు అన్ని జాగ్రత లు
    తీసుకునట్టే లెక్క.
    అయితే..పాటకుడిగా నా సందేహం:
    అంత కొద్ది పరిచయం తో ఆమె తన జీవితం గురించి పూసగుచ్చినట్టు చెప్పగలుగు తుందా ?
    కథా నేపధ్యం నవలకు కావలసినంత వస్తువు వుందేమో…అనిపిస్తూంది.
    కథకు ఇంకా మంచి పేరు పెడితే బావుండునే మో. అయినా కథా రచయిత్రి పి.జ్యోతి గారికి
    అభినందనలు,శుబాకాంక్షలు.
    —–డా కె.ఎల్.వి.ప్రసాద్
    సికిందరాబాద్.

  3. 3

    Laxmaiah chekkilla

    స్త్రీ ఈ సమాజం లో ఎదుర్కొనే మానసిక బాధ ను, మీ బాధను మనసును ద్రవింప చేసింది.మీకు అభినందనలు

  4. 4

    Janaki devi

    ఒంటరి స్త్రీ ఆవేదన అర్థం చేసుకుంటూ మళ్ళీ రెహ్మాన్ తో సంబంధం ఏమిటి అనడం ఒక సగటుమనిషి ఆలోచనలా ఉంది.. మొదటి కథ అయినా అద్భుతంగా ఉంది..

  5. 5

    Konduri Kasi visveswara rao

    Yendukukani kadhani baaga saagindi. Maanava sambhandhalalo konni ardham kaavu. Abhinandanalu.
    …. Konduri Kasivisveswara Rao

  6. 6

    Jhansi koppisetty

    తొలి కథ అయినప్పటికీ పూర్తి పరిణితితో చాలా బాగా రాసారు. మంచి ఉత్కంఠతో చదివించారు. బహూశా ముగింపు మీ మనస్తత్వాన్ని ప్రతిఫలిస్తుందేమో…

    ఏమో మీ స్థానంలో నేనుంటే రెహ్మాన్ తో యశోద సంబంధం గురించి అంతగా ఆలోచించే దాన్ని కాదు…. ఎందుకంటే యశోద లాంటి స్త్రీలతో నాకు పరిచయం వుంది…ఆ కోణంలో ఎప్పుడూ బుర్ర బద్దలు కొట్టుకోలేదు నేను. I think it all depends on one’s perception.

  7. 7

    సిహెచ్. సుశీల

    ఇది కథ కాదు, ముగింపు అలా ఉండాలి ఇలా ఉండాలి అని నిర్ణయించడానికి. ఎందరి జీవితాలు వెనకనో ఉన్న విషాదాలు. సమాజపు “పవిత్ర” మైన పోకడలు. మనుషుల వికృతపు ఆలోచనలు. అదే సమయంలో – యశోద లాంటి ధీర వనితల సముచిత నిర్ణయాలు. రెహ్మాన్ లాంటి ఉన్నత వ్యక్తిత్వాలు. పిల్లలు ముగ్గురు అర్ధం చేసుకొంటే చాలదూ! ప్రపంచం మొత్తం ‘సర్టిఫికేట్’ ఇవ్వాలా!! “బంధం” అనే పదం తెలీని వాళ్ళు
    కి, అపరిపక్వ ప్రేమల గురించి రాసేవాళ్ళకి, ఆలోచించే వాళ్ళకి యశోద- రెహ్మాన్ మధ్య ఏముందో ఎప్పటికీ అర్ధం కాదు. ఇక్కడ రచయిత్రి ” ఏముంది” అని ఆలోచనలో మళ్ళీ పడిందంటే…. ఆమె ఒక్క జ్యోతి కాదు – నాలాంటి, మనలాంటి, సమాజంలో ఎందరి లాంటి వారికో ప్రతీక. అందుకే ఒక సగటు మనిషి కుండే ( పనికి మాలిన) సహజమైన ఆసక్తి కనబరిచింది. ఇది కదా మంచి కథ అంటే! ఈ ఆదివారం ఆంధ్రజ్యోతి లో రామిరెడ్డి గారి కథ కూడా కొద్దిగా ఇలాంటి కథాంశమే. అయితే ” స్నేహం” అని వాచ్యంగా చెప్పబడింది. జ్యోతి గారి కథ అవాచ్యంగా పాఠకులకు, సమాజానికి ఒక ప్రశ్న ను, ఆలోచనను వదిలివేసింది. జ్యోతి గారికి అభినందనలు.

  8. 8

    గీతాంజలి

    ఒక హంతకుడు అయి ఉండీ అనివార్యంగా తన మీద పడిన యశోద కుటుంబాన్ని అతను ఏ ప్రశ్నలు వేయకుండా చివరిదాకా నిర్వహించడం గొప్ప మానవీయ లక్షణం. హంతకుడి హృదయంలో ఏ రక్తసంబంధము లేని మనుషులపై అంత ప్రేమ ఎందుకు..ఏమైనా స్వార్థం ఉందా? కానీ యశోద స్థానంలో ఇంకో నిస్సహాయ తులసో…నూరున్నీసా నో ఉన్నా రెహ్మాన్ అలానే స్పందించేవాడు.ఎందుకంటే అది అతగాడి వ్యక్తిత్వం.అంతే..కొందరలాగే ఉంటారు..ప్రకృతంత సహజంగా. సమాజంతో..అందులోని మనుషులతో ఉండే సంబంధాల్ని ఆయనలోని ఆంతరంగిక వ్యక్తిత్వ సౌరభంలోనుంచే అర్థం చేసుకోవాలి.ఒంటరి స్త్రీల నుంచి ఏ వ్యక్తిగత లాభం ఆశించకుండా..ఎన్ని నిందలు ఇటు స్వంత కుటుంబం నుంచీ..సమాజం నుంచీ వచ్చినా భరిస్తూ సహయం చేస్తూ ఉండిపోయే రెహేమాన్ లాంటి పురుషులు నాకు తెలుసు. వారిద్దరి మధ్య ఏ సంబంధం అంతగట్టటానికైనా ఈ సమాజం ఎటూ ఉంది.అసలు క్రమ ..అక్రమ సంబంధాలను ఏ సమీకరణాలతో నిర్వచించగలమని ? ఒక హింస తప్ప ప్రేమ.. బాధ్యత లేని భర్తలతో చేసే కాపురాల్లో అక్రమత్వాన్ని అనుభూతి చెందే భార్యలు ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారు.అదే క్రమ సంబంధమని నిర్వచిం చే ఫ్యూడల్ వ్యవస్థ మనది.ఎంతో మానవీయంగా సాగిపోతున్న రెహ్మాన్-యశోదల మధ్య సంబంధపు రంగుని ఎంత తలలు పగల గొట్టుకున్నా నలుపుగానే కనపడే మనుషులకి ఆ సంబంధ సౌందర్యం అర్థమే కాదు. రెహేమాన్-యశోదల మధ్య ప్రేమ చిగర్చినా అది అత్యంత సహజమైంది..అందమైంది..తప్పు కానిదీ కూడా అవుతుంది. కథా నాయకి కె కాదు ఈ విషయంలో ప్రశ్నలమీద ప్రశ్నలు వేసుకుంటూ ఎవరికి తోచిన సమాధానాలు వాళ్ళు ఇచ్చుకుంటు సంతృప్తి పడుతున్న ఆ ఊరి జనానికి చాలా మెల్లిగా అయినా…ఈ .ఏమిటి??ఎందుకు?? అనే ప్రశ్నలకు
    సమాధానం దొరికే తీరుతుంది.బహుశ యశోద భర్తకి కూడా..! మనసుకు ఎంత దూరమైనవాడో..పరాయివాడో అయిన భర్త అనే ఆ మనిషి దగ్గర యశోద తన హోటల్లో తిన్నందుకు డబ్బులు తీసుకుంటుంది.యశోదని అతని దగ్గర డబ్బు ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగిన ప్రశ్నకి ..అతను నా కస్టమర్ మాత్రమే అని చెప్పేదేమో…యశోద.కానీ ఆమెకి సమయం దొరకలేదు.అదే యశోదకి.. ఆమె భర్తకీ మధ్య ఉన్న సంబంధం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!