భలేగుంది ఆడుకుందామని భ్రమ పడి పరిగెత్తకు అబ్బో బోలెడు నిచ్చెనలని సంబర పడిపోకు ఏ నిచ్చెన ఎపుడే పాముగా మారి మెలికలు తిరుగుతుందో ఈ పాము పటంలో ఎవరికీ తెలియదు
చూసిందంతా పచ్చని గరికే అనుకోకు ఏ పూల మొక్క దాపున ఏ ఊబి ఉంటుందో ఏ గుంటలు తీసి నక్కి ఎవరు దాగుంటారో తెలియదు అంతా నాకిష్టమైన వారే అంతా నన్ను ప్రేమించేవారే అని నమ్మి అసలే పరిగెత్తి పోకు ఉన్నట్టుండి నీవెవరో తెలీనట్టే వెళ్లిపోతారు ఈ లోకంతో జాగ్రత్త చిన్నా
అన్ని నవ్వులూ కూడా నిజమనుకోకు చాచిన ప్రతి చెయ్యీ నీకు ఆసరా ఇస్తుందనీ అనుకోకు చిన్నా నవ్వుతూనే విషాన్ని చిమ్మే నోళ్ళుంటాయి ఉన్నట్టుండి వేళ్ళు ముళ్ళ కత్తులై పోతాయి ఇంకొన్ని చేతులు అందుకునే లోపే మాయమూ అయిపోతాయి ‘అయ్యో అందుకున్నావనుకున్నానే’ అని పరిహసిస్తూ జాలీ నటించబోతాయి భలే మర్యాదస్థులున్న చిత్రమైన లోకం చిన్నా ఇది
అయితే ఇక ఇంతేనా ఈ లోకమని నిరాశా పడకు నీ నీడై మసిలే దేవతలూ ఉంటారు నీ ప్రాణమై నిలిచే ఆప్తులూ ఉంటారు కన్ను తెరిచి చూసుకో కపటమేదో తెలుసుకో ప్రతిమాట వెనకా దాగిన పరమార్థం గ్రహించుకో
విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. పాశ్చాత్య రచయితలను పరిచయం చేస్తూ ‘ పడమటి రాగం’ ఆనే వ్యాస సంపుటిని, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. ‘ ద స్పారో అండ్ ద కానన్’ అనే ఆంగ్ల కవితల సంపుటిని 2021 లో ప్రచురించిన డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ‘పైనాపిల్ జామ్’ (2023) ఈయన మొదటి కథా సంపుటి. డా. కోగంటి విజయబాబు ప్రస్తుతం కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. drvijaykoganti2@gmail.com 8309596606
You must be logged in to post a comment.
తెలుగుపూల తోట – జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ జాతీయ స్థాయి కవితల పోటీ ప్రకటన
మారందాయి మహాశ్వేతాదేవి
జీవాయుధాల ప్రయోగం ప్రమాదం ఈనాటిది కాదు
‘స్మరించుకుందాం’ పుస్తకావిష్కరణ సభ – నివేదిక
వర్ణించనలవి కాని అనుభూతి కొడైకెనాల్
ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-25
బొమ్మల ఊరు
మా వదిన వ్యాపార రహస్యాలు
అది అపురూపబంధం!
ఇల్లు సీక్వెల్ పోయెమ్ – వంటింట్లో ఆమె కథల పుస్తకం!
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®