కొన్ని సమయాలు దుఃఖాన్ని వర్షిస్తూనే ఉంటాయి
మౌనం, పొగమంచులా మనసు చుట్టూ కప్పుకునే ఉంటుంది
బాధ, గుండెలోంచి గొంతులోకి అటునుంచి కళ్ళలోకి ఆపై మళ్ళీ గుండెలోకి అలా అలా అంతులేని చక్కర్లు కొడుతూనే ఉంటుంది
బేలతనం, బింకాన్ని చాటుచేసుకుని ముఖంలో తొంగిచూస్తుంటుంది
జ్ఞాపకాలు, పాతవేవో కొత్తవేవో తెలియకుండా ఒకటి తరువాత మరొకటి వచ్చి పరికించి పలుకరించి వెళుతుంటాయి
విషాదం, అందేంత దూరంలో కూచుని విచిత్రంగా విసుగ్గా గమనిస్తూ ఉంటుంది
విరక్తి, మెల్లమెల్లగా దగ్గరకు వచ్చి అంతా తాత్కాలికమే అని చెబుతూ అనునయింపుల జ్ఞానబోధ చేస్తూంటుంది
ఒంటరితనం, అన్నింటిపై అజమాయిషీ చేస్తూ సమూహంలో కూడా ఏకాంతాన్ని ఏర్పాటు చేస్తూ వర్షిస్తున్న దుఃఖంలో తడిసిపొమ్మంటుంది
ఇది నిజం అవును ఇదే నిజం కాలం కదిలినట్లు కనిపించనంతకాలం ఆ కాలం ముందుకు కదిలిందా కదిలినట్లు అనిపించడం మొదలైందా ముందు కొంతా, ఆ తర్వాత అంతా అంతా అంతా మామూలే
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
చాలా హృద్యంగావుంది.
ధన్యవాదాలు మీ సహృదయ స్పందనకు
Prathi manasulo vunna bhavodvegalanu kluptanga vivarincharu kallaki addhinattu varnincharu..🙏🙏
నీ స్పందన కూడా ఓ కవితలానే ఉంది సుచరితా. స్పందన తెలియజేసి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు
నూతన నిర్వచనాలా…కవి భావం ఏమిటో!
దుఃఖం అనుభవంలోకి వచ్చినపుడు మనిషిలో కలిగే ఉద్వేగాలు వాటి వెన్నంటి ఉండే భావపరంపర. మీకు నా భావం అర్థం చేయించలేకపోయినందుకు మన్నించగలరు.
So much truth in your wonderful and touching words Sridhar Garu Chaalaa baavundi
ధన్యవాదాలు నర్మదా. నేను బాలుగారి మరణాన్ని ఈ రీతిగానే ఇన్ని భావోద్వేగాలతోనే భావించాను. అనుభవించాను. ఓరోజంతా నాచుట్టూ మౌనం రాజ్యమేలింది. నేను పేర్కొన్నవన్నీ నా అనుభవంలోకి వచ్చినవే. ఆఖరి చరణమే నిత్యసత్యాన్ని తెలుపడం కోసం రాసాను. అంతే.
చాలా బాగుంది సార్ చదువుతున్నంత సేపు ఇవన్నీ నాకు కూడా కలిగిన, కలుగుతున్న అనుభవాలే అన్నట్లుగా అనుభూతి పొందాను.
ఒంటరి విషాదంలో బేలగా బాధ పడే వారికి, శ్రీ ధర మౌన కాల జ్ఞాపకాల అక్షర రూప ఓదార్పు.
మీ అనుభవంలోకి వచ్చిన విషయం కవితలో పొందు పరిచారు. మనోవల్మీకంలోని అనిశ్చితి కనబడుతోంది. ముగింపు మరింత నిర్దుష్టంగా భావస్పోరకం గా వుండాల్సింది.
శ్రీధరా! కవిత అంతా చాలా బావుంది…చివర్లోనే నా మట్టిబర్రకి అర్థం కాలేదు.
You must be logged in to post a comment.
మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-13
దంతవైద్య లహరి-28
నడిచే చెట్లు
పూచే పూల లోన-93
కొరియానం – A Journey Through Korean Cinema-16
అద్వైత్ ఇండియా-5
కైంకర్యము-33
ఓ అపప్రథని చెరిపివేయాలనే నవల ‘లోహముద్ర’
పొన్న చెట్టు కొమ్మమీద
వెడ్ షూట్స్
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®