

‘సినిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- ఎన్.టి.ఆర్. దర్శకత్వంలో, ఎన్.టి.ఆర్., బాలకృష్ణ,, దీప నటించిన ‘అక్బర్ సలీం అనార్కలి’ (1979) చిత్రంలో తాన్సేన్ పాత్ర పోషించినదెవరు?
- కె. విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్, తాళ్ళూరి రామేశ్వరి (పరిచయం), శ్రీధర్, తులసి నటించిన ‘సీతామాలక్ష్మి’ (1978) చిత్రంలో రైల్వే స్టేషన్ మాస్టర్‌గా నటించినదెవరు?
- కె. బాపయ్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జయప్రద, చంద్రమోహన్, మాధవి తదితరులు నటించిన ‘యుగపురుషుడు’ (1978) చిత్రంలో ఒక పాటలో (ఎంత వింత లేత వయసు) ఎన్.టి.ఆర్.తో డాన్స్ చేసిన బొంబాయి నటి ఎవరు?
- విజయనిర్మల దర్శకత్వంలో అక్కినేని, కృష్ణ, సత్యనారాయణ, జరీనా వహాబ్, గుమ్మడి, విజయనిర్మల నటించిన ‘హేమాహేమీలు’ (1979) చిత్రంలో బ్లాక్ క్యాట్ పాత్రధారి ఎవరు?
- కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., వాణిశ్రీ, రావుగోపాలరావు, సత్యనారాయణ, అంజలీదేవి, మోహన్ బాబు తదితరులు నటించిన ‘సింహబలుడు’ (1978) చిత్రంలో రాణి రణచండి పాత్రలో నటించినదెవరు?
- వి. మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని, వాణిశ్రీ, జయసుధ నటించిన ‘విచిత్ర జీవితం’ (1978) ఓ హిందీ సినిమాకి రీమేక్. థామస్ హార్డీ రాసిన ‘The Mayor of Casterbridge’ నవల ఆధారంగా 1973లో హిందీలో వచ్చిన ఆ సినిమా పేరేమిటి?
- పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో కృష్ణ, చిరంజీవి, జయప్రద, మోహన్ బాబు నటించిన ‘కొత్త అల్లుడు’ (1979) చిత్రంలో ‘నటుని’ పాత్ర వేసినదెవరు?
- చిరంజీవి, రోజా రమణి, సావిత్రి, నరసింహరాజు, కవిత నటించిన ‘పునాదిరాళ్ళు’ (1979) చిత్రంలో ‘సర్పంచ్ రఘురామయ్య’ పాత్ర పోషించి ఉత్తమ నటుడిగా నంది అవార్డు పొందినదెవరు?
- ఎన్.టి.ఆర్. దర్శకత్వంలో, ఎన్.టి.ఆర్., జయప్రద, జయసుధ జయచిత్ర, బాలకృష్ణ, ధూళిపాళ నటించిన ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’ (1979) చిత్రంలో వకుళ దేవి పాత్ర పోషించినదెవరు?
- కె. కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణంరాజు, వాణిశ్రీ, రామకృష్ణ, సత్యనారాయణ తదితరులు నటించిన ‘శ్రీ వినాయక విజయం’ (1979) చిత్రంలో వినాయకుడి పాత్రలో నటించినదెవరు?
~
ఈ ప్రశ్నలకు జవాబులను 2025 మార్చ్ 04వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సినిమా క్విజ్ 130 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2025 మార్చ్ 09 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 128 జవాబులు:
1.జమున 2. పి.ఎల్. నారాయణ 3. చలిచీమలు 4. పింగళి నాగేంద్ర రావు 5. అమరదీపం 6. శంకర్ 7. నేషనల్ ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు 8. గుమ్మడి 9. శోభన్‌బాబు, రామకృష్ణ 10. ఎస్. రాజేశ్వరరావు, టి. చలపతిరావు
సినిమా క్విజ్ 128 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- మంజుల దత్త కె., ఆదోని
- పి.వి.రాజు, హైదరాబాదు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- సునీతాప్రకాష్, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/ టెక్సాస్
- వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.
- ఈ సినిమా క్విజ్కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
~
ఈ సినిమా క్విజ్ ఫీచర్ ఈ వారంతో ముగుస్తోంది. శీర్షిక నిర్వహించిన శ్రీ సొంసాళె శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు.
క్విజ్‌లో పాల్గొని శీర్షికని ఆదరించిన సంచిక పాఠకులకు ధన్యవాదాలు.
వచ్చే రెండు వారాలు కేవలం గత క్విజ్‌ల తాలూకు జవాబులు మాత్రమే వెలువడతాయి.
