సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య:*ఎప్పుడైతే మనిషి, తన మెదడును సహజంగా యాక్టివేట్ చేసే పని పక్కన పెట్టీ, ఒళ్ళు వంచి శ్రమ చేసే పనులు మూట కట్టి పడేసి, కష్టపడకుండా ఫలితాలు వచ్చే కృత్రిమ మేధకు బానిస అయ్యాడో అప్పుడే, భరిస్తూ నిలుపుకోవాల్సిన బంధాలు మాయమయ్యాయి. మనిషికి అనుభూతులుగా మిగలాల్సిన జ్ఞాపకాలు ఆవిరైపోయాయి. చాట్ జిపిటీలు, గ్రోక్‍లు, పెర్ప్లెక్సిటి, జెమినై మొదలైనవి మనిషి అప్లోడ్ చేసిన సమాచారాన్ని ఇస్తాయి తప్ప వాటంతట అవి కొత్తగా కనుక్కున్న సమాచారం ఇవ్వవు.
    ఇప్పటికే మనిషి మెదడులో ఎలెక్ట్రానిక్ చిప్‌లు పెట్టడం, ఒక మనిషి జ్ఞాపకాలు, మరో మనిషి మెదడులో ప్రవేశపెట్టడం వంటివి జరుగుతున్నప్పుడు, ఇక “human brain emulation” జరిగే సమయం కూడా ఎక్కువ దూరంలో లేదు అని వాదించే వారు లేకపోలేదు.
    డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి “చివరి పరీక్ష” లో, కృత్రిమ మేధ ద్వారా మరో మనిషిని సృష్టించడం అసాధ్యం అని, మనిషి ఆధునిక టెక్నాలజీ ప్రపంచంలో బ్రతుకుతున్నా మనషి మనసు మాత్రం భావోద్వేగాల అనుబంధాలకు కట్టుబడే ఉంటుంది అని తెలియచెప్పారు.
    రామానుజం, వర్చువల్ రియాలిటీ నగరంలో, అందులో కృత్రిమ మేధ ద్వారా సృష్టించబడిన “కాపీ రమేష్”తో, పోటీపడి పరీక్ష రాయవలసి రావడం ఆ పరీక్షలో తను ఫెయిల్ అవడం, తరువాత అది కల అని తెలుసుకుని ఊపిరి పీల్చుకుని, అనుబంధాల టెక్నాలజీ అనే పుస్తక రాయాలని సంకల్పించుకోవడం బావుంది.
    అయితే, కథ ఎత్తుగడ లో స్పష్టత లేదు. మెదడు బ్యాకప్ ప్రయోగం ఎవరు చేయాలి అనుకున్నారు? మానవ మెదడును డిజిటల్ కాపీ చేసి సేవ్ చేయడం మెదడు బ్యాకప్ అని అంటారు అని చెప్పారు రచయిత్రి. మరి డిజిటల్ కాపీ సేవ్ చేస్తే, రామానుజం పుస్తకాలు ఎలా రాస్తాడు? వర్చువల్ రియాలిటీ నగరం అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? ఎటువంటి ఆధునికమైన టెక్నాలజీ ఉంటుంది? వాళ్ళు అంటే ఈ ప్రయోగం చేయాలి అనుకుని రామానుజాన్ని కలిసిన వారు , చెప్పారా ఇక్కడ వయసు పెరగదు అని? అసలు ఈ ప్రయోగమే డిజిటల్/ఆర్టిఫీషియల్/మైండ్ కాపీ అయినప్పుడు దాంట్లో మళ్ళీ అసలు, నకిలీ ఏమిటి? ఏమి పరీక్ష పెట్టారు? రామానుజం రాయలేకపోయిన పరీక్ష ఏమిటి? “చివరి పరీక్ష” అంటే మొదటి పరీక్ష నే చివరి పరీక్షనా?
    రామానుజం కృత్రిమ మేధ వలన ఈ మనిషి మెదడును స్కాన్ చేసే పద్ధతే వద్దు అని బలంగా అనుకోవడానికి మరి కొంచెం కథ విస్తృతి పెరిగి ఉంటే బావుండేది.
    కథ scifi genre అయినప్పుడు రామానుజానికి వచ్చింది కల అని మొదట్లోనే తుంచేయలుండా, అలాగే కంటిన్యూ చేసి, mind scanning వలన జరిగే అనర్థాలు, నష్టాలు చూపించి, అప్పుడు రామానుజం, మనవడికి ఇలా జరుగుతుంది అని వివరించినట్లు ఉంటే కథకు సంపూర్ణత చేకూరేది.
    టెక్నాలజీ అభివృద్ధి చెందడం తప్పు కాదు.కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం తప్పు కాదు. కానీ, టెక్నాలజీ ఎంత అభివృద్ధి అయినా.. అందునా ఇప్పుడు ప్రజలు ఆధారపడుతున్న, ఈ కృత్రిమ మేధ, ఒక తాతగారి జీవితానుభవ పాఠాలకు, ఒక వైద్యుడికి, కష్టకాలంలో భుజాన్ని కాచే స్నేహితుడికి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం కాదు. కానేరదు అని తెలుసుకోలేక పోవడం తప్పు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!