సంచికలో తాజాగా

Related Articles

24 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి గారి వ్యాఖ్య: *నమస్తే డాక్టర్ గారు. మీరు రాసిన భిన్న స్వరాలు కథ ఇప్పుడే చదివాను. కొత్త కథాంశంతో విభిన్నమైన రచన. ఆద్యంతం ఆసక్తికరంగా వుంది. బహుమతి పొందగలిగే స్థాయిలో ఉన్న కథను అందించిన మీకు హృదయపూర్వక అభినందనలు 💐💐*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సురేఖ పులి గారి వ్యాఖ్య: *కథ చదివాను. కథ వరకు బాగుంది కానీ వాస్తవానికి రెండు తలల పిల్లలతో పేరెంట్స్ పడే పాట్లు, వారికి అయ్యే ఖర్చు too much. ఈ జెనెటిక్ problem రాకుండా ఏదో మార్గం కనిపెట్టాలి. Or else the mother can abort at the primary stage instead of delivering the baby. (I feel).*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుమలత కైకాల గారి వ్యాఖ్య: *భిన్న స్వరాలు మాములు కథలకు భిన్నంగా ఉంది. ఎక్కడో అరుదుగా చూసే రెండు తలల వ్యక్తులను బంధించి పెంచడం వల్ల వారిలో క్రౌర్యం ఏర్పడింది. దాని వల్ల కావేరి పరిస్థితి దారుణంగా మారిపోయింది. శశిధర్ మంచివాడు కావడంతో ఆమెకు కొత్త జీవితం ప్రసాదించాడు. చరిత్ర పునరావృతం జరిగి కావేరి కొడుకు దుష్యంతుడుకి మళ్ళీ రెండు తలల కొడుకు పుడతాడు. బాబును ప్రేమతో మంచి లక్షణకతోపెంచాలని తల్లీ కొడుకులు నిర్ణయించుకోవడంతో కథ ముగుస్తుంది. సైన్స్ పురోగమిస్తున్న రోజులలో నవీన కథలకు శ్రీకారం చుట్టిన శ్రీదేవి శ్రీకాంత్ గారికి హృదయ పూర్వకమైన అభినందనలు 🌹💐🙏*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మొండెపు ప్రసాద్ గారి వ్యాఖ్య: *చాలా బాగుంది. అభినందనలు శ్రీదేవి గారు 👏
    Thanks for sharing.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    This a comment by Dr. Sudhakara Rao: *Beautiful story thallee! excellent theme and diction!! Prof Dr. Sudhakara Rao Vadlakonda, USA.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాళ్ళబండి దుర్గా నాగేశ్వర రావు గారి వ్యాఖ్య: * మీరు వ్రాసిన భిన్న స్వరాలు కథ చాలా భావాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పరిస్థితులకు అద్దం పట్టింది. మీ కథ చదవగానే తెలంగాణకు చెందిన కాన్ ట్విన్స్ వీణ, వాణిల జీవితాలు వాళ్ళ ఇద్దరి విజయాలు, మనో ధైర్యం, పట్టుదల గుర్తుకు వచ్చాయి.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విష్ణుభట్ల సుగుణ గారి వ్యాఖ్య: *కథ చాలా బాగుంది. పౌరాణిక ఉదాహరణలతో పోల్చి చూపించారు.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ.సాయి ప్రసాద్ గారి వ్యాఖ్య: భిన్న స్వరాలు కథ చదివాను. కొత్త వస్తువు. సరి కొత్త కథనం. బాగుంది.కథలో పేర్కొన్న అబ్బి బ్రిట్నీ లు అమ్మాయిలు. రొనాల్డ లీ డొనాల్డ లీ గేలాన్లు అబ్బాయిలు. ఈ పేర్లు ఇచ్చి ఉండాలి. వీరు 65 సంవత్సరాలు జీవించారు. ఇలాంటి కవలలకు ఒకే జననేంద్రియం ఉంటుంది. కలయికకు ఇద్దరూ వొప్పుకోవాలి. ఒకరు కలిసినా ఇంకొరు ఆ అనుభూతిని పొందుతారు. అబ్బీ పెండ్లి ‌చేసుకొంది. తల్లి అయింది. అబ్బి ప్రసవవేదన ను బ్రిట్నీ కూడా అనుభవించిందో లేదో తెలియదు. ప్రొ. సాయి ప్రసాద్.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తులసి బాల కృష్ణ గారి వ్యాఖ్య: *కథ ఒక ప్రత్యేక రకమైన వ్యక్తులకు సంబంధించిన సబ్జెక్టుతో బాగుంది మేడం. 👍 కాని, కాల పరిమితి, సంఘటనలు, పాత్రలు ఎక్కువగా ఉన్న కారణంగా నవలకు సరిపోయే ఇతివృత్తాన్ని కథకు కుదించిన లక్షణాలు మాత్రం కలిగి వుంది. ఇదీనా అభిప్రాయం.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భువన చంద్ర గారి వ్యాఖ్య: *డా. శ్రీదేవీ శ్రీకాంత్ గారు, మీరు వ్రాసే కథలు చాలా వినూత్నంగా ఉంటాయి. ఆసక్తిని కలిగిస్తాయి. కథలో తెలియని విషయాలతో పాటు చక్కని మెసేజ్ ఉంటుంది. అందుకే మీరు వ్రాసే కథలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కథ చాలా ఆసక్తితో కూడి, భిన్న స్వరాల్లో భిన్న వ్యక్తిత్వాలు కలిగి చాలా కుతూహలంగా ఉంది. మీరు ఇలాంటి కథలెన్నో వ్రాయాలి. ఆశీర్వచనాలు. మీ భువన చంద్ర.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విరించి గారి వ్యాఖ్య: *ఈ కథ మనసును వేధించే వాస్తవాలను, మనసును తడిమే మానవ విలువలను అపూర్వంగా మిళితం చేసిన హృదయభరిత గాథ. గ్రామీణ జీవితంలోని అణచివేత, అన్యాయం, మహిళలపై జరిగే దుర్వ్యవహారం వంటి కఠిన నిజాలను బలంగా పలికించిన ఈ కథ, మరోవైపు ప్రేమ, దయ, మానవత్వం, ఆత్మవిశ్వాసం వంటి వెలుగులను అద్భుతంగా ప్రతిబింబించింది.
    కావేరి జీవితం అనాథగా మొదలై బానిసత్వంలో సాగి, అమానుష పెళ్లి బంధంలో చిక్కుకుని, చివరకు స్వయం శక్తితో ఎదిగిన మహానటి మధుమాలినిగా పునర్జన్మ పొందడం ఒక మహిళ విజయం అనే శాశ్వత సత్యాన్ని తెలియజేస్తుంది.
    అమ్మ ప్రేమ, మానవత్వం, సమాజ ధర్మం, అసాధారణ జననాలలోనూ దాగిన దైవత్వం – ఇవన్నీ కథ చివర్లో చూపిన సందేశం హృదయాన్ని హత్తుతుంది. శారీరక వైకల్యం కాదు, మనసులోని విలువలే మనిషిని అద్భుతంగా మార్చుతాయని చెప్పిన తీరు అద్భుతం. మొత్తం గా “భిన్నస్వరాలు” ఒక భావోద్వేగ ప్రవాహం.
    బాధ నుండి బలం వైపు, చీకటి నుండి వెలుగువైపు, అన్యాయం నుండి ఆత్మవిశ్వాసపు విజయంవైపు తీసుకెళ్లే ప్రయాణం. ఎప్పటిలాగే డా. శ్రీదేవి శ్రీకాంత్ గారు మూస కథలకు భిన్నమైన కథాంశంతో కథను నడిపించారు. డాక్టర్ గారికి అభినందనలు. 🎉*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విజయలక్ష్మి మావూరి గారి స్పందన: *కథ చాలా కొత్తగా ఉంది శ్రీదేవి గారు. రొటీన్ కథలకి పూర్తి భిన్నంగా ఉంది. జనరల్ గా ఇలాంటి టాపిక్ అంటే ఒక శరీరం రెండు తలలుగా పుట్టినవారి సమస్యలతో కొన్ని కథలు చదివాం. కానీ ఈ కథ వాడికి భిన్నంగా ఉంది. చాలా బాగుంది.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీనివాస్ మంత్రిప్రగడ గారి వ్యాఖ్య: *శ్రీదేవి మేడం గారికి నమస్కారములు.. మీ కథ చదివాను వినూత్న కథాంశంతో ఉంది. రెండు తలల రూపం అసాధారణ సృష్టి కి అక్షర రూపం ఇచ్చారు. ఆసక్తికరంగా ఏకబిగిన కథ చదివించింది. కావేరి పాత్ర హృదయ విదారకంగా ఉంది. శశిధర్ పాత్ర చాలా ఔన్నత్యంతో కూడుకున్నది. శశిధర్ లాంటివాళ్ళు సమాజానికి అనివార్యం అని ఆలోచింపజేశారు. దేవుళ్ళ మల్టిపుల్ తలల దృశ్యాలను దృష్టిలో ఉంచుకుని, వాస్తవ జీవితంలో కొందరికి జరిగే అసాధారణ సృష్టి జన్మ ను ప్రతిబింబిస్తూ… రెండు తలల శరత్, చంద్ర రూపాలను పాఠకులకు కళ్ళ ముందు ఉంచారు.
    కానీ నాకు ఇక్కడో సందేహం కలిగింది. చంద్ర కావేరిని కామంతో అనుభవిస్తుంటే… ఒకే శరీరం గల శరత్ ఏ విధంగా ఆ సంఘర్షణ నుంచి విడిపించే ప్రయత్నం చేయగలడు..? రెండు తలలు ఉన్నాయి గాని నాలుగు చేతులు లేవు కదా..? ఇక్కడ శరత్ ప్రతిచర్య కాకుండా…అతని మనసు ఆ విధంగా ఆలోచించింది అంటే బాగుండేదేమో..!
    ఇటువంటి అసాధారణ సృష్టికి కొందరి దేవుళ్ళ రూపాలను ఉదాహరణగా తీసుకోవడం సహజత్వాన్ని ఇచ్చింది.
    చివరకు దుష్యంత్ భార్య శకుంతల సంతానం కూడా ఈ విధంగానే ఉండటం మధుమాలినిగా మారిన కావేరి తన గత చేదు అనుభవాలను వీడి ఈ రూపాలకు మంచిని తీర్చిదిద్దే క్రమాన్ని సంకల్పించడం కథలో ముగింపుగా మంచి పరిణామం.. మీరు డాక్టర్ గా శాస్త్రీయంగా రెండు తలల సృష్టిని పాఠకుల మస్తిష్కాలకు అరుదైన అనుభూతిని కలిగించారు.. ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్.. ప్రఖ్యాత రచయిత్రిగా పూర్తిస్థాయిలో వాస్తవానికి.. కాల్పనికానికి న్యాయం చేసిన మీకు హృదయపూర్వక అభినందనలు🙏🙏
    కాకపోతే ఈ కథకు, “భిన్నస్వరాలు” శీర్షిక కాకుండా ఇంకోటి ఉంటే బాగుండేదేమో..” సవిద్రూపం”.. చూడండి బాగుంటుందేమో.. అంటే మంచి చెడుల వికృత రూపం అనే అర్థంలో వస్తుందేమో..!? కొత్త పద ప్రయోగం చేశాను.. అక్షర హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేశానేమో..?!! క్షమించండి🙏🙏🙏 శ్రీనివాస్ మంత్రిప్రగడ*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుజిన్ కుమార్ గారి వ్యాఖ్య: “భిన్న స్వరాలు” టైటిల్ కిందనే రెండు తలల తో ఒక వ్యక్తి చిత్రం ఉంటే, సాధారణంగా కథలోని ఒక వ్యక్తి యొక్క రెండు రకాల స్వభావాల (ఉదాహరణకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి (kind of double standards), లేదా ఇంకోరకమైన బైనరీ థింకింగ్ పాటర్న్) గురించి ఇలా ఏదో సైకాలజీ పంథాలో కథ ఉంటుంది అని ఊహించాను. కథలోకి వెళ్లాక ఆశ్చర్యానికి లోనయ్యాను.
    “Dycephalic conjoined twins” అని మీరు చెప్పేదాకా అసలు అదొకటి ఉందన్న సంగతి జ్ఞప్తికి రాలేదు.. incredible!! 😊
    ‘ సృష్టి ‘ అనునది పుట్టుక మరియు మూలాన్ని, అలాగే విశ్వం యొక్క దైనిక చర్యను సూచిస్తుంది. మొదటి వాక్యంలోనే ‘ సృష్టి’ అని ఒక ఆస్పత్రికి పేరు పెట్టడం లోనే అంతర్లీనంగా నాకు కథ మొత్తం చదివాక ఒక విషయం బోధపడింది. ప్రాథమికంగా ఒక మనిషి యొక్క దేహం, తల్లి గర్భం యందు దాని నిర్మాణం అనునది దైవ చిత్తం, లేదా సృష్టి తన నియమాల లీలల నిర్ణయం అయి ఉండొచ్చు, ఇంకా చెప్పాలంటే వేరే సైంటిఫిక్ కారణాలు అంటే chromosomal abbarations అయి ఉండొచ్చు. కానీ ఒక మనిషి మానసిక పరిస్థితి ఇంకో మనిషి చేత నిర్మించగలిగేది. అది ప్రాథమికంగా తల్లి తండ్రుల చేతిలోనే ఉంటుంది, తప్పకుండా ఉండాలి అని చెప్పే గొప్ప సందేశాత్మక కథ.
    “మధుమాలిని” గా కథను ఆరంభించి కావేరి కథను నడిపిన తీరు పాఠకునికి ఎంతో ఆసక్తికరం. ఒక చిన్న కథలోనే ఎన్ని మలుపులు! ఎన్ని భావాలు!.. ఎన్ని రసాలు!..
    గయ్యాళి మంగమ్మ యొక్క స్వార్థం, వితంతువు గుణవతి దీన స్థితి, తద్వారా దుర్బలమైన స్థితికి చేరుకున్న కావేరి అలాగే తిరిగి మానసిక బలాన్ని పుంజుకున్న తీరు, చంద్ర శరత్ ల భిన్న స్వరాలు, గోపాలరావు దుర్బుద్ధి, శశిధర్ కి కావేరి పై ఉన్న ప్రేమానురాగాలు, మంచి మనసు..
    ఇవన్నీ కథలో చాలా చక్కగా పండాయి.. గుణవతి మరణంతో కావేరి జీవితం అగమ్యగోచరం. అమ్మ లేని నాకు దిక్కెవరు అని కావేరి ఏడుస్తుంటే కళ్లలో నీళ్ళు తిరిగాయి.
    మీరు ఒక గొప్ప రచయిత అని చెప్పడానికి ఈ కథ ఒక చక్కటి ఉదాహరణ. ఎంతో నేర్చుకోగలిగాను.
    పిల్లలకి బాహ్య ప్రపంచ పరిచయం ఎంతో అవసరం. అది అనుభవం, అవగాహన, మరియు మంచి నిర్ణయాలను తీసుకునే సామర్థ్యాలను ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వివేకాన్ని ప్రసాదిస్తుంది. నిర్బంధంలో పెరిగిన శరత్, చంద్ర ల జీవితం అత్యంత కఠినం. వారికి చదువు చెప్పినా అది నిరర్ధకం. అర్థం లేని జ్ఞానం. అవివేకం తాలూకు కావేరి పై బలవంతపు చర్య, కామ వాంఛతో ఆ ఇరువురి గొడవ విస్మయానికి గురి చేసింది. ప్రథమంగా తల్లిదండ్రుల తప్పు అనే విషయాన్ని తెలియచేస్తుంది. కనికరం లేని మంగమ్మ స్వార్థానికి కావేరీ బలి పశువు..
    మళ్ళీ పిల్లల్ని కంటే వాళ్లూ అలానే పుడతారు అని మంగమ్మ అనుకోవడం, తండ్రి లాంటి స్థానం లో ఉన్న గోపాలరావు కావేరి ని ఆదుకోకపోగా, పిల్లల కోసం ఎంతకైనా ఒడిగట్టాలి అనుకోవడం లాంటి విషయాలు సర్వసాధారణంగా సమాజంలో కనిపించే విషయాలే..
    ఇవి రచయిత యొక్క సామాజిక బాధ్యతను, అజ్ఞానం పట్ల ఆవేదన ను తెలియజేశాయి.
    శశిధర్ మాస్టారు ఒక గొప్ప మనసున్న త్యాగశీలి. అమ్మ కాబోతున్న కావేరిని పెళ్ళి చేసుకోవడం అతని స్వచ్చమైన ప్రేమకు ప్రతీక. కావేరి కి బంధ విముక్తి చేసిన శశిధర్ అభ్యుదయం ఆదర్శనీయం. ఎంతోగాను ఆకట్టుకున్న పాత్ర.
    “నీతిని నమ్ముకున్న నాకు ధైర్యం ఎక్కువ” అన్న కావేరీ మాట, ఆమె మానసిక బలాన్ని ప్రతి బింబించింది. సమాజంలో అణచపడిన ప్రతి వర్గంలో ( లింగ, వర్ణ, కుల, మత మరియు ఏ ఇతర వర్గాలు) కావేరి పాత్ర మానసిక స్థైర్యం నింపుతుంది. సమాజం లో ఏ రకమైన బాధితులైనప్పటికీ కావేరీ నుండి స్ఫూర్తి పొందవలసిందే. అది ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎంత అగాధం లోకి విసిరివేయబడ్డా సరే.. శక్తిని కూడగట్టుకొని, వ్యక్తిగా గొప్పగా ఎదగాలి, ఆదర్శంగా ఇతరులకు నిలబడగలగాలి అని ప్రతి ఒక్కరికి ఉపదేశిస్తుంది ఈ కథ..
    కావేరి, శశిధర్ ల పాత్రలు కథా ప్రపంచంలో చిరస్మరణీయం. శశిధర్ పాత్ర ప్రతి మనిషిలోనూ ఉండవలసిన సహానుభూతి, ప్రేమ, త్యాగాలను తట్టి లేపుతుంది.
    చివర్లో కావేరీ తన కొడుకు దుష్యంత్ కి తన గతం చెప్పిన తీరు, అతన్ని పెంచిన తీరు అభినందనీయం.. అమ్మ మనసు, ఆమె కష్టాన్ని గుర్తించిన దుష్యంత్ పాత్ర ద్వారా.. పిల్లల్ని మనం ఎలా పెంచితే ఎంత వివేకం, సహనుభూతి వాళ్ళలో కలిగి వాళ్ల ఉన్నతికి ఎలా దారి తీస్తుంది అన్న విషయం బాగా అర్థమవుతుంది..
    కొడుకు కోడళ్ల పాత్రలకు.. దుష్యంత్, శకుంతల అని పేరు పెట్టి వాళ్ళకి పుట్టిన కుమారులు మరోసారి భరతవర్షాన్ని నిర్మించే కారణ జన్ములు అని అంతర్లీనంగా పాఠకులకు రచయిత తెలియచేస్తున్నారు అని అనిపించింది.
    (శకుంతలోపాక్యనంలో దుష్యంతుడు- శకుంతల పుత్రుడు భరతుడే ఈ భరతవర్ష నిర్మాణానికి మూలం అని ప్రతీతి).. దానికి శారీరక వైకల్యంతో పని లేదు, మానసిక ధైర్యం అలాగే ఆలోచన శక్తి ఎన్నో మార్పులు తీసుకురాగలదు అని బోధపడుతుంది..
    శారీరక వైకల్యం దేనికి అడ్డు కాదు.. వాళ్ళని ప్రోత్సహిస్తే బుద్ధి బలంతో సాధించగలరు.. అది తల్లి దండ్రుల బాధ్యత. అబ్బి బ్రిటాని ఉదాహారణ అద్భుతం. నాకైతే స్టీఫెన్ హాకింగ్ ని కూడా గుర్తు చేశారు.
    చివర్లో కావేరీ తన కొడుక్కి పిల్లల పెంపకం గురించి ఇచ్చిన వివరణ లో, కథ ద్వారా రచయిత యొక్క ఆవేదన, భావన, మార్పు, తల్లిదండ్రులకు సూచనలు.. అన్ని చక్కగా పాఠకుని హృదయాన్ని తాకుతాయి. ఆలోచింపచేస్తాయి..
    మంచి కథని మా కోసం అందించినందుకు వేల వందనాలు మేడం..🙏🙏 నాకు ఈ కథ, సందేశంతో పాటు, కథ ఎలా రాయాలి అన్న విషయాలకు ఎంత గానో తోడ్పడుతుంది. మీ కథల్ని తొందరగా చదవాలని ఉంది మేడం.
    మీ ప్రొఫైల్ చూసాక ఆశ్చర్యపోయాను. ఎన్ని పీజీలు, పి.హెచ్.డి లు, సంగీతం, రచనలు, పెయింటింగ్.. ఇంకా ఎన్నో.. చాలా అంటే చాలా గ్రేట్ మేడం. 🙏🙏
    ఒక తరానికి మీరు ఆదర్శం. మీరు చేస్తున్న సాహిత్య సేవ, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుతుంది😊😊🙏..

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లలితా భాస్కర్ దేవ్ గారి వ్యాఖ్య: *కథ కొత్తగా వుంది. రెండు తలల వ్యక్తిల గురించి ఎప్పుడో వార్తలలో చదివాను ఎగ్జిబిషన్ లో చూశాను నా చిన్నప్పుడు. అది కథాంశంగా మీరు రాయడం బాగుంది. శశిధర్ మాష్టారుని చంపేయడం బాధ అనిపించింది. శరత్చంద్రలు చివరకు ఏమైనారు?*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బొడ్డాడ బలరాం గారి వ్యాఖ్య: *భిన్న స్వరాలు కథ సినిమాని తలపించే ట్విస్టులతో ఆసక్తికరంగా సాగింది. బాగుంది మేడం. అభినందనలు.🌹🌹

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నాగజ్యోతి శేఖర్ గారి వ్యాఖ్య: *చాలా బావుంది అండీ కథ. మా తూర్పుగోదావరి నేపథ్యంలో రాశారు. మంచి కథ. శుభాకాంక్షలు మీకు💐💐💐🙏 *

  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భమిడిపాటి వెంకటేశ్వర రావు గారి వ్యాఖ్య: *నమస్తే అండి.. మీరు రాసిన ‘భిన్న స్వరాలు’ కథ బాగుంది. కథా శీర్షిక చాలా బాగుంది.. బొమ్మ చూసి దేని గురించి రాశారో అని అనుకున్నాను.. dicephalic conjoined twins subject ను కథా వస్తువుగా ఎంచుకుని చుట్టూ అనేక పాత్రల్ని తీసుకురావడం బాగుంది.. కథా ప్రారంభం బాగుంది.. పాత్రలకు పెట్టిన పేర్లు apt గావున్నాయి.. కావేరి.. దుష్యంత్.. శకుంతల.. (ఈ పేర్లు పెట్టడం వెనుక ఆలోచన ఉంది.) శరత్.. చంద్రల ప్రవర్తన చదువుతూ వుంటే వింతగా అనిపించింది.. శశిధర్ మాస్టారి లాంటి మంచి మనుషుల వల్లే లోకం నడుస్తోంది. ఇక్కడ ఒక డైలాగ్ బాగా చెప్పారు. ‘రెక్కల చప్పుడు ఆకాశానికి వినబడేలా..’ ( గొప్పగా..) కవితాత్మకంగా వుంది. కథలో కొందరి దేవుళ్ళను (దత్తాత్రేయుడు.. పంచముఖి ఆంజనేయుడు.. బ్రహ్మ.. యిలా) చెప్పారు.. కథతో ముడి పడిన గొప్ప పాయింట్ యిది.. చాలా అంటే చాలా బాగుంది.. కథకి మంచి లింక్ యిది. తర్వాత భగవంతుడి ఎందుకు యిలా సృష్టి చేస్తాడు అనేది అంతుపట్టని విషయం. దాన్ని positive గా తీసుకుని మనిషి ఒక మాతృ హృదయంతో పెంచి రక్షించుకోవాలి అనే సందేశం ఇక్కడ యిమిడివుంది. ఇక్కడే మీరు అమెరికా లో ఉన్న యిలాంటి ట్విన్స్ గురించి పేర్లతో సహా చెప్పడం కథకి మరింత బలాన్ని ఇచ్చింది.. మంగమ్మ క్యారెక్టర్ చిత్రించిన తీరు.. అలా వచ్చీ పోయినట్టున్న ఆమె భర్త పాత్ర కూడా కథ లో ఉండటం బాగుంది.. ఒక మంచి పాయింట్ తీసుకుని గొలుసు ఎక్కడా తెగిపోకుండా మంచి కథ రాసిన మీకు అభినందనలు.*

  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇంద్రగంటి నరసింహ మూర్తి గారి స్పందన: *కొన్ని కథలు సాధారణంగా ఉంటాయి. కాలక్షేపానికి చదువుతాం. కాని కొన్ని అసాధారణ కథలు మనసును హత్తుకుంటాయి. చెప్పే విషయాన్ని పాఠకుల మనసుకు హత్తుకునేలా చెప్పగలిగితే ఆ కథ చాలకాలం గుర్తుంటుంది. అలాంటి కథల కోవలోకొస్తుంది ఈ భిన్నస్వరాలు కథ.మధుమాలిని అనే ప్రముఖ నటి సృష్టి ఆసుపత్రికి రావడంతో కథ ప్రారంభమవుతుంది. ఆమె ముఖంలో
    ఆందోళన.. గత జ్ఞాపకాల బాధ కనిపించసాగాయి అని చదవగానే ఆ బాధకు కారణం తెలుసుకోవాలనే ఆత్రుత పాఠకుడిలో కలుగుతుంది. ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ లో కావేరి కనిపిస్తుంది. కావేరి తల్లి ఒక రహస్యం చెప్పబోతూ మరణించడం.. చదువుతూ మరింత ఉత్కంఠతో పాఠకుడు ముందుకు వెడతాడు. ఈ విధంగా కథను నడపగలగడం చేయితిరిగిన రచయిత (త్రు)లకే సాధ్యం.
    ఆ తరువాత ఊహకందని మలుపుతో పాఠకుడు దిగ్భ్రాoతి చెందుతాడు.పులిలా తినేసేవాడిలా చూడసాగింది కుడి తల.. రెప్పవేయకుండా చూడసాగింది ఎడమతల కుడి తల కళ్ళలో రౌద్రం.. ఎడమతల కళ్ళలో ఆప్యాయత.. ఒకే మొండెం.. రెండు మెడలకు రెండు తలలు.. కుడి తల పేరు చంద్రం.. ఎడమతల పేరు శరత్.. రెండు తలలతో ఒకే శరీరం..తల్లి ప్రపంచానికి చూడకుండా పిల్లలను దాచడం..చదువుతూ పాఠకుడు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాడు.మిగతా కథ అనేక మలుపులు తిరుగుతుంది.
    విరుద్ధభావాలను ప్రకటించే పాత్రలతో కథను నడపుతూ ఆ పాత్రలమధ్య సంఘర్షణను ఆసక్తికరంగా మలచడంలో రచయిత్రి ప్రతిభ జ్యోతకమవుతుంది. గాయాల మట్టిలోంచి ఎదిగిన గంధపు పువ్వు… మనసులు రెండు వేరైనా మంచి సంకల్పం ఉంటే జీవితం అద్భుతంగా మారుతుంది..దేవుడు అద్భుతాన్ని సృష్టిస్తాడు. కాని ఆ అద్భుతాన్ని ప్రేమతో పోషించే హృదయం మాత్రం తల్లితండ్రులదే..మన పెంపకం బట్టి పిల్లలుంటారు…వంటి వాక్యాలు పాఠకుల మనసును హత్తుకుంటాయి. రచయిత్రి ఒక అద్భుతాన్ని సృష్టించారు.ఈ థీమ్ కేవలం ఉహాజనితం అని భావించడానికి వీలు లేకుండా అమెరికాలో అబ్బి, బ్రిటానీ ఇలాగే ఉన్నారని పేరుతో సహా ఉదాహరించారు.ఎత్తుగడ ఆసక్తికరంగా.. బలమైన సన్నివేశాలతో..ముగింపు సందేశాత్మకంగా సాగిన కథన శైలి కథను ఆగకుండా చదివిస్తుంది. ఆలోచింపచేస్తుంది.
    సాధారణంగా ప్రతి మనిషిలోను ద్వంద ప్రవృత్తి ఉంటుంది.మేకవన్నె పులులుంటారు. పయోముఖ విషకుంభాలుంటాయి. పైకి మంచిగా కనిపిస్తూ కుట్రలు పన్నేవారు,లోభత్వం ప్రదర్శిస్తూనే దానధర్మాలు చేసేవారు.. భగవంతుడిపై భక్తి ప్రదర్శిస్తూనే అరాచకాలు చేసేవారు మన మధ్యనే తిరుగుతుంటారు. నమ్మించి మోసం చేయడం, అభిమానిస్తూనే అనుమానించడం మనిషికే సాధ్యం.అలాంటి వారికి ప్రతీకగా రెండుతలల
    మనిషి అని మనం విశ్లేషించుకోవచ్చు. మూస కథలకు భిన్నమైన విశిష్ట కథను అందించిన డాక్టర్ శ్రీదేవి శ్రీకాంత్ గారికి అభినందనలు. ఇంద్రగంటి నరసింహ మూర్తి, కాకినాడ.*

  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాళ్ళబండి దుర్గా నాగేశ్వర రావు గారి వ్యాఖ్య: *మేడమ్ మీరు షేర్ చేసిన భిన్న స్వరాలు చదివాను. ప్రముఖ సినిమా నటి మధుమాలిని ఆసుపత్రిలో అప్పుడే జన్మనిచ్చిన డిసెఫలిక్ పారఫాగస్ ట్విన్స్ ను చూడటానికి వచ్చి 25 సంవత్సరాల క్రితం గ్రామీణ వాతావరణం లో కావేరి పేరు తో ఉన్న తనకు మర్చిపోలేని తను అనుభవించిన కష్టాలు డిసెఫలిక్ పారఫాగస్ ట్విన్స్ వారి వైవిధ్యిక అలవాట్లు,మనస్తత్వాలు, వాళ్ళతో ఎదుర్కొన్న కష్టాలు ఏ పరిస్తితులలో ఆ ఊబి లోంచి బయట పడి సినిమా నటి గా మారిన తన రెండు కాలాల జీవితాలను గుర్తు చేస్తూ సాగిన వ్రాసిన కథ చాలా బాగుంది.
    మీరు వ్రాసిన ఈ కథ ద్వారా DP twins వాళ్ళ మనస్తత్వాలు పాఠకులకు తెలియచేశారు.కథ థీమ్ కళ్ళకు కట్టినట్లు వివరించిన విధానం బాగుంది. ఈ విధం గా జన్మించే జంట జన్మలు,మన హిందూ పురాణాలలో ఇలాంటి వృత్తాంతాలు,మిగతా దేశాలలో D P twins గా పుట్టిన వాళ్ళు ఏ విధం గా వారి తెలివి తేటలతో మంచి పేరు తెచ్చుకున్నది వివరించారు.
    చివరగా మీరు వ్రాసిన కథ భిన్న స్వరాలు సంచిక అనే ఆన్లైన్ తాజా సంచిక లో పబ్లిష్ అయినందుకు నా హృదయ పూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. రాళ్ళబండి దుర్గా నాగేశ్వర రావు. హైదరాబాద్.*

  21. 21

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: * డాక్టర్ శ్రీదేవి శ్రీకాంత్ గారు, “Conjoined twins” అనే కొత్త అంశంతో రాసిన “భిన్న స్వరాలు” కథాకథనాలు ఆసక్తికరంగా సాగాయి.
    కావేరి, తన మేనత్త చేతిలో పావుగా మారడం, మేష్టారుతో జీవితాన్ని పంచుకోవాలి అనుకోవడం కానీ, అనుకోని పరిస్థితుల్లో, అత్త కొడుకు(లు) ను తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సి రావడం, భిన్న మనస్తత్వాలు ఆనక తను సినిమా నటి గా మారడం, చకచకా జరిగిపోతాయి. కావేరి కు పుట్టిన బిడ్డ సాధారణంగానే ఉన్నా, అతనికి పుట్టిన శిశువుకు conjoined twins అవడం ఒక విశేషం అయితే వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి అని కావేరి అనుకోవడం చక్కటి ముగింపు.
    పిల్లల పెంపకం గురించి, చెబుతూ పురాణాలను, అమెరికా లోని అవిభక్త కవలలు గురించి ఉదహరించిన రచయిత్రి మన రాష్ట్రంలోని వీణా వాణి లను గురించి కూడా ప్రస్తావించి ఉంటే బావుండేది.
    అలాగే కథకు భిన్న స్వరాలు అనే టైటిల్ కాకుండా మరేదైనా పెట్టీ ఉంటే బావుండేది. ఒక కొత్త పాయింట్ తో కొత్త కథని అందించిన రచయిత్రికి అభినందనలు.*

  22. 22

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి.వి.ఆర్. శివకుమార్ గారి స్పందన: *మీ కథ ఊహకందని వింత వాస్తవిక తో ఆశ్చర్యపరిచింది. (కథనంలో కొంత తడబాటు కనపడింది. మొదటి విరామం తర్వాతి పేరా ఆరంభం సూటిగా లేక, తికమక పెట్టింది.
    గుణవతి తనభర్త చెల్లెలు ఇంట్లో పనిమనిషి…అన్న వాక్యం అర్థం చేసుకోవటానికి నాలుగుసార్లు చదవవలసి వచ్చింది.
    గుణవతి తన ఆడపడుచు ఇంట్లో పనిమనిషి. అని రాస్తే సూటిగా ఉంటుంది. అలాగే.. ఆస్తికోసం తన అన్న మల్లయ్య ను చంపించింది అని చదివి పాఠకుడు తికమక పడతాడు.(మల్లయ్య గుణవతి కి భర్త అని అంతదాకా చెప్పబడలేదు). అందువల్ల, తన అన్న మల్లయ్య అంటే, మంగమ్మకు అన్నయ్యా లేక గుణవతి యొక్క అన్నయ్యనా అనే సందిగ్థతకి పాఠకుడు లోనవుతాడు.
    ఇంక, ఔచిత్యం విషయానికి వస్తే, మల్లయ్య ఆస్తి పరుడు. ఆస్తిపరుడైన భర్త ఉన్న గుణవతి ఆడపడుచు ఇంట్లో పనిమనిషిగా ఎందుకు పనిచేస్తోందో అర్థం కాలేదు. అసాధారణమైన ఈ పరిస్థితికి బలమైన కారణం కథలో చెప్పటం అవసరం. వాక్య నిర్మాణం విషయంలో కొంత శ్రద్ధ అవసరం.
    సీతాపల్లి అడవులతో చుట్టుముట్ట బడిన గ్రామం అనటం సరికాదు. పచ్చని అడవుల మధ్య ఉన్న గ్రామం అని రాయవచ్చు.
    లేదా, సీతాపల్లి గ్రామం నలువైపులా పచ్చని అడవులతో శోభిల్లుతున్న చిన్న గ్రామం అనీ రాయవచ్చు. చుట్టుముట్టబడిన.. అని రాయటంలో కొంత వ్యతిరేక భావం వ్యక్తమవుతుంది.
    సలహాగా చెప్తున్నాను. తప్పుగా భావించకండి.
    ఇంత వైవిధ్యం ఉన్న ఇతివృత్తాన్ని ఇంతకన్నా జాగ్రత్తగా రాస్తే ఇంకా బాగుండేది అనిపించింది. అంతే!
    కొత్త విషయం పాఠకులకు పరిచయం చేయాలన్న మీ ప్రయత్నం అభినందనీయం. అభినందనలు. 🙏*

  23. 23

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చివుకుల శ్రీలక్ష్మి గారి వ్యాఖ్య: * డా. శ్రీదేవి, శుభోదయం 🌹 మీ భిన్న స్వరాలు కథ చదివాను. కవల పిల్లలలో ద్వంద్వ స్వభావం ఉండడం సహజము కానీ ఇలాంటి శరీరాలు కలిసి పుట్టిన పిల్లలలో కూడా అలాంటి స్వభావం ఉంటుంది అన్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది కథను చాలా జాగ్రత్తగా నడిపారు వాళ్ళ పిల్లలు కూడా అలాగే పుట్టడం అనేది చాలా చాలా అరుదు కదా! ఒక మంచి మార్పుతో కథను ముగించారు అభినందనలు*

  24. 24

    రాజ మోహన్ ఇవటూరి

    ఇప్పటి రచయితలలో శ్రీదేవి గారు చాలా విభిన్నమైన అంశాలతో కథలు రాస్తున్నారు. రచనలోనే కాక ఇతరుల కథలని ఎంతో నిశితంగా సమీక్షించటం కూడా ఆవిడ ప్రవ్రుత్తి. ఆవిడ ప్రతిసారీ కథలలో కొత్త ప్రయోగాలు చేయటం అభినందనీయం. గతంలో ఒక కథ మొత్తం కేవలం సంభాషణలతోనే ఆసక్తికరంగా నడిపించి అందరినీ అబ్బురపరిచారు. ఈ కథ కూడా కొత్త ఒరవడితో నడిచింది. విచిత్రమైన పుట్టుకతో జన్మించిన శిశువులని ఎలా పెంచాలి అనే విషయం చెప్పకపోయినా వారి విషయంలో సామాజిక బాధ్యతని నొక్కి చెప్పటమే ఈ కథ ఉద్దేశం అనిపించింది. కథ ముగింపు ఎప్పుడూ సానుకూలంగా ముగించటం వారి ప్రత్యేకత. 

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!