బాధ్యత అంటే ఎవరు చెప్పినా, చెప్పకపోయినా మన పనిని మనం నిర్వర్తించడం. మన పనిని నిర్వర్తిస్తే మనకు చాలా మంచి పేరు వస్తుంది. ఎప్పుటికైనా బాధ్యత మన జీవితంలో ఒక భాగం మరియు ముఖ్యమైనది కూడా అందుకే బాధ్యతను మరిచిపోకూడదు. ఈ ప్రపంచంలో చాలా మందికి బాధ్యత అనే పదం కూడా తెలియదు. ఏ పనినైనా బాధ్యతతో నిర్వర్తించాలి.
ఒక ఊరిలో ఒక అమ్మ, నాన్న, వాళ్లకొక కొడుకు వుండేవాడు. వీళ్ళ కుటుంబంలో ఎవ్వరికి బాధ్యతంటేనే తెలియదు. వాళ్ళ కొడుకు పేరు దినేష్. తను ఇప్పుడు చిన్నవాడే. సుమారు 18 ఏళ్ళుంటాయి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులే పోషించాలి. కాని వాళ్ళు ముసలి వాళ్ళయిపోయారు. వాళ్ళు జీవితంలో ఓడిపోయారు. ఎందుకంటే వీళ్ళకు బాధ్యతే లేదు. దినేష్ వాళ్ళ నాన్నకు ఉద్యోగం లేదు ఎందుకంటే తను బాధ్యతగా ఒక పని అంటే తనకు అప్పజెప్పిన పనిని పూర్తిచేయలేదు. అందుకని ఉద్యోగంలోంచి తీసివేసారు. వాళ్ళ అమ్మ పొద్దునే లేవకుండా, దినేష్‌కు అన్నం పెట్టకుండా తింటాడులే అని అనుకుంది. అక్కడ వాళ్ళ అమ్మ ఓడిపోయింది.
రెండు సంవత్సరాల తరువాత ఇప్పుడు దినేష్‌కు 20 ఏళ్ళు. తను ఉద్యోగం కోసం 2 ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నాడు. కాని అతనికి మాత్రం ఉద్యోగం రాలేదు. ఇప్పుడు దినేష్ మాత్రమే తన కుటుంబాన్ని నిలబెట్టాలి. తనుక ఉద్యోగం రాక వాళ్ళ కుటుంబం అప్పుల్లో మునిగిపోయింది. తను ఇప్పటికే ఆరు సార్లు ఉద్యోగం కోసం ప్రయత్నించినా తను ఓడిపోయాడు. ఎందుకంటే తనకు బాధ్యత లేదు కాబట్టి. ఆరవ పరస్పర దర్శనంలో తను సమయం దాటిపోయాక వెళ్ళాడు. ఇలానే ఆరుసార్లు ఓడిపోయాడు. తన అమ్మ ఒక రోజు పిలిచి “నాయనా ! నిన్ను అసలు ఎవ్వరు ఉద్యోగంలో చేర్చుకోలేదు అంటే నువ్వు బాధ్యత లేకుండా ఉన్నావు కాబట్టి నిన్ను చేర్చుకోలేదు. రేపు నువ్వు ఉద్యోగంలో చేరాక వాళ్ళు నీకు ఏమైనా పని చెబితే నువ్వు నిర్వర్తించకపోతే వాళ్ళు అప్పుడు తిట్టి అందరి ముందు అవమానపరచి, ఇదంతా ఎందుకు అని నిన్న ఇప్పుడే చేర్చుకోవట్లే. అందుకని బాధ్యతతో నీ పనిని నిర్వర్తించాలి. ఇంకా ఒక సారి ప్రయత్నించు. అదీ ఓడిపోతే ఇంకొకసారి ప్రయత్నించు అదీ ఓడిపోతే ఇంకొకసారి ప్రయత్నించు అంతే గాని అసలు వదిలేసుకోవద్దు. ఎప్పటికైనా ప్రయత్నిస్తూనే వుండు. అని చెప్పింది తన అమ్మ. అప్పుడు దినేష్ అనుకున్నాడు. ‘ఎందుకని నాకింత కాలం ఇంత చిన్న విషయం కూడా అర్థం కాలేదు. నేనెందుకు అర్థం చేసుకోలేకపోయాను’ అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. 9వ సారి పరస్పర దర్శనంకు వెళ్ళాడు. వెళ్ళాక ఒక గదిలో ప్యాను తిరుగుతూనే వుంది. కాని ఎవ్వరూ లేరు. తను అది చూసి వెళ్ళి ఆపేసి వచ్చాడు. ఇంకొంచం ముందుకు వెళ్తే హ్యాన్డ్వాష్ బేసిన్లో నీళ్ళు వృథాగా కారుతూ ఉన్నాయి. అది చూసి ఆ కుళాయిని కట్టేసాడు. అప్పుడు ఆ గదికి అంటే పరస్పర దర్శనము గదికి వెళ్ళే సరికి అది మూసేసారు. అక్కడ ఉన్న ఒక మనిషిని అడిగితే “సార్ మీ బాధ్యతను చూసి వాళ్ళు మీకు ఉద్యోగం ఇచ్చారు. ఎంతోమంది పోతూ వస్తూ ఉన్నారు. కాని ఎవ్వరూ మీరు చేసిన పని చేయలేదు” అని అన్నాడు. దినేష్ సంతోషంగా ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేసారు. ఇప్పుడు దినేష్ తన జీవితంలో గెలిచాడు. తన వాళ్ళ అమ్మా నాన్నలాగ ఓడిపోలేదు. తన కుటుంబాన్ని తనే నిలబెట్టాడు. వాళ్ళకున్న అప్పులన్నీ తీరిపోయాయి. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు.
డి.జాయస్ రేణుక
You must be logged in to post a comment.
వాక్కులు-4
పదసంచిక-95
సాధించెనే ఓ మనసా!-14
“మఱ్ఱిమాను – తరతరాల వారసత్వం” – రంజని కవితల పోటీ ప్రకటన
సంచిక పదసోపానం-1
సాఫల్యం-48
పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-2
నా మొహం నాదే!
నాహం కర్తాః హరిః కర్తాః… ఒక జ్ఞాపకం
షోడశ కళానిధికి షోడశోపచారములు
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®