గౌరవ్ చావ్లా తీసిన మొదటి చిత్రం ఇది: “బాజార్”. షేర్ బజార్ కు క్లుప్త రూపం. హాలీవుడ్ చిత్రం “ది వాల్ స్ట్రీట్” నుంచి ప్రేరణ తీసుకున్న ఈ చిత్రం మొత్తం మీద నిరాశ పరిచేదే. మొదటి సగం మరీ, కాస్తో కూస్తో రెండో సగం ఆసక్తికరంగా వుంటుంది. ఇలాహాబాద్ లో తండ్రి, చెల్లెలుతో వుంటాడు రిజ్వాన్ అహ్మెద్ (స్వ. వినోద్ మెహరా కొడుకు రోహన్ మెహరా తొలి చిత్రం ఇది). తండ్రి నిజాయితీపరుడైన ఉద్యోగిగా పేరు తెచ్చుకుని రిటైర్ అయ్యాడు. రిజ్వాన్ కు మాత్రం చాలా తొందరగా ఆర్థికంగా యెదగాలని కోరిక. తండ్రి కున్నటువంటి నిజాయితీ లాంటి ఆదర్శ భావాలు వుండవు. అతని ఆదర్శ నాయకుడు ముంబైలో వుంటున్న స్టాక్ మార్కెట్లో వొక బిగ్ షాట్ శకున్ కోఠారి (సైఫ్ అలి ఖాన్). అతనిలాగే చాలా చిన్న వయసులోనే ఆర్థికంగా యెదగాలని కోరిక. తండ్రి చెంప దెబ్బ కొట్టినా, చెల్లెలు ప్రోత్సహిస్తుంది అతన్ని తను నమ్ముకున్న దారిలో ప్రయాణించడానికి. అలా ఇల్లు వదిలి ముంబైలో అడుగుపెడతాడు రిజ్వాన్. కాని శకున్ ని కలవడం అంత తేలిక కాదు. ముందు వో ట్రేడర్ గా ప్రవేశించడానికి కూడా అడ్డంకులు. అబధ్ధాలాడి, మాయ చేసి యెలాగోలా ట్రేడింగ్ రంగంలో ప్రవేశిస్తాడు. అక్కడ ప్రియా (రాధికా ఆప్టే) తో పరిచయం, క్రమంగా ప్రేమగా పరిణతిచెందడం జరుగుతుంది. కార్పొరేట్ రంగంలోని ఆంతరిక రహస్యాలు ప్రియా అందిస్తూ పోతూ వుంటే ఆ సమాచారాన్ని డబ్బు చేసుకుంటూ కొంత యెదుగుతాడు. చెల్లెలి పెళ్ళి చేయడం, ఖరీదైన ఇంట్లోకి మకాం మారడం అన్నీ చాలా స్వల్ప కాలంలో జరిగిపోతాయి. ఆ తర్వాత అతనికి శకున్ తో కలిసే అవకాశం దొరుకుతుంది. వొకానొక కంపెనీ షేర్లు యెలా పెరగబోతున్నాయో చెబితే అతని లాజిక్ కి ముచ్చటపడి శకున్ అతనికి వంద కోట్ల చెక్కు ఇచ్చి తన బ్రోకర్ గా దాన్ని ఇన్వెస్ట్ చేయమంటాడు, తన డబ్బు మునగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ. మొదటి ప్రయత్నంలో రిజ్వాన్ నష్టపోతాడు. కాని యెల్లప్పుడు అతనితోనే వుండే ప్రియా అతనికి ఇన్సైడర్ వార్తలు అందించడం, దాని సాయంతో ఇన్వెస్ట్మెంట్లు చేయడం, అవి లాభించడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది తర్వాతి కథ. మరో పక్క సెబి ఏజంట్లు శకున్ మీద కన్నేసి వుంచుతారు. ఆ దృష్టి కాస్తా విస్తరిస్తూ రిజ్వాన్ మీద కూడా పడుతుంది. వొకానొక కంపెనీ ని శకున్ తన డబ్బుతో రిజ్వాన్ పేర కొనిపిస్తాడు. ఇరవై శాతం యాజమాన్యం ఇచ్చి. రాజకీయ పరిణామాలు అనుకున్నట్టు సాగవు. షేర్ల విలువ పడిపోతుంది. దానికి ముందే పెద్ద యెత్తున షేర్లు అమ్ముడుపోతాయి. ఇదంతా శకున్ చేసిన కుట్ర అని తర్వాత తేలుతుంది. తను బ్రోకరేజీ గా పొందిన రెండు శాతం అతని ఇరవై శాతం యాజమాన్యం విలువ కంటే యెంతో యెక్కువ అని నవ్వుతూ చెబుతాడు. ఇప్పుడు ఆ కంపెనీ యజమానిగా రిజ్వాన్ సెబి అధికారుల చేతుల్లో చిక్కుకున్నాడు. అతని గతి యేమవుతుంది? ఇదివరకటి వొకానొక బ్రోకర్ లా ఆత్మహత్యా? జైలా? లేదా తిరిగి ఇలాహాబాద్ కు తరలి పోవడమా? దర్శకత్వం స్థాయి చాలా సాధారణంగా వుంది. కథా, కథనం కూడా అంతంత మాత్రం. ఆ పాటలూ అవీ ( వొక్క అధూరా లఫ్జ్ అన్న పాట మాత్రం బాగుంది ) అనవసరంగా సినెమా నిడివి పెంచడానికే తప్ప ఇంక దేనికీ ఉపయోగపడవు. నటన విషయానికొస్తే వొక్క సైఫ్ అలి ఖాన్ నటన మాత్రమే బాగుంది. రాధికా ఆప్టే ఎక్ష్ప్రెషన్లు ఈ మధ్య రెపెటిటివ్ గా అనిపిస్తున్నాయి. అదీ గాక ఆమె పాత్ర కూడా బలంగా లేదు. చిత్రాంగదా సింఘ్ ది కూడా బలహీనమైన పాత్రే. ఇక కొత్తగా వచ్చిన రోహన్ తనని తాను తెలివైన వాడనుకుంటాడు కాని, యెక్కడా ఆ తెలివితేటలు బయటపడవు. వొక్క చోట సొంత తెలివి వుపయోగిస్తాడు, అక్కడా నష్టపోతాడు. లాభించిన ప్రతి సారీ ప్రియా అందించిన సమాచారాల కారణంగానే. ఆ కారణంగా అతని నటన కూడా సమంజసంగా అనిపించదు. అతనొక పావులా మారాడన్న సానుభూతి కొన్ని సన్నివేశాల్లో కలిగేలా vulnerability ని ప్రదర్శిస్తూ నటించగలిగాడు గాని మిగతా సినెమా అంతా వో మోడల్ లా కనిపిస్తాడు. అలా చూసి అలా మరిచిపోతాం ఈ చిత్రం చూసి.
సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.
You must be logged in to post a comment.
గొంతు విప్పిన గువ్వ – 26
అశ్రుకణాల్లాంటి జీవితాలను చూపే ‘మెట్రోకథలు’ ఆవిష్కరణ
రంగుల హేల -5: ముందుమాటలూ – మొట్టికాయలూ
నడకలు నవ్వాలి
సినారె వచన రచనా శిల్పం
వారెవ్వా!-43
ఇదేకదా జీవితం
కాజాల్లాంటి బాజాలు-120: నాకీ స్వతంత్రం వద్దు..
దధీచి
గతి
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®