సంచికలో తాజాగా

వేణు మరీదు Articles 2

"ఏ ఒక్కరి మేఘంలోనైనా నువ్వు ఓ ఇంద్రధనస్సువై విరియాలి..." అని ప్రసిద్ధ అమెరికన్ కవయిత్రి, ఉద్యమకర్త అయిన మయా ఏంజెలూ అన్న మాటను దృఢంగా నమ్మే అధ్యాపకుడు వేణు మరీదు. చిన్న వయసులోనే బోధనలోకి ప్రవేశించిన ఈయన పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యార్థినీ, విద్యార్థుల జీవితాలను ఎంతో ప్రేమతో సునిశితంగా పరిశీలించడం వల్లనే తనకు రచనలు చేయగలిగే శక్తి అబ్బిందని చెబుతున్నారు. తనకు రచన కన్నా బోధన అమిత ఇష్టమని, ప్రభుత్వ కళాశాలల్లో గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లభాష బోధించటం క్లిష్టమైనా కూడా దానినే ఇష్టంగా చేసుకున్నానని శ్రీ వేణు చెపుతున్నారు. ఆలస్యంగా రచనా వ్యాసంగం ప్రారంభించిన ఈ రచయిత ఇప్పటికి 15 కథలు రాశారు.వాటిల్లో నమస్తే తెలంగాణ- ముల్కనూరు సాహితీ పీఠం వారి 2022 సంవత్సరపు పోటీల్లో తృతీయ బహుమతి పొందిన' కాటుక కన్నుల సాక్షిగా...' 2023 ప్ళ్ళపోటీల్లో విశిష్ట బహుమతి సాధించిన 'అతడి నుండి ఆమె దాకా...',ముళ్ళ చినుకులు సంకలనంలోని 'ది టాయిలెట్ గర్ల్,' వెలుగు పత్రికలో వచ్చిన 'నాక్కొంచెం ఇంగ్లీషు కావాలి !' ,వార్త పత్రికలో వచ్చిన 'అచ్చమ్మవ్వ ఆరో నాణెం',సాహితీ ప్రస్థానంలో వచ్చిన 'ప్రెజెంటెడ్ బై వసుధ', జాగృతిలో అచ్చయిన 'అవ్వా బువ్వ పెట్టవే!' సాహితీ ప్రస్థానంలో వచ్చిన 'ఆ నలుగురు లేని నాడు' కథలు మంచిపేరు తెచ్చి పెట్టాయి .ఖమ్మం జిల్లా నుండి వచ్చిన రచయితల చాలా తక్కువగానే తెలంగాణ మాండలికంలో రాస్తున్నారని, తాను ఈ " అతని నుండి ఆమె దాకా...." కథను మన మాండలికంలో రాయటానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని చెప్తున్నారు. .తెలుగులో కథలు రాయటంతో పాటు ఆల్ పోయెట్రీ డాట్ కామ్ వంటి వెబ్ సైట్లలో ఆంగ్ల కవిత్వాన్ని రాస్తున్నారు .వేణు ప్రస్తుతం రచయిత ఖమ్మంలోని బాలికల కళాశాలలో ఆంగ్ల అధ్యాపకునిగా పనిచేస్తున్నారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!