సంచికలో తాజాగా

అన్నమరాజు ప్రభాకర రావు Articles 1

అన్నమరాజు ప్రభాకర రావు గారి తల్లిదండ్రులు శ్రీమతి రమాదేవి, కీ.శే. జనార్దనరావు గార్లు. వీరు మొదట భారతీయ వాయుసేన, తదుపరి భారతీయ జీవిత బీమా సంస్థ)లో పని చేశారు. వీరి పద్యగురువు అవధానాచార్య, కళారత్న, పద్మశ్రీ డా. ఆశావాది ప్రకాశరావు గారు. (అ) గ్రంథములు - తాండవలాస్యము(పద్యకావ్యం), శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రము (సుబోధినీవ్యాఖ్య), ముఖాముఖి-స్తుతివిలాసము(ఖండకావ్య సంపుటి) --- (ఆ) సంభావన పద్యాలు / వ్యాసాలు - ప్రకాశం ప్రదీపనం, గురువందనం, శ్రీ చినజీయర్ స్వామి షష్ట్యబ్ది సంచిక, గజేంద్రమోక్షణ విలాసం (పరిశోధనాత్మక వ్యాసము) వాగ్దేవి కళాపీఠం, డా. ఆశావాది సారస్వత సమ్యగవీక్షణం, (సంకలన గ్రంథాలలో) ; స్వామి అయ్యప్ప (ఆధ్యాత్మిక), మూసీ, పద్యవారధి (సాహిత్య),మాస పత్రికలలో ముద్రిత రచనలు. (A) తాండవలాస్యము - స్వర్ణసాహితీ సమితి సింగరాయకొండ వారిచే (2019) (B) రాష్ట్రస్థాయి పద్యరచన పోటీలు (2020) - నన్నయ భట్టారక పీఠం తణుకు వారిచే, (C) శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రం - (2021) సంస్కార సుధ, వనస్థలిపురం హైదరాబాదు వారిచే పురస్కారాలు పొందారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!