సంచికలో తాజాగా

డా. కె. ఉమాదేవి Articles 1

వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య - కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ - కడప లోనూ పూర్తి చేశారు. ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు. వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి. ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు 'స్త్రీ శరీర విజ్ఞానం', వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం 'హెల్త్ కాలమ్', విశాలాంధ్ర - ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు 'ఆరోగ్యం', 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో 'హెల్త్ కాలమ్' నిర్వహించారు. 1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి 'యవ్వన సౌరభం' శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు. స్త్రీల వ్యాధులు - హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం - సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా - నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!