సంచికలో తాజాగా

జంధ్యాల కుసుమ కుమారి Articles 1

సచివాలయంలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేసిన జంధ్యాల కుసుమ కుమారి గారు తెలుగులో యం. ఏ. చేశారు. సచివాలయం చేతన సాంస్కృతిక సంస్థ నిర్వహించిన వివిధ కవి సమ్మేళన కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలుగువెలుగు, మూసీ, సుపథ, ఋషిపీఠం వంటి పత్రికలలో వీరి వ్యాసాలు వెలువడ్డాయి. వీరి పితృపాదులైన పంచ సహస్రావధాని జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి ఆయన జీవితము సాహిత్యము, విద్వన్ మణి అనే రచనలు చేశారు. 'అఖిలం మధురం' రచన ద్వారా మహా ప్రభు వల్లభాచార్యుల చరిత్ర ప్రచురించారు. 2013 వ సంవత్సరంలో తిరుపతిలో సంస్కృత విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన శ్రీ కృష్ణ దేవరాయల పంచ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వీరికి సత్కారం జరిగింది. 2025 మే నెలలో అక్షర యాన్ సంస్థ (TWWF) ద్వారా 'మాతృ వందనం' పురస్కారం లభించింది.

All rights reserved - Sanchika®

error: Content is protected !!