సంచికలో తాజాగా

డా. శ్రీదేవీ శ్రీకాంత్ Articles 1

డా. శ్రీదేవీ శ్రీకాంత్ స్వస్థలం హైదరాబాద్. వీరి నాన్న గారు రవీంద్రనాథ్. ఇంజనీర్. తల్లి సుశీలాదేవి విద్యావంతురాలు. డా. శ్రీదేవి శ్రీకాంత్ ప్రస్తుతం ఆఫ్రికాలోని బోట్స్వానా దేశంలో ఉంటున్నారు. రెండు పీహెచ్ డీలు - క్లినికల్ సైకాలజీ, ట్రాన్స్ లేషన్ స్టడీస్ లో, ఎంబీఏ, ఎంఫిల్, ఐదు పీజీలు చేశారు. ప్రస్తుతం క్లినికల్ సైకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ 175కిపైగా కథలు, 1750 తెలుగులో గజల్స్ తో పాటుకొన్ని ఆంగ్ల, హిందీ భాషలలో గజల్స్ రాశారు. రెండు వందలకుపైగా తెలుగు కవితలు, అనేక నానీలు, భక్తి పాటలు, హైకూలు, జాన పద పాటలు రాశారు. ఆంగ్ల కవితలు,ఆంగ్ల పాటలు, సైకాలజీలో నాలుగు పుస్తకాలు (ఆంగ్లంలో) వ్రాశారు .The Solaris Bloom ఆంగ్ల కవితా పుస్తకాన్ని, భారత మాతాకు జై కథల పుస్తకం, తప్త తరణి నాటిక, దరహాస చంద్రికలు గజల్ సంపుటి మొదలైనవెన్నో పేర్కొన తగినవి. విశ్వ విలాపం గేయ కావ్యం తానా వారి పోటీలో విశిష్ట బహుమతిని అందుకొంది. నాలుగు నవలలు వ్రాశారు. ఉత్తమ సమీక్షకురాలుగా ప్రశంసలు అందుకున్నారు. చిత్రలేఖనం, కార్టూన్స్ లో ఎన్నో బహుమతులు అందుకున్నారు. మరికొన్ని కథల పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. కథలపై లోతైన సమీక్షలు చేస్తుంటారు. సాహిత్యంతోపాటు చిత్ర లేఖనంలోనూ అనేక బహుమతులు, సన్మానాలు అందుకొన్నారు. అనేక సెమినార్స్ లో పత్ర సమర్పణ చేశారు. కార్టూన్స్, rock paint మొదలైన కళలలో ఉన్నారు. కూచిపూడి, భరతనాట్యం, వీణ వాద్యంలో ప్రావీణ్యం సాధించారు. ఎన్నో బహుమతులు, సన్మానాలు పొందారు.

డా. డి. శ్రీకాంత్ సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ సూపరింటెండెంట్. సబ్రాన మానసిక రోగ చికిత్సాలయం. బోట్స్వానా

All rights reserved - Sanchika®

error: Content is protected !!