శ్రీ ఆర్. వి. వి. రాజా రెక్కలు ప్రక్రియలో ‘అనుబంధం’ శీర్షికన వ్రాసిన ఐదు కవితలని పాఠకులకు అందిస్తున్నాము. ~ 1 నది పరిగెడుతుంది మొలకెత్తే విత్తు ముఖాన్ని చూడ్డానికి చెట్టు నిలబడిపోతుంది వాలే పక్షికి ఆలంబనంగా మిగలడానికి
ఒకరిది ఆనందం మరొకరిది అనుబంధం..
2 బలిసిన కొమ్మలెన్ని ఉన్నా చెట్టు బతకదు ఒంటరి వేరు ఒక్కటున్నా చెట్టు చావదు
అవసరం అంతరిస్తే అస్తిత్వం ప్రశ్నార్థకమే.
3 ఓటమిని గెలుపుగా మలచడం ప్రజ్ఞ గెలుపొటములన్ని సమంగా కొలవటం స్థితప్రజ్ఞ
ఆట మాత్రమే మన అవసరం గెలుపోటములు దైవ పరం.
4 నివురు రెప్పలు కప్పినా నిప్పు చేతులన్ని కాలుస్తుంది కాలం కళ్ళు కప్పినా మనల్ని మరణం ఏదో రోజు కాటేస్తుంది
ఉన్నది లేదనుకోవడం లేనిది ఉందనుకోవడం ఇలాగే బతుకుని తడుముకోవడం.
5 కవిత్వం రాయడం దైవత్వం కవిత్వం చదవడం భక్తితత్వం కవిత్వంకై బతకటం వీరత్వం కవిత్వం లోకి మారడం సహజత్వం
కవిత్వంలో జీవించడం అమరత్వం.
superb sir
బలిసిన కొమ్మ లెన్ని ఉన్నా చెట్టు బతకదు ఒంటరి వేరు ఒక్కటున్నా చెట్టు చావదు ✍🏻👌
You must be logged in to post a comment.
మంచి ఆలోచనలు మనకుండాలోయ్!
యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-24: పలమనేరు
కోకిల కూతలు
నమామి దేవి నర్మదే!! -1
మమత కవితైన వైనం – ఝాన్సీ కొప్పిశెట్టి కవనం
కరోనా కాలంలో అమెరికాలో తెలుగు పూజారుల జీవన పోరాటం
సరిగ పదమని-23
అమ్మ కడుపు చల్లగా-8
దీపావళి
అద్వైత్ ఇండియా-26
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®