సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి వ్యాఖ్య:* ‘అనల్పం’ కథ చాలా బాగుంది. ఏ ఉద్యోగమూ/పని అల్పమైనది కాదనీ, దేని విలువ దానికి ఉంటుందని బాగా చెప్పారు రచయిత్రి. మిషన్ లోని నట్లుతో పోల్చటం సరైన పోలిక. ఎంత పెద్ద మిషన్ అయినా చిన్న నట్టు పనిచేయకపోతే అయిపోయినట్లు చిన్న ఉద్యోగం అయినా విలువైనదే! ..సైనికుడి పాత్ర ను కూడా తీసుకోవటం బాగుంది. ఇప్పుడ మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అంటే సరిహద్దులలో పని చేసే సైనికుల వల్లనే! అటువంటి వారి త్యాగాలకు వెల కట్టలేం! ఇంత మంచి కథ పోటీలకు పంపితే బాగుండేది అనిపించింది.. మధ్యలో ‘ఈ కథ ఎందుకు రాశానంటే..’ అనే విషయం చెప్పటం వైవిధ్యమయినది. సంచికలో నేను ఇదే మొదటిసారి చూడటం.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారి స్పందన: *అనల్పం కథ చాలా బాగుంది అన్నందుకు ధన్యవాదాలు మురళీకృష్ణ గారూ . చిన్న పనులు అనుకున్నవాటిని మిషన్ లో నట్లు తో పోల్చటం బాగుందని .. సైనికుని పాత్ర బాగుందని అన్నందుకు థాంక్స్ అండీ .. పోటీకి పంపించవలసిన కథ 😊అన్న మీ మాటలలోని కథాభిమానం నన్ను ఆనందపరిచింది ..🙏*

  3. 3

    ఎం.వి.ఎస్. రంగనాధం

    తమ పిల్లలని ఇంజనీరింగు (Engineering), మెడిసన్ (Medicine) చదివించి తీరాల్సిందేననే పిచ్చ మన వేపు బాగా ముదిరిందనే చెప్పాలి. మొదట్లో ఇంటర్మీడియట్ (Intermediate) అయిన తర్వాత వాటికి సంబంధించిన కోచింగు ఇనిస్టిట్యూట్లలో (coaching institutes) చేర్చేవారు. మెల్లగా అది పదో తరగతి (Tenth class) అవ్వంగానే చెయ్యడం మొదలు పెట్టారు. అంటే, ఇంటర్మీడియట్ ఒక కాలేజీలో (college) చదివిస్తూ ఈ విధమైన కోచింగుకి వేరే ఇనిస్టిట్యూట్కి పంపడం మొదలు పెట్టారు. అప్పుడు, రెండూ ఒక చోటే ఉంటే బాగుంటుందని అనిపించడంతో రెసిడెన్షియల్ (residential) కాలేజీలు మొదలయ్యాయి. ఇంకా, ఒకడుగు ముందుకేసి, ఇప్పుడు బహుశా 7-8వ తరగతి అవ్వంగానే పిల్లల్ని రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూట్లలో చేరుస్తున్నారు. అక్కడ, మామూలు చదువుతో పాటు ఇంజనీరింగు, మెడిసన్ ఎంట్రెన్స్ (entrance) పరీక్షలకి తయారు చెయ్యడానికి పిల్లల్ని రుబ్బుతారట. ఈ పిచ్చ ఎంత ముదిరందంటే, ఆడ పిల్లలకి జడ వేస్తే టైం (time) వృథా అవుతుందని వాళ్ళకి ఒక ఇనిస్టిట్యూట్లో గుండు కొట్టించారని ఎక్కడో చదివాను. ఒక ఏడాది ప్రత్తి పంటకి మంచి ధర వచ్చిందని ఆ మరుసటి సంవత్సరం అదే పంట వేసే రైతులకీ మనకీ ఏమన్నా తేడా ఉందా?

    మనం చదువులో పైకి వెళుతున్న కొద్దీ శ్రమైకజీవనం (dignity of labour) అంటే తక్కువ అభిప్రాయాన్ని పెంచుకోవడం వల్ల, పోల్చుకోవడం (comparison) అంటే సరియైన అవగాహన లేకపోవడం వల్ల జరిగే అనర్థాల గురించి ఈ కథలో చాలా బాగా వివరించారు. ఎప్పటికప్పుడు, వేరే ఎవరితోనో కాకుండా, మొన్నటి నిన్నటి నాతో ఇవాల్టి నన్ను పోల్చుకుంటే ఈ కన్ఫూజన్ (confusion) ఉండదు.

  4. 4

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    రంగనాథం గారూ .. నమస్కారం
    మీ ఈ సుదీర్ఘమైన కామెంట్ వల్ల ఎంతగా మీరు ఈ కథ కు కనెక్ట్ అయ్యారో .. నా అభిప్రాయాలతో ఎంతగా ఏకీభవిస్తున్నారో అర్ధమయింది . అద్భుతమైన మీ స్పందన ఆశ్చర్యాన్ని కలిగించింది . ఈ నాటి విద్యావిధానం ,దానిపట్ల తల్లిదండ్రుల పోకడ విషయంలో మీ మాటల్లో వ్యక్తమవుతున్న కోపం , ఆవేశం ఈ సమాజం పట్ల మీరెంత బాధ్యతాయుతంగా ఆలోచిస్తారు అసలైన చదువులకోసం ఎంతగా ఆరాటపడతారు అన్న విషయాన్ని చెప్పకచెపుతోంది .మీరు విద్యాధికులు ,ఉన్నత పదవిలో వున్నవారు , కవి , రచయిత , మంచి విమర్శకులు .. ఒక్కమాటలో చెప్పాలంటే మేథావి .. అందుకే మీ ఆలోచనా ధోరణి , మీ సలహాలు ఇంత ఉన్నతంగా వున్నాయి మీలాంటివారు మాట్లాడితే ఇలాగేవుంటుంది అన్నట్టు . ఇంత మంచి stander comment పెట్టినందుకు మీకు ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే .. ఇలాంటి కామెంట్స్ రచయిత రచనకు విలువను పెంచుతాయి .. ఆవిధంగా నేను ధన్యురాలిని .. థాంక్స్ అండీ 🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!