సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
మాస్టర్ వినాయక్‌గా ప్రసిద్ధి చెందిన వినాయక్ దామోదర్ కర్ణాటకి 1930- 1940 దశకాలలో హిందీ, మరాఠీ సినిమాల్లో నటుడు, చిత్ర దర్శకులు.
19 జనవరి 1906న మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించిన ఆయనలో సినిమా సంబంధిత ప్రతిభ మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమలో గాఢమైన సంబంధాలను కలిగి ఉన్నారు. ఆయన భార్య పేరు సుశీల. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు, దివంగత నటి నందా; చిత్ర నిర్మాత/దర్శకుడు జయప్రకాష్ కర్ణాటకి.
ఆయన కుటుంబంలోని పలువురు ఇతర సభ్యులు కూడా సినీరంగంతో సంబంధాలు ఉన్నవారే. ఆయన సోదరుడు వాసుదేవ్ కర్నాటకి సినిమాటోగ్రాఫర్. ప్రముఖ నటుడు బాబూరావు పెంధార్కర్ (1896–1967) మాస్టర్ వినాయక్ సమీప బంధువు. ఆయన ప్రముఖ సినీ దర్శకుడు వి. శాంతారాం తల్లి తరపు బంధువు. మాస్టర్ వినాయక్ మంగేష్కర్ కుటుంబానికి గొప్ప స్నేహితుడు, శ్రేయోభిలాషి కూడా.
మాస్టర్ వినాయక్ సినిమా ప్రభావం కుటుంబ సంబంధాలకు మించి విస్తరించింది. ఆయన మాయా మశ్చీంద్ర (1932), వి శాంతారామ్ దర్శకత్వంలో అయోధ్యేచ రాజా (1932), సింహగడ్ (1933), సైరంధ్రి (1933), డాక్టర్ కోట్నిస్ కీ అమర్ కహానీ (1946), భిఖరన్ (1935), సంగం (1941), మాఝే బాల్ (1943) వంటి విజయవంతమైన చిత్రాలతో కెరీర్‌ను ప్రారంభించారు.
1935లో, అతను ‘విలాసి ఈశ్వర్’ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు, ఇందులో శోభన సమర్థ్, ఇందిరా వాడ్కర్, బాబూరావ్ పెంధార్కర్లతో కలిసి నటించారు. అదే సంవత్సరం ఆయన అదే తారాగణంతో నిగాహ్-ఎ-నఫ్రత్ (1935)కి దర్శకత్వం వహించారు. 1936లో, హన్స్ పిక్చర్ అనే సంస్థకు సహవ్యవస్థాపకులై, చలనచిత్ర రంగం అభివృద్ధికి గణనీయంగా తోడ్పడ్డారు. 1938లో వచ్చిన మరాఠీ చిత్రం ‘బ్రహ్మచారి’ వారి సినిమాల్లో గుర్తుండిపోయేదిగా నిలిచింది, ఎందుకంటే ఆ సినిమాలో అప్పటి ప్రముఖ హీరోయిన్ మీనాక్షి శిరోద్కర్ స్విమ్ సూట్లో ధరించి కనిపిస్తారు. ఆ కాలంలో అది సాహసోపేమైన చర్య! అందుకే మీనాక్షి కూడా చరిత్రలో నిలిచారు. మీనాక్షి శిరోద్కర్ – శిల్ప మరియు నమృత శిరోద్కర్‌ల బామ్మ.
ఛాయా (1936), ధర్మవీర్ (1937), జ్వాల (1938), బ్రహ్మచారి (1938), దేవత (1939), బ్రాందీ కి బోటల్ (1939), బ్రాందీచి బాట్లీ (1939), లగ్నా పహవే కరుణ్ (1940), ఘర్ కీ రాణి (1940), అర్ధాంగి (1940), అమృత్ (1941), సర్కారీ పహునే (1942), మజే బాల్ (1943), బడీ మా (1945), సుభద్ర (1946), జీవన యాత్ర (1946), మందిర్ (1948) వంటి అనేక చిత్రాలకు మాస్టర్ వినాయక్ దర్శకత్వం వహించారు.
నటన దర్శకత్వంతో పాటు, మాస్టర్ వినాయక్‌కి మరో ఘనత కూడా ఉంది. తను నిర్మించిన ‘పహిలీ మంగళగౌర్’ సినిమా ద్వారా లతా మంగేష్కర్‌ను చిత్రరంగానికి పరిచయం చేయడం ద్వారా పరిశ్రమకు ఒక గొప్ప గాయనీమణిని అందించడంలో కీలక పాత్ర పోషించారు.
ఆయన మార్గదర్శక కృషి ద్వారా ఆయన వారసత్వం కొనసాగుతుంది, భారతీయ సినిమాపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. మాస్టర్ వినాయక్ 1947 ఆగస్టు 19న ముంబైలో మరణించారు.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.
You must be logged in to post a comment.
తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-15
దిక్కు నేనున్నానని..!
ఆవిష్కృతి
కశ్మీర రాజతరంగిణి-33
అంతర్ముఖం
తల్లివి నీవే తండ్రివి నీవే!-38
అమెరికా జనహృదయ సంగీతం – కంట్రీమ్యూజిక్-12. టామీ వైనెట్ – స్టాండ్ బై యువర్ మ్యాన్
మా బాల కథలు-3
రామం భజే శ్యామలం-4
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®