సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
భారతీయ సినిమా ప్రపంచం వెండితెరపైనా, తెర వెనుక అనేక మనోహరమైన, హృద్యమైన ప్రేమకథలను చూసింది.
ప్రముఖ దర్శకనిర్మాత గురుదత్, మంత్రముగ్ధులను చేసే నటి వహీదా రెహ్మాన్ మధ్య అలాంటి అనుబంధం కొనసాగింది.
అయితే, వారి సాన్నిహిత్యం వారు కలిసి చేసిన సినిమాల వలె సంక్లిష్టంగా, నాటకీయంగా ఉండేది.
‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’ వంటి విజయవంతమైన చిత్రాలకు ప్రసిద్ధి చెందిన గురుదత్, 1956లో ‘సిఐడి’ చిత్రం సెట్స్‌లో వహీదా రెహమాన్‌ను మొదటిసారి కలిశారు. ఆమె హుందాతనానికీ, ప్రతిభకు గురుదత్ వెంటనే మంత్రముగ్ధులయ్యారు.
మరో వైపు, వహీదా గురుదత్ లోని సృజనాత్మక మేధావిని ప్రశంసించారు.
గాయని గీతా దత్‌ని వివాహం చేసుకున్నప్పటికీ, గురుదత్ వహీదా పట్ల గాఢంగా ఆకర్షితులయ్యారు.
వారి మధ్య వికసించిన అనుబంధం వారు కలిసి పనిచేసిన సినిమాలలో ప్రతిబింబిస్తుంది. ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’ సినిమాలలో చిత్రీకరించిన బాధ, కోరిక, వారి కల్లోల బంధం నుండి ప్రేరణ పొందాయని అంటారు.
నస్రీన్ మున్నీ కబీర్ వ్రాసిన ‘గురు దత్: ఎ లైఫ్ ఇన్ సినిమా’ అనే పుస్తకంలో వహీదా రెహ్మాన్, గురుదత్ గారి గురించి చెబుతూ – ఆయనకి వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ, ఎల్లప్పుడూ సానుభూతితో ఉంటూ, అర్థం చేసుకునేవారని అన్నారు. “గురుదత్ గారు చాలా సెన్సిటివ్, కానీ చాలా సెన్సిబుల్ కూడా. ఆయన తన వ్యక్తిగత భావాలను మా వృత్తిపరమైన సంబంధాన్ని ప్రభావితం చేయనివ్వరు” అన్నారు వహీదా.
అయినప్పటికీ, వీరి అనుబంధం ఎన్నో వివాదాలను రగిల్చింది. గురుదత్ మద్యపానంపై అతిగా ఆధారపడటం, ఆయన వ్యక్తిగత జీవితం – వీరి అనుబంధాన్ని దెబ్బతీసింది. అయినప్పటికీ, వారిద్దరి మధ్య పరస్పర గౌరవం, అభిమానం చెక్కుచెదరలేదు.
2013లో ఫిల్మ్‌ఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, వహీదా రెహ్మాన్, “గురుదత్ అద్భుతమైన వ్యక్తి. ఆయన అంతర్ముఖుడు, అయినప్పటికీ, మీరు బాగా పరిచయస్థులయితే, ఆయన ఆగకుండా మాట్లాడుతారు. మేము అందమైన అనుబంధాన్ని పంచుకున్నాము. మేము మంచి స్నేహితులం” అని చెప్పారు.
1964లో గురుదత్ విషాద మరణంతో వారి అనుబంధం ముగిసింది. ఆ సమయంలో వారు కలిసి లేనప్పటికీ, ఆయన మరణంతో వహీదా తీవ్రంగా ప్రభావితమయ్యారు.
వారి ప్రేమ కథ, విషాదాంతమే అయినప్పటికీ, లోతైన భావోద్వేగాల కారణంగా చిరకాలం గుర్తుండిపోతుంది.
గురుదత్, వహీదా రెహ్మాన్‌ల అనుబంధం – ప్రేమ, గౌరవంతో కూడినది. వారిరువురు సృజనాత్మక అభిరుచిని పంచుకున్నారు.
ఇది – సాధారణమైన వాటిని అధిగమించి, వారు కలిసి సృష్టించిన టైమ్‌లెస్ క్లాసిక్‌లలో ప్రతిధ్వనించే ప్రేమకథ!
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
‘తెలుగింటి అత్తగారు’ పుస్తకావిష్కరణ సభ – నివేదిక
గొంతు విప్పిన గువ్వ – 19
అజ్ఞాత పాత్రలా-1
దధీచి
పహరా హుషార్
రెండు ఆకాశాల మధ్య-16
రామం భజే శ్యామలం-3
దీపావళి – అక్షర రమ్యత!!
ఉపవాస వైశిష్ట్యం
ఆకుపచ్చ పురుగు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®