సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారి అనువాద ఆత్మకథాసంచిక. “ఆటుపోట్లకావేరి” ఎంతో ఆదర్శవంతం. స్ఫూర్తిదాయకం. జీవితంలో ఎంత దుఃఖాన్ని అనుభవించినా ధైర్యంతో, బాధ్యతతో ఎలా నెగ్గుకు రావాలో తెలిపేది కావేరిగారి ఆత్మకథ “పీపింగ్ త్రూ మై విండో”. కావేరిగారి జననం నుండి ఈ ఆత్మకథను వివరించిన తీరు అభినందనీయం. ఆరోజుల్లో వాళ్ళ నాన్నగారు ఎలా క్రమశిక్షణతో పెంచారు, అప్పటి కుటుంబాల్లో నాన్నలు ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు, తమ్ముడు చందన్ చేసిన కొంటెచేష్టలు, చెల్లెలు మాల సున్నితత్వం, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్యల గురించిన వివరణ, ఎనిమిదేళ్ల చిన్నారి అయిన కావేరిగారు ఇంటిపై రాళ్లు రువ్వుతున్న మూక పైకి “రాణిలక్ష్మిబాయి” లా విరుచుకు పడినతీరు ప్రశంసనీయం. ఈ అనువాద ఆత్మకథ చదువుతున్న కొద్దీ తరువాత ఏం జరుగుతుందో అన్న ఆసక్తి రెట్టింపవుతుంది. మరో ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా, కథ ఇంకెన్ని మలుపులు తిరగబోతుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.
    కుమారి అమరవాది మృణాళిని
    గజ్వేల్. సిద్ధిపేట జిల్లా.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఆత్మీయ కావేరి:
    తెలుగు సాహిత్యంలో ఆత్మకథలకు ఒక ప్రత్యేకస్థానం వుంది. ఆత్మకథలు అంటే వైయక్తికజీవిత విశేషాలే. కాని ఆత్మకథలు రాసుకున్నవారు కవులు, రచయితలు అయితే అవి విశిష్ట ప్రాధాన్యతను సంతరించుకొని పాఠకులను ఆకర్షిస్తాయి. కావేరి చటోపాధ్యాయ విశ్రాంత ఆంగ్ల ఉపాధ్యాయురాలు. అస్సాం రాష్ట్రంలో పుట్టిన ఈమె, ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లోని బారక్ పూర్ లో నివాసముంటున్నారు.
    శ్రీమతి కావేరి చటోపాధ్యాయ గారు ఆంగ్లంలో రాసుకున్న ఆత్మకథను ఉస్మానియా తెలుగుశాఖ విశ్రాంత ఆచార్యులు డా.వెలుదండ నిత్యానంద రావుగారు తెలుగు చేశారు. చాలామంది అనువాదం అనగానే చదవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కాని సంచిక తెలుగు సాహిత్య వేదిక లో ధారావాహికంగా ప్రారంభమైన ఆటుపోట్ల కావేరి ఆత్మకథ పాఠకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. మూలకర్త ఆంగ్లంలో ప్రావీణ్యురాలు, కవయిత్రి, రచయిత్రి. కవితాత్మకంగా వర్ణిస్తూ తన ఆత్మకథను రాసుకున్నారు. ముఖ్యంగా ఆమె తన జీవనసమరంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను, వాటికి ఎదురొడ్డి నిలబడ్డ తీరును ఇందులో వర్ణనాత్మకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా కాన్సర్ మహమ్మారి బారినపడ్డ తాను ధైర్యంగా ఎలా ఎదుర్కొని నిలబడ్డదో ఇందులో వివరించారు.
    అనువాదకుడు నిత్యానందరావు తెలుగు భాషలో ప్రసిద్ధ విమర్శకుడు. చక్కని శైలితో ఆకర్షణీయంగా ఆంగ్ల గ్రంథాన్ని తెలుగు చేశారు. ఈ ధారావాహికను చదువుతుంటే ఒక తెలుగు పుస్తకాన్ని చదువువుతున్న అనుభూతి కలుగుతుందే తప్ప అనువాద గ్రంథాన్ని చదువుతున్నా మనిపించడం లేదు. ఇదే ఇక్కడి ప్రత్యేకత. తెలుగు నుడికారంతో సాగుతున్న ఈ ధారావాహిక పాఠకులను విశేషంగా చదివిస్తున్నది. కావేరి పుట్టిన నాటి విశేషాలను చెప్పిన తీరు పాఠకులను ఇట్టే ఆకర్షిస్తుంది. సాధారణంగా తనుపుట్టిన నాటి విషయాలను చెప్పేటప్పుడు “అట…అట..” అన్న పదాలతో చెబుతారు. కాని ఇక్కడ నాటకీయ శైలిలో తాను చూసినట్లుగానే వర్ణించడం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. అలాగే కావేరి బాల్యం నాటి విశేషాలు చక్కని శైలితో వివరించబడ్డాయి. మిగతా భాగాలు ఎప్పుడెప్పుడు చదువుదామా అన్న ఉత్సుకతను పాఠకులలో కలిగిస్తున్నది ఈ ధారావాహిక. బెంగాలీ ప్రాంత విశేషాలను వర్ణిస్తున్న ఈ ఆత్మకథను ధారావాహికంగా ప్రతివారం ప్రచురించి చదువరులను ఉత్సాహ పరచడానికి పూనుకున్న సంచిక తెలుగు సాహిత్యవేదిక యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
    ✍️డా.వేంకటేశ్వర రావు. (Teacher) మహబూబ్ నగర్ (జిల్లా)

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!