రచయిత ఆర్.సి. కృష్ణస్వామి రాజు రచించిన 19వ పుస్తకం ‘యద్భావం తద్భవతి’ 11/05/2025 న తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమలో ఆవిష్కరింపబడింది.
ఆశ్రమ సెక్రటరీ స్వామి సుకృతానందజీ అధ్యక్షతన అన్నమాచార్య ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మేడసాని మోహన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివ మూర్తి ఆత్మీయ అతిథిగా, ప్రవచన కర్త గరికపాటి రమేష్ బాబు సమీక్షకులుగా వ్యవహరించగా, రచయిత కే.ఏ.ముని సురేష్ పిళ్ళె, ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు, ఏ. మల్లేశ్వర రావులు కూడా ఈ సభలో పాల్గొన్నారు.