[ముహమ్మద్ ఎల్ కుర్ద్ రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Mohammed El-Kurd’s poem titled ‘Wednesday’ by Mrs. Geetanjali.]
~
(విషాదంలో ఉన్న మనిషేమి నృత్యం చేస్తున్న ఎలుగుబంటి కాదు ! -ఎయిమ్.సెసాయిర్)
కొత్తగా పుట్టిన శిశువు కళ్లల్లో మృత్యువు కనిపిస్తోంది. ఆ పసిపాప మోసపూరితమైన ఓటమిని గురించి ఆరోపించడం విన్నాను. ఎప్పటినుంచో కొనసాగుతున్న పాత ఉపద్రవమే ఇది అంటుంది. పాప చెవుల్లో హోరు మాత్రం నిశ్శబ్దం కోసమే ఈ విధ్వంసం అంటుంది. పాప మూగదైనప్పుడు ఉరుములు ఉవ్వెత్తున వస్తాయి. ఎంత దుర్భరమైన దశ ఇది? అతను కొంచెం ముందుకు తప్పుకున్నాడు నీ గమ్యం ముందే నిర్ణయించబడినప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? * ఈ ఆసుపత్రిలో జీవితం మమ్మల్ని చూసి నవ్వుతుంది. ఎంత దీర్ఘకాల నిరీక్షణ ఇది? గాలి భీకరంగా వీస్తున్నది. ఎక్కడైనా పెళ్ళేమైనా జరుగుతున్నదా ? నర్స్ మబ్బులు కమ్ముతున్నాయని అంటోంది. నేనో పిచ్చి పూవునైతే.. వర్షంలో తడిసి నలిగిపోయే దాన్ని. వాళ్ళామెను ఈ చిన్ని పువ్వుకేమైంది ఇలా నలిగిపోయిందని అడిగారు. వాళ్ళడగాల్సింది ఏంటి.. ఈ అదుపులేకుండా కురిసే వర్షాన్ని కదా?
మూలం: ముహమ్మద్ ఎల్ కుర్ద్ (Mohammed El-Kurd)
అనువాదం: గీతాంజలి
మొహమ్మద్ ఎల్-కుర్ద్ పాలస్తీనాలోని జెరూసలేంకి చెందిన కవి, రచయిత. అతని రచనలు – ది గార్డియన్, దిస్ వీక్ ఇన్ పాలస్తీనా, అల్-జజీరా ఇంగ్లీష్, ది నేషన్, ఇంకా రాబోయే వాక్యూమింగ్ అవే ఫైర్ ఆంథాలజీ మొదలైన వాటిలో ప్రచురితమయ్యాయి.
మహ్మద్ సవన్నా కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ నుండి B.F.A. తో పట్టభద్రుడయ్యాడు. అక్కడ అతను రాడికల్ బ్లాంకెట్స్ అనే అవార్డు-విన్నింగ్ మల్టీమీడియా కవిత్వ పత్రికను నిర్వహించాడు. అతను ప్రస్తుతం M.F.A చదువుతున్నాడు.
బ్రూక్లిన్ కళాశాల నుండి కవిత్వంలో. అతని పొయెటిక్-ఔడ్ ఆల్బమ్, బెల్లీడాన్సింగ్ ఆన్ వుండ్స్, పాలస్తీనియన్ సంగీత కళాకారిణి క్లారిస్సా బిటార్ సహకారంతో విడుదలైంది. కవిత్వం, రచనలతో పాటు, ఎల్-కుర్డ్ ఒక విజువల్ ఆర్టిస్ట్, ప్రింట్ మేకర్, ఇంకా, ఫ్యాషన్ కలెక్షన్ కో-డిజైనర్ కూడా.
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఓ భావుకుడి ప్రణయ భావన ‘ఆనందవర్ధనం’ కవిత
కొత్త ఫీచర్ ‘ఐశ్వర్య రహస్యం’ – త్వరలో ప్రారంభం – ప్రకటన
ఆకలి
మంత్రకత్తె ఆటకట్టు
స్నిగ్ధమధుసూదనం-5
ఒకరితో ఒకరుగా అల్లుకున్న ఆనంద విషాదాల కలయికే కుటుంబం అని చెప్పిన నవల FAMILY LIFE
మానవతను తట్టిలేపే కథలు – ‘అభిశప్త’
వరాలు ఎందుకు?
‘వారణాసి’ – పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం
మల్లె పువ్వు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®