Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘వ్యామోహం’ – సరికొత్త ధారావాహిక ప్రారంభం – ప్రకటన

శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.

***

సౌమ్యది బళ్ళారి. సాకేత్ బరంపురం. ఇద్దరూ తెలుగువాళ్ళే. కులగోత్రాలడ్డు రాకపోవడంతో ఇరు కుటుంబాల వాళ్ళు వీళ్ళ ప్రేమనంగీకరించి మూడు ముళ్ళు వేయించారు.

“ఇన్‌ఫాచ్యుయేషన్ అంటే అకర్షణ. వ్యామోహం అంటే అబ్సెషన్. తెలుగు పదాల్ని ఇంగ్లీషులో చెప్తే కాని అర్థం కాని స్థితికి వచ్చేశాం. ఇంతకీ మీ సమస్య ఏది?” అడిగాడు జనార్దనమూర్తి.

“రెండూను” చెప్పింది సౌమ్య.

“రెండూ ఏకకాలంలో వుంటానికి వీల్లేదు. ఆకర్షణ అధికతరమైతే ప్రేమగా మారుతుంది. ప్రేమ తీవ్రతరమైతే వ్యామోహంగా మారుతుంది. వ్యామోహం వల్ల ప్రేమలో సమస్యలొస్తాయి. తెలివిడితో సమస్యలను పరిష్కరించుకొంటే ప్రేమ మరింత చిక్కనౌతుంది తప్ప తగ్గదు.”

“ఏమో! మేము రాత్రింబవళ్ళు ఎడతెరిపి లేకుండా చర్చించుకొంటూనే ఉన్నాం. పరిష్కారం దొరకలేదు. అందుకే విడిపోతున్నాం” చెప్పాడు సాకేత్.

“చర్చించుకొన్నారా! వాదించుకొన్నారా!” అడిగాడు జనార్దనమూర్తి.

“రెండూ ఒకటే కదా! కాకపోతే మాట తేడా!” తేలిగ్గా కొట్టిపారేసింది సౌమ్య.

***

ఆసక్తిగా చదివించే ‘వ్యామోహం’ ధారావాహిక వచ్చే వారం నుంచే..

చదవండి.. చదివించండి..

‘వ్యామోహం’

Exit mobile version