Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విశ్వావసు

[శ్రీ వీరేశ్వర రావు మూల రచించిన ‘విశ్వావసు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

రోజు తోట లోకి వెళ్ళాను
మామిడి పూల పుప్పొడి అద్దుకోవడానికి
కోయిల పాత పల్లవుల్ని పాతి పెట్టి
కొత్త గానం అందుకుంది
వేప పూత విరగ కాసి
మామిడి సంగమానికై ఎదురు చూస్తోంది!
చెరకు గడ తన లోని తియ్యదనాన్ని
నా కవనానికి ధార పోసింది!
ఆకుపచ్చ వలువని వసంతానికి
ప్రకృతి చుట్టబెట్టింది!
ఆరు ఋతువులలో రాణి
వసంతం!
వనమంతా వసంత విహారం
పదహారు వత్సరాల పూబోణి వోలే
హంసయాన ఆమె
హరిణలోచన భామ
ఇది ఉగాది
విశ్వావసుకి ఆది
ప్రజల విశ్వాసాన్ని పెంచే కాలచక్రం!
విశ్వాన్ని ఆశీర్వదించే విశ్వావసు
అనంత కాలచక్రాన్న విశ్వేశ్వర ‘వసు’!

Exit mobile version