[డా. ఐనాపురపు జానకి గారు రచించిన ‘విశ్వావసు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
అందుమా దైవమా అందనిదే దైవమా
అందమే దైవమా ఆనందమే ధైవతమా
ఆత్మలింగ తత్పరమే సాలగ్రామ భావమా
అర్ధ నారీశ్వరమే వేంకటా ఈశ్వరమా
ద్వైతమద్వైతమై విశిష్ట మద్వైతమే
మా మతమూ మీ మతమూ పోయివచ్చు మన మతమే
శాతవాహనమూ సహస్ర స్తంభ ప్రాభవమూ
త్రిలింగ కళా వైభవమూ తిరంగ పతాక విజయమూ
విశ్వ విజేత భారతమే నవ్య భువన భవితగా
యువత గతుల మార్చగా నవ శక్తి యుతులుగా
ఆకాశంపై బ్రాహ్మోస్గా పృథ్వి నాగ అస్త్రాలే
భరతమాతశక్తి విశృంఖలమై విస్తరించగా
వేలవేలయుగాల చరితలతో రీతులతో
నవయుగాది విశ్వావసుగా వసుప్రదగా సుప్రజగా
వేపచేదు వేదమని తేనెరుచిని కలుపుకొని
మావిచిగురు భావనతో వలపు పులుపు తెలుసుకొని
ఉగాదిలేహ్య మనబడే అమృత ప్రాయ పచ్చడితో
ప్రారంభమైన వసంతమే సంతసమే సంతతమే