[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘విషాదంలోనే వినోదం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
చీకటితో సావాసం
శోకానికి దాసోహం
వికలమైన మనసుతోనే
సకలమనుకునే భావన
ఇక వుండవేమోగా
సుఖాల కోసం పాకులాటలు
పైకి నవ్వుతూ లోన విలపించే విచిత్రాలు
విషాదంలోనే వినోదం చూసే
విద్యలో ఆరితేరిపోయాక
కష్టానికైన కష్టమే కదా
నన్ను తేరిపారా చూడడానికి
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.